UPSC: ఐఈఎస్‌లో అభిషేక్‌కు 42వ ర్యాంకు
Sakshi Education
స్టేషన్‌ఘన్‌పూర్ : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ఐఈఎస్(ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్)లో మండలంలోని శివునిపల్లికి చెందిన వేముగంటి రాంప్రసాద్, శ్రీదేవిల కుమారుడు అభిషేక్ ఆల్ ఇండియా 42వ ర్యాంకు సాధించాడు.
ఐఈఎస్ ఫైనల్ రిజల్ట్స్ నవంబర్ 22న వెలువడ్డాయి. అభిషేక్ పదో తరగతి వరకు స్థానిక సెయింట్ థామస్ హైస్కూల్‌లో, ఇంటర్ హైదరాబాద్ ఘట్‌కేసర్‌లోని నారాయణ జూనియర్ కళాశాలలో, బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ నాగపూర్‌లోని నిట్‌లో చదివాడు. కాగా, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ అభిషేక్‌కు అభినందలు తెలిపారు.
సంతోషంగా ఉంది: అభిషేక్
ఐఈఎస్‌లో జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకు(42వ) రావడం చాలా సంతోషంగా ఉంది. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి నన్ను చదివించారు. తమ్ముడు, స్నేహితుల ప్రోత్సాహంతో కష్టపడి చదివా. సమాజంలో ఉత్తమ ఉద్యోగిగా సేవలు అందిస్తా.
Published date : 23 Nov 2023 11:32AM