TSPSC : గ్రూప్-4 రాతపరీక్షల్లో అర్ధమెటిక్స్ & రీజనింగ్ ఇలా చేస్తే ఈజీనే..
గ్రూప్-4 సర్వీసెస్.. రాష్ట్ర స్థాయిలో.. గ్రూప్స్ అభ్యర్థులంతా పోటీ పడే పరీక్ష! అకడమిక్ నేపథ్యంతో సంబంధం లేకుండా.. సివిల్స్, గ్రూప్-1, 2, 3 అభ్యర్థులు సైతం రాసే పరీక్ష గ్రూప్-4! కారణం.. సర్కారీ కొలువు సొంతం చేసుకోవాలనే అభిలాష! తాజాగా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ)..గ్రూప్-4 సర్వీసెస్‌లో 9,168 పోస్ట్‌ల భర్తీకి శ్రీకారం చుట్టింది! దీనికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 23 నుంచి ప్రారంభం కానుంది. గ్రూప్-4 సర్వీసెస్ అనేది గ్రూప్స్ కేటగిరీలో కింది స్థాయి పోస్టులుగా భావిస్తారనుకుంటే పొరపాటే. ఎందుకంటే..ఈ పోస్ట్‌ల కోసం డిగ్రీ మొదలు పీజీ, పీహెచ్‌డీ అభ్యర్థులు సైతం పోటీ పడుతుంటారు. దీంతో గ్రూప్-4 సర్వీసులను లక్ష్యంగా చేసుకున్న వారు పరీక్ష విధానం, సిలబస్ అంశాలపై అవగాహన పెంచుకొని పక్కా ప్రణాళికతో ప్రిపరేషన్ కొనసాగించాలి. ఈ నేపథ్యంలో గ్రూప్-4 పరీక్షలకు సంబంధించిన అర్ధమెటిక్స్ & రీజనింగ్‌ను ఎలా చదివితే ఎక్కువ స్కోర్ చేయవచ్చు అనే అంశంపై ప్రముఖ సబ్జెక్ట్ నిపుణులు వేణుగోపాల్ గారిచే ప్రత్యేక వీడియో గైడెన్స్ మీకోసం..