UPSC: సివిల్స్ ప్రిలిమ్స్ కాస్త కఠినమే... విద్యార్థుల హాజరుపై కోవిడ్ దెబ్బ
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్‌పీ) అక్టోబర్ 10న నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. దేశవ్యాప్తంగా 5 లక్షలమంది ఈ పరీక్ష రాస్తే, అందులో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు 60 వేల వరకు ఉంటారని అంచనా. కట్టుదిట్టమైన భద్రతాఏర్పాట్ల మధ్య హైదరాబాద్, వరంగల్ కేంద్రాల్లో పరీక్ష జరిగింది. పరీక్షాకేంద్రాల పరిసరాల్లో భారీపోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కోవిడ్ నిబంధనలు కచ్చితంగా అమలు చేశారు. అయితే, గతేడాది 2020తో పోలిస్తే ఈసారి ప్రిలిమ్స్ రాసినవారి సంఖ్య తగ్గింది. కరోనా నేపథ్యంలో ఆన్‌లైన్ క్లాసులే జరగడం, సరిగా ప్రిపరేషన్ లేకపోవడమే దీనికి కారణాలు. ఈసారి పేపర్లు కాస్తా కఠినంగానే ఉన్నాయని విద్యార్థులు అభిప్రాయపడ్డారు. రాజకీయాలకు సంబంధించి 15, అన్నిరకాల చరిత్రకు సంబంధించిన అంశాల నుంచి 20 ప్రశ్నలు వచ్చాయి. సమకాలీన అంశాల(కరెంట్ అఫైర్స్) నుంచి 8 ప్రశ్నలొస్తే ఇందులో క్రీడావిభాగం నుంచే ఆరు ఉన్నాయి. శాస్త్ర, సాంకేతిక అంశాల నుంచి 16, పర్యావరణం, భౌగోళికం, వ్యవసాయం నుంచి 25 ప్రశ్నలు, ఆరి్థకాంశాల నుంచి 15 ప్రశ్నలిచ్చారు.
అన్న ఐఏఎస్..తమ్ముడు ఐపీఎస్..మా సక్సెస్‌కు వీరే కారణం
కటాఫ్ గతేడాది మాదిరే:
బాలలత, సీఎస్‌బీ ఐఏఎస్ అకాడమీ
ప్రశ్నపత్రాన్ని పరిశీలిస్తే కటాఫ్ మార్కు గతేడాది (92.5) మాదిరి, లేదా 1, 2 మార్కులు తక్కువగా ఉండొచ్చు. కరోనా ప్రభావం లేకుండా ఉండి ఉంటే, ప్రత్యక్ష క్లాసుల ద్వారా విద్యార్థులు మరింత లోతుగా అధ్యయనం చేసేవాళ్లు. ఏదేమైనా ప్రశ్నపత్రాలు కొంత కఠినంగానే ఉన్నట్టు కని్పస్తోంది.