Skip to main content

TSPSC Group‌-1 Guidance: పోటీ తీవ్రం... సిలబస్‌పై సమగ్ర పట్టుతోనే విజయావకాశాలు!!

TSPSC Group‌-1 Special, guidance and preparation tips and exam pattern, syllabus, marks
TSPSC Group‌-1 Special, guidance and preparation tips and exam pattern, syllabus, marks

తెలంగాణలో భారీగా ఉద్యోగ నియామకాలకు రంగం సిద్ధమవుతోంది ముఖ్యంగా టీఎస్‌పీఎస్సీ నిర్వహించే.. గ్రూప్‌–1 పోస్ట్‌ల భర్తీకి సన్నాహకాలు మొదలయ్యాయి. మొత్తం 503 గ్రూప్‌–1 పోస్ట్‌లకు ఎంపిక ప్రక్రియ జరుగనుంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక తొలిసారి భారీ స్థాయిలో గ్రూప్‌–1 నోటిఫికేషన్‌ రాబోతోంది. యూనిఫార్మ్‌ సర్వీసులను మినహాయిస్తే మిగతా సర్వీసులకు గరిష్ట వయో పరిమితిని పెంచారు. కాబట్టి బ్యాచిలర్‌ డిగ్రీ అర్హతగా జరిగే ఈ పోస్టులకు ఈసారి పోటీ తీవ్రంగా ఉండొచ్చని అంచనా. ఈ నేపథ్యంలో.. టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌–1 ఎంపిక ప్రక్రియ విధానం, విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలు తదితర అంశాలపై విశ్లేషణ.. 

  • తెలంగాణలో 503 గ్రూప్‌–1 పోస్ట్‌ల భర్తీకి సన్నాహాలు
  • మరికొద్ది రోజుల్లో నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం
  • సిలబస్‌పై సమగ్ర పట్టుతోనే విజయావకాశాలు

రాష్ట్ర ఆర్థిక శాఖ ఇటీవల 503 గ్రూప్‌–1 పోస్ట్‌ల భర్తీకి ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో గ్రూప్‌–1 సర్వీసులకు ఎంపిక ప్రక్రియ మూడు దశలుగా ఉంటుంది. అవి.. –ప్రిలిమినరీ పరీక్ష, –మెయిన్‌ ఎగ్జామినేషన్, –పర్సనల్‌ ఇంటర్వ్యూ. టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌–1 అభ్యర్థులకు ముందుగా ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. ప్రిలిమ్స్‌లో విజయం సాధించి, నిర్దిష్ట కటాఫ్‌ మార్కులు పొందిన వారికి.. రెండో దశలో మెయిన్‌ ఎగ్జామినేషన్‌ ఉంటుంది. ఇందులోనూ నిర్దేశిత మార్కులు సాధించిన అభ్యర్థులకు చివరగా పర్సనల్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. మెయిన్‌ పరీక్ష, ఇంటర్వ్యూ మార్కుల ఆధారంగా తుది జాబితా విడుదల చేసి నియామకాలు ఖరారు చేస్తారు.

చదవండి: గ్రూప్‌-1,2,3,4 ప్రీవియ‌స్ కొశ్చన్‌ పేప‌ర్స్ కోసం క్లిక్ చేయండి

మొదటి దశ ప్రిలిమినరీ.. ఇలా

మొదటి దశ ప్రిలిమినరీ పరీక్షను పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో బహుళైచ్ఛిక ప్రశ్నలతో నిర్వహిస్తారు. జనరల్‌ స్టడీస్, మెంటల్‌ ఎబిలిటీ విభాగాల నుంచి 150 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం 150 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 2.30 గంటలు.

మెయిన్‌.. డిస్క్రిప్టివ్‌ విధానం

ప్రిలిమ్స్‌ విజేతలకు రెండో దశలో నిర్వహించే మెయిన్‌ పరీక్ష పూర్తిగా డిస్క్రిప్టివ్‌ విధానంలో ఉంటుంది. ఇందులో మొత్తం ఆరు పేపర్లతో 900 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఈ ఆరు పేపర్లకు అదనంగా జనరల్‌ ఇంగ్లిష్‌ అర్హత పేపర్‌గా ఉంటుంది. పూర్తి వివరాలు..
 

పేపర్‌ సబ్జెక్స్‌ మార్కులు
ఎ)  జనరల్‌ ఇంగ్లిష్‌ (క్వాలిఫయింగ్‌ టెస్ట్‌) 150
పేపర్‌ 1

జనరల్‌ ఎస్సే
1. సమకాలీన సామాజిక అంశాలు, సమస్యలు;
2. ఆర్థిక అభివృద్ధి, న్యాయపరమైన అంశాలు; 
3. భారత రాజకీయ స్థితిగతులు; 
4. భారతీయ చరిత్ర సాంస్కృతిక వారసత్వం;
5. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అభివృద్ధి;
6. విద్య, మానవ వనరుల అభివృద్ధి)

 150
పేపర్‌ 2

హిస్టరీ, కల్చర్‌ – జాగ్రఫీ.                
1. భారత దేశ చరిత్ర, సంస్కృతి. ఆధునిక యుగం(1757–1947); 
2. తెలంగాణ చరిత్ర, సాంస్కృతిక వారసత్వం;
3. భారతదేశం, తెలంగాణ జాగ్రఫీ)

150
పేపర్‌ 3

ఇండియన్‌ సొసైటీ, రాజ్యాంగం, పరిపాలన.            
1. భారతీయ సమాజం, నిర్మాణం, అంశాలు, సామాజిక ఉద్యమాలు; 
2. భారత రాజ్యాంగం;
3. పరిపాలన)

150
పేపర్‌ 4

ఎకానమీ అండ్‌ డెవలప్‌మెంట్‌     
1. భారత ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి;
2. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ;
3. అభివృద్ధి, పర్యావరణ సమస్యలు)

150
పేపర్‌ 5

సైన్స్‌–టెక్నాలజీ– డేటాఇంటర్‌ప్రిటేషన్‌.            
1. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పాత్ర, ప్రభావం;
2. విజ్ఞానశాస్త్ర వినియోగంలో ఆధునిక పోకడలు; 
3. డేటా ఇంటర్‌ప్రిటేషన్‌– సమస్యా పరిష్కారం)

150
పేపర్‌ 6

 తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం.                    
1. తెలంగాణ తొలి దశ (1948–1970);
2.ఉద్యమ దశ (1971–1990);
3. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశ (1991–2014))

150 
  • మొత్తం మెయిన్‌ పరీక్షకు కేటాయించిన మార్కులు– 900
  • మెయిన్‌లో విజయం సాధించిన వారికి చివరగా 100 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
  • ఇలా మొత్తం 1000 మార్కులకు మెరిట్‌ జాబితా రూపొందించి తుది నియామకాలు ఖరారు చేస్తారు.

విజయానికి సన్నద్ధత ఇలా

టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌–1 పోస్ట్‌ల భర్తీ ప్రక్రియపై స్పష్టత వచ్చిన నేపథ్యంలో అభ్యర్థులు నోటిఫికేషన్‌ వచ్చే వరకు వేచి చూడకుండా.. ఇప్పటి నుంచే సన్నద్ధత పొందేందుకు అడుగులు వేయాలని నిపుణులు సూచిస్తున్నారు. సిలబస్‌ను పరిశీలించి అందులో పేర్కొన్న అంశాలు, వాటిలో తాము ఇంకా రాణించాల్సిన అంశాలపై పట్టు సాధించేందుకు కృషి చేయాలి. ముఖ్యంగా తెలంగాణ చరిత్ర, జాగ్రఫీ, ఎకానమీ, తెలంగాణ ఉద్యమాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.

చదవండి: Groups Guidance: మొదటిసారిగా గ్రూప్‌ 2 రాస్తున్నారా? అయితే ఇది మీ కోస‌మే..

ఉమ్మడి ప్రిపరేషన్‌

  • ప్రిలిమ్స్‌ నుంచే మెయిన్‌ ఎగ్జామినేషన్‌ దృక్పథంతో ప్రిపరేషన్‌ సాగించాలి. 
  • ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉండే ప్రిలిమినరీ పరీక్షకు సైతం డిస్క్రిప్టివ్‌ విధానంతో అభ్యసనం సాగించాలి. తద్వారా మెయిన్‌కు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.
  • ముఖ్యంగా ప్రిలిమ్స్‌లో పేర్కొన్న సిలబస్‌ అంశాల్లో దాదాపు 60 నుంచి 70 శాతం మేరకు మెయిన్‌ ఎగ్జామినేషన్‌లోనూ పునరావృతం అయ్యేలా సిలబస్‌ ఉంది. దీన్ని అభ్యర్థులు సానుకూలంగా మలచుకోవాలి.
  • తెలంగాణ రాష్ట్ర విధానాలు, తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు, సాహిత్యం, హక్కులు వంటివి మెయిన్‌లోనూ జనరల్‌ ఎస్సే పేపర్‌లో.. అదే విధంగా హిస్టరీ పేపర్‌లో అడిగే అవకాశం ఉంది. కాబట్టి వీటిని డిస్క్రిప్టివ్‌ విధానంతో చదివితే మెయిన్‌కు సన్నద్ధత పొందొచ్చు.

మెయిన్‌ పరీక్షకు సమగ్రంగా

  • జనరల్‌ ఎస్సే పేపర్‌గా పేర్కొనే పేపర్‌–1 కోసం సమకాలీన సామాజిక అంశాలు, సమస్యలు, ఆర్థిక వృద్ధి, భారత చారిత్రక, వారసత్వ సంపద, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో తాజా పరిణామాలు తదితర అంశాలపై సమగ్ర అవగాహన పెంచుకోవాలి.
  • పేపర్‌–2 విషయంలో ఆధునిక భారత దేశ చరిత్ర, స్వాతంత్య్రోద్యమం, భారత చరిత్ర, సంస్కృతి అంశాలు, అదే విధంగా తెలంగాణ చరిత్ర, సాంస్కృతిక వారసత్వ అంశాలను చదవాలి. వీటితోపాటు భారత, రాష్ట్ర భౌగోళిక అంశాలపై పట్టు సాధించాలి.
  • పేపర్‌–3 కోసం భారత రాజ్యాంగం, పాలనా వ్యవస్థ, భారత సమాజం, సమస్యలు, సాంఘిక ఉద్యమాలపై దృష్టి పెట్టాలి.
  • ఎకానమీ అండ్‌ డెవలప్‌మెంట్‌ సబ్జెక్ట్‌గా పేర్కొనే పేపర్‌–4 కోసం భారత, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ–అభివృద్ధి, అభివృద్ధి, పర్యావరణ సమస్యల గురించి అవగాహన ఏర్పరచుకోవాలి.
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ(పేపర్‌–5) విషయంలో.. సామాజిక అభివృద్ధికి సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ దోహదపడుతున్న తీరు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఆధునిక పద్ధతుల గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాలి.

పేపర్‌–6కు ప్రత్యేకంగా

టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌–1 మెయిన్స్‌లో ఆరో పేపర్‌గా పేర్కొన్న.. తెలంగాణ ఆలోచన (1948–1970), ఉద్యమ దశ(1971–1990), తెలంగాణ ఏర్పాటు దశ, ఆవిర్భావం (1991–2014)) అంశాలకు సంబంధించి ప్రత్యేక శ్రద్ధతో చదవాలి. ముఖ్యంగా సిలబస్‌లో నిర్దేశించిన ప్రకారం–1948 నుంచి 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వరకు జరిగిన ముఖ్య ఉద్యమాలు, ఒప్పందాలు, ముల్కీ నిబంధనలు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీలు–వాటి సిఫార్సులు వంటి వాటిపై అవగాహన ఏర్పరచుకోవాలి. దీంతోపాటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా రూపొందించిన పునర్‌ వ్యవస్థీకరణ బిల్లులో తెలంగాణకు సంబంధించి ప్రత్యేకంగా పొందుపరచిన అంశాలు; తెలంగాణకు కల్పించిన హక్కులపై దృష్టి సారించాలి.

చదవండి: Group 1&2 Exams Preparation Tips: గ్రూప్స్‌ గెలుపు బాటలో.. విజేతల వ్యూహాలు!

సమకాలీన ప్రాధాన్య అంశాలు

తెలంగాణకు సంబంధించి ఇటీవల కాలంలో ప్రాధాన్యం సంతరించుకున్న అంశాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి వంటి అంశాలపై మరింత ప్రత్యేక దృష్టితో అభ్యసనం సాగించాలి. ఆర్థిక వనరుల అభివృద్ధి, రాష్ట్రంలో వ్యవసాయ, సాగు పరిస్థితులు, పారిశ్రామిక విధానాలు వంటి అంశాలపై అవగాహన పెంచుకోవాలి.

సమయం సద్వినియోగమయ్యేలా

గ్రూప్‌–1 అభ్యర్థులు సిలబస్‌లోని ఉమ్మడి అంశాలను గుర్తించి.. ప్రిపరేషన్‌ పరంగా సమయం కలిసొచ్చేలా ప్లాన్‌ చేసుకోవాలి. సిలబస్‌లో ఉన్న ఉమ్మడి అంశాలను గుర్తించాలి. వాటిని డిస్క్రిప్టివ్‌ అప్రోచ్‌తో చదువుతూ.. ముఖ్యమైన అంశాలతో బిట్స్, షార్ట్‌ నోట్స్‌లు రాసుకోవాలి. ఇది రివిజన్‌ సమయంలో ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.

ప్రత్యేకంగా ఇలా

  • తెలంగాణ హిస్టరీ, తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ ఎకానమీ పేరుతో ప్రత్యేకంగా ఉన్న అంశాల విషయంలో అభ్యర్థులు మరింత లోతైన అవగాహన ఏర్పరచుకుంటే మార్కులు పెంచుకునే అవకాశం ఉంది. 
  • చరిత్రలో తెలంగాణలో రాజులు, ముఖ్య యుద్ధాలు, ఒప్పందాలు, తెలంగాణలోని కవులు–రచనలు; కళలు; ముఖ్య కట్టడాలు–వాటిని నిర్మించిన రాజులు తదితర అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అదే విధంగా స్వాతంత్య్రోద్యమ సమయంలో తెలంగాణ ప్రాంత ప్రమేయం ఉన్న సంఘటనలపై అవగాహన ఏర్పరచుకోవాలి.
  • జాగ్రఫీలో.. తెలంగాణలోని ముఖ్యమైన నదులు–పరీవాహక ప్రాంతాలు; ముఖ్యమైన పంటలు; భౌగోళిక ప్రాధాన్యం ఉన్న ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాలపై దృష్టి పెట్టాలి. దీంతోపాటు తెలంగాణ భౌగోళిక స్వరూపం విస్తీర్ణం, జనాభా వంటి అంశాలపై అవగాహన అవసరం.
  • ఎకానమీలో తెలంగాణ స్థూల రాష్ట్రీయోత్పత్తి, ముఖ్యమైన పథకాలు, 2011 జనాభా గణాంకాలు; ముఖ్యమైన పరిశ్రమలు–ఉత్పత్తిదాయకత, రాష్ట్ర ప్రధాన ఆదాయ వనరులపై అవగాహన ఏర్పరచుకోవాలి. 

‘ప్రామాణిక’ పుస్తకాలే సాధనాలుగా

గ్రూప్స్‌ అభ్యర్థులు ప్రామాణిక పుస్తకాలనే సాధనాలుగా చేసుకుని సన్నద్ధులు కావాలి. డిగ్రీ స్థాయి అకడమిక్‌ పుస్తకాలు, ప్రభుత్వం ప్రచురించే ఎకనామిక్‌ సర్వే, బడ్జెట్‌లోని అంశాలపై అవగాహన ఏర్పరచుకోవాలి. ప్రిపరేషన్‌ సమయంలోనే ౖరైటింగ్‌ కూడా మెరుగయ్యేలా వ్యవహరించాలి. అంటే.. ఒక అంశాన్ని చదువుతున్నప్పుడే దాన్ని పేపర్‌పై రాసే విధానాన్ని కూడా అలవర్చుకోవాలి. దీనివల్ల రైటింగ్‌ స్పీడ్‌ పెరగడమే కాకుండా.. తాము రాసుకున్న అంశాలు రివిజన్‌కు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది.
– ఎం.బాలలత, పోటీ పరీక్షల శిక్షణ నిపుణులు
 

తెలంగాణ డీఎస్సీ/టెట్‌ స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

టీఎస్‌పీఎస్సీ స్టడీ మెటీరియల్

టీఎస్‌పీఎస్సీ బిట్ బ్యాంక్

టీఎస్‌పీఎస్సీ గైడెన్స్

టీఎస్‌పీఎస్సీ సిలబస్

టీఎస్‌పీఎస్సీ ప్రివియస్‌ పేపర్స్

టీఎస్‌పీఎస్సీ ఆన్‌లైన్ క్లాస్

టీఎస్‌పీఎస్సీ ఆన్‌లైన్ టెస్ట్స్

Published date : 07 Apr 2022 06:52PM

Photo Stories