ప్రశాంతంగా యూపీఎస్సీ పరీక్షలు
నగరంలోని వివిధ కేంద్రాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకూ పలు శాఖల సంయుక్త సహకారంతో పరీక్షలను విజయవంతంగా నిర్వహించారు. నేషనల్ డిఫెన్స్, నావల్ అకాడమీ పరీక్షలకు 1226 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 869 మంది విద్యార్థులు హాజరయ్యారు. 357 మంది గైర్హాజరయ్యారు. కాకరపర్తి భావనారాయణ కళాశాలలో రెండు కేంద్రాలు శ్రీ దుర్గామల్లేశ్వర సిద్ధార్థ మహిళ కళాశాల మరో కేంద్రంలో పరీక్ష కొనసాగింది. 104 మంది ఇన్విజిలేటర్లు, ఐదుగురు లైజన్ ఆఫీసర్లు ఎనిమిది మంది అసిస్టెంట్ సూపర్వైజర్ల విధులు నిర్వర్తించారు.
చదవండి:
‘World Quantum Day’కు ట్రిపుల్ ఐటీ శాస్త్రవేత్తలు
Railway Recruitment : 1,100 రైల్వే ఉద్యోగాల భర్తీకి చర్యలు
Sakshi Media: ఆధ్యర్యంలో ఎంసెట్, నీట్ విద్యార్థులకు మాక్‌టెస్టులు..
ఇంటర్ ఫలితాలు వివరాలు.. రోజుకు ఇన్ని సమాధాన పత్రాలకు మూల్యాంకన
కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ పరీక్షలను బిషప్ అజరయ్య మహిళ జూనియర్ కళాశాల, పీబీ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో నిర్వహించారు. పరీక్ష కేంద్రాలలో 70 మంది ఇన్విజిలేటర్లు, ఇద్దరు లైజన్ ఆఫీసర్ల విధులు నిర్వర్తించారు. పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు ఏప్రిల్ 17న తనిఖీ చేశారు. పరీక్షల వివరాలను ఇతర సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు.