ఖండతీరం నుంచి 180 మీ. లోతు వరకు ఉన్న ఖండ భాగాన్ని ఏమని పిలుస్తారు?
1. ఖండతీరం నుంచి 180 మీ. లోతు వరకు ఉన్న ఖండ భాగాన్ని ఏమని పిలుస్తారు?
1) ఖండతీరపు వాలు
2) అగాధ సముద్ర మైదానం
3) అగాధ సముద్ర ప్రాంతాలు
4) ఖండతీరపు అంచు
- View Answer
- సమాధానం: 4
2. సముద్ర లోతు కొలవడానికి ఉపయోగించే ‘ప్రమాణం’ ఏది?
1) నాటికల్ మైల్
2) పాథమ్
3) కిలోమీటర్లు
4) అడుగులు
- View Answer
- సమాధానం: 2
3.సమాన సముద్ర లోతు ఉన్న ప్రాంతాలను కలుపుతూ గీసిన రేఖలను ఏమని పిలుస్తారు?
1) ఐసోబార్లు
2) ఐసోహెలైన్స్
3) ఐసోబాథ్స్
4) ఐసోహలైన్స్
- View Answer
- సమాధానం: 3
4. కింది వాటిలో సరికానిది ఏది?
1) పసిఫిక్ మహా సముద్రం–డెల్టా ఆకారం
2) అట్లాంటిక్ మహా సముద్రం–ఎస్ ఆకారం
3) దక్షిణ మహా సముద్రం–కల్లోల సముద్రం
4) హిందూ మహా సముద్రం–ఎమ్ ఆకారం
- View Answer
- సమాధానం: 3
5.సముద్రంలోకి చొచ్చుకొని వచ్చిన భూభాగపు కొన ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు?
1) బేసిన్
2) అగ్రం
3) సింధు శాఖ
4) అఖాతం
- View Answer
- సమాధానం: 2
6. సముద్ర జలాల సగటు లవణీయత ఎంత శాతం ఉంటుంది?
1) 35%
2) 45%
3) 55%
4) 66%
- View Answer
- సమాధానం: 1
7. తరంగ ప్రభావం వల్ల తీర ప్రాంతం అర్ధ చంద్రకారంగా మారితే దానిని ఏమని పిలుస్తారు?
1) సింధు శాఖ
2) అగ్రం
3) షోల్
4) అఖాతం
- View Answer
- సమాధానం: 4
8. కింది వాటిలో ఏ మహా సముద్రానికి ఉత్తరాన ‘బేరింగ్ జలసంధి’ సరిహద్దుగా ఉంది?
1) పసిఫిక్ మహా సముద్రం
2) అట్లాంటిక్ మహా సముద్రం
3) హిందూ మహా సముద్రం
4) అంటార్కిటికా మహా సముద్రం
- View Answer
- సమాధానం: 1
9. సీమౌంట్స్ అంటే?
1) సముద్రంలోకి చొచ్చుకొని వచ్చిన ఇసుక దిబ్బలు
2) జీవ సంబంధమైన దిబ్బలు
3) సముద్రాల లోపల 1000 మీ. ఎత్తుకుపైగా ఉండే పర్వతాలు
4) సముద్రాల్లో లోతు తక్కువగా ఉన్న భూభాగం
- View Answer
- సమాధానం: 3
10.ప్రిన్స్ ఎడ్వర్డ్స్ రిడ్జ్ ఏ మహా సముద్రంలో ఉంది?
1) హిందూ మహా సముద్రం
2) దక్షిణ మహా సముద్రం
3) పసిఫిక్
4) అట్లాంటిక్
- View Answer
- సమాధానం: 1
11. ‘ప్రశాంత మహా సముద్రం’ అని ఏ మహా సముద్రాన్ని పిలుస్తారు?
1) అట్లాంటిక్ మహా సముద్రం
2) హిందూ మహా సముద్రం
3) ఆర్కిటిక్ మహా సముద్రం
4) పసిఫిక్ మహా సముద్రం
- View Answer
- సమాధానం: 4
12. ఒకే లవణీయత ఉన్న ప్రదేశాలను కలుపుతూ గీసిన రేఖలను ఏమని పిలుస్తారు?
1) ఐసోబాథ్స్
2) ఐసోౖహె ట్స్
3) ఐసోహెలైన్స్
4) ఐసోబార్స్
- View Answer
- సమాధానం: 3
13. సముద్రపు ఏ భాగంలో ‘చేపలు’ లాంటి జలచర జీవులు ఎక్కువగా పెరుగుతాయి?
1) ఖండతీరపు అంచు
2) ఖండతీరపు వాలు
3) అగాధ సముద్ర మైదానం
4) అగాధాలు
- View Answer
- సమాధానం: 1
14. డాగర్ మత్స్య బ్యాంకు ఉన్న ప్రదేశం ఏది?
1) అమెరికా
2) ఇంగ్లండ్
3) ఆస్ట్రేలియా
4) కెనడా
- View Answer
- సమాధానం: 2
15. ప్రపంచంలో అతి వెడల్పయిన ఖండతీరపు అంచులు ఉన్న మహా సముద్రం ఏది?
1) పసిఫిక్ మహా సముద్రం
2) దక్షిణ మహా సముద్రం
3) ఆర్కిటిక్ మహా సముద్రం
4) అట్లాంటిక్ మహా సముద్రం
- View Answer
- సమాధానం: 4
16. సోమాలియా శీతల ప్రవాహం ఏ మహా సముద్రంలో భాగం?
1) అట్లాంటిక్
2) పసిఫిక్
3) హిందూ మహా సముద్రం
4) దక్షిణ మహాసముద్రం
- View Answer
- సమాధానం: 3
17.కలహారి ఎడారి ఏర్పడడానికి కారణమైన శీతల సముద్ర ప్రవాహం ఏది?
1) కెనరీ
2) పెరూవియన్
3) కాలిఫోర్నియా
4) బెంగుల్యా
- View Answer
- సమాధానం: 4
18. చంద్రుడు, సూర్యుని ఆకర్షణ నిష్పత్తి ఎంత?
1) 5:11
2) 11:5
3) 6:13
4) 13:6
- View Answer
- సమాధానం: 2
19.ఒక పోటు, ఒక పాటుకు మధ్య సమయ వ్యత్యాసం ఎంత?
1) 12గం.26ని.
2) 24గం.52 ని.
3) 6గం.13ని.
4) 5గం. 26 ని.
- View Answer
- సమాధానం: 3
20. ఒక ప్రదేశంలో వర్షపాతం పెరిగే కొద్ది ఆ ప్రాంత సముద్ర లవణీయత ఏమవుతుంది?
1) తగ్గుతుంది
2) పెరుగుతుంది
3) పెరిగి తగ్గుతుంది
4) మారదు
- View Answer
- సమాధానం: 4
21. భారతదేశంలో అధికంగా ‘పోటులు’ సంభవించే ‘ఓక్లా’ అనే ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉంది?
1) ఒడిశా
2) మహారాష్ట్ర
3) గుజరాత్
4) పశ్చిమ బెంగాల్
- View Answer
- సమాధానం: 3
22.పర్వవేలా «‘పోటు పాటు’లు ఒక నెలలో ఎన్నిసార్లు సంభవిస్తాయి?
1) 2 సార్లు
2) 3 సార్లు
3) 4 సార్లు
4) 6 సార్లు
- View Answer
- సమాధానం: 1
23. హిందూ మహా సముద్ర ద్వీపం డిగోగార్షియాలో మిలటరీ స్థావరం కలిగి ఉన్న దేశం ఏది?
1) రష్యా
2) ఇంగ్ల్లండ్
3) జర్మనీ
4) అమెరికా
- View Answer
- సమాధానం: 4
24.కింది వాటిలో ఏది అట్లాంటిక్ మహా సముద్ర ప్రవాహా వ్యవస్థకు సంబంధించనిది?
1) లాబ్రడార్ ప్రవాహాం
2) గల్ఫ్‌స్ట్రీమ్ ప్రవాహాం
3) కురుషివో ప్రవాహాం
4) బెంగుల్యా ప్రవాహాం
- View Answer
- సమాధానం: 3
25. కింది వాటిలో శీతల ప్రవాహాం కానిది ఏది?
1) కాలిఫోర్నియా ప్రవాహాం
2) సుసీమా ప్రవాహాం
3) కామ్చెట్కా ప్రవాహాం
4) ఉత్తర పసిఫిక్ డ్రిఫ్ట్
- View Answer
- సమాధానం: 2
26. ఏ ప్రవాహాన్ని ‘యూరప్ వెచ్చని దుప్పటి’ అని పిలుస్తారు?
1) గల్ఫ్‌స్ట్రీమ్
2) లాబ్రడర్
3) బెంగుల్యా
4) కాలిఫోర్నియా
- View Answer
- సమాధానం: 1
27. మొజాంబిక్ ప్రవాహాం ఏ మహాసముద్ర ప్రవాహా వ్యవస్థకు చెందింది?
1) పసిఫిక్
2) అట్లాంటిక్
3) హిందూ మహా సముద్రం
4) ఆర్కిటిక్ మహా సముద్రం
- View Answer
- సమాధానం: 3
28. కెనరీ శీతల ప్రవాహాం వల్ల ఏర్పడిన ఎడారి ఏది?
1) సోనారన్ ఎడారి
2) అటకామా ఎడారి
3) కలహారి ఎడారి
4) సహారా ఎడారి
- View Answer
- సమాధానం: 4
29. ఈ రోజు వచ్చే పోటు కన్నా రేపు వచ్చే మొదటి పోటు ఎంత ఆలస్యంగా వస్తుంది?
1) 6 గంటల 13 నిమిషాలు
2) 12 గంటల 26 నిమిషాలు
3) 13 నిమిషాలు
4) 53 నిమిషాలు
- View Answer
- సమాధానం: 4