Skip to main content

TSPSC New Exam Dates 2023 : గ్రూప్-1, ఏఈ పరీక్ష కొత్త‌ తేదీలు ఇవే.. ఈ సారి మాత్రం..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (TSPSC ) పేప‌ర్ లీక్ వ్య‌వ‌హారం రాష్ట్రంలో సంచ‌ల‌నంగా మారింది. మార్చి 5వ తేదీన‌ నిర్వహించిన టీఎస్పీఎస్సీ అసిస్టెంట్ ఇంజనీర్స్ క్వశ్చన్ పేపర్ లీక్ అయిన విష‌యం తెల్సిందే.
tspsc exam dates 2023 telugu news
tspsc exams dates 2023 details

ఈ నేపథ్యంలో టీఎస్పీఎస్సీ.. తాజా రిక్రూట్మెంట్ కోసం ప్రశ్నా పత్రాన్ని సిద్ధం చేస్తోంది. ఏప్రిల్ 4,2023న ఏఈ పరీక్షను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఏఈ విభాగంలో హార్టీ కల్చర్ డిపార్ట్ మెంట్ లో 22 పోస్టులో, అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్ ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ లో 113 పోస్టులు భర్తీకి పరీక్షను నిర్వహించనున్నారు.

☛➤ టీఎస్‌పీఎస్సీ ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

తాజాగా ప్రముఖ‌ సబ్జెక్ట్ నిపుణులతో..

tspsc new exam dates 2023

ప్రముఖ‌ సబ్జెక్ట్ నిపుణులతో తాజా క్వశ్చన్ పేపర్ ను ప్రిపేర్ చేయిస్తున్నారు. అయితే, ఇప్పుడు ప్రకటించిన తేదీ కన్ఫార్మ్ కాదని, కాకపోతే అభ్యర్థులు సిద్ధంగా ఉండాలని టీఎస్పీఎస్సీ తెలిపింది. మార్చి 12న జరగాల్సిన టౌన్‌ ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్‌సీర్‌ మునిసిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ విభాగంలోని 175 ఖాళీలకు, వెటర్నరీ, పశుసంవర్ధక శాఖలో వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ 185 ఖాళీల పరీక్షలు మార్చి 15, 16 తేదీల్లో జరగాల్సిన ఉండగా పేపర్ లీక్ కారణంగా ఇప్పటికే వాటిని  వాయిదా వేసింది. అలాగే తాజాగా తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ నిర్వ‌హించిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ప‌రీక్ష‌ను కూడా ర‌ద్దు చేశారు. ఈ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ను జూన్ 11వ తేదీన నిర్వ‌హించ‌నున్నారు. అలాగే ఏఈఈ, డీఏఓ ప‌రీక్ష‌ల తేదీల‌ను కూడా త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించ‌నున్న‌ది.

☛➤ TSPSC Groups Applications 2023 : గ్రూప్-2, 3, 4 పోస్టులకు ఎంతమంది పోటీ పడుతున్నారంటే...? ఈ కామన్‌ సిలబస్ చ‌దివితే..

Published date : 17 Mar 2023 08:05PM

Photo Stories