టీఎస్‌పీఎస్సీ `తొలి` ఇంటర్వ్యూల సరళి
Sakshi Education
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఉద్యోగాల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ)ను ఏర్పాటు చేశారు. ఇది ఇప్పటి వరకు తొమ్మిది నియామక పరీక్షలు నిర్వహించింది. ఈ క్రమంలో ఇరిగేషన్ అండ్ క్యాడ్ విభాగంలోని ఏఈఈ-మెకానికల్ 16 పోస్టులకు డిసెంబర్ 30, 31 తేదీల్లో ఇంటర్వ్యూలు జరిగాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇవి ‘తొలి’ ఉద్యోగ ఇంటర్వ్యూలుగా నిలిచాయి. ఇదే కోవలో మరికొన్ని ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు కమిషన్ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థుల అవగాహన కోసం.. టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన తొలి ఇంటర్వ్యూల సరళిపై విశ్లేషణ..
రెండు రోజుల పాటు (డిసెంబర్ 30, 31 తేదీల్లో) 32 మంది అభ్యర్థులకు నిర్వహించిన ఇంటర్వ్యూలలో అభ్యర్థుల వ్యక్తిగత నేపథ్యం నుంచి భవిష్యత్తులో సంబంధిత విభాగంలో విధి నిర్వహణ సామర్థ్యాలను పరీక్షించే విధంగా ప్రశ్నలు అడిగినట్లు ఇంటర్వ్యూకు హాజరైన అభ్యర్థులు తెలిపారు. ప్రతి అభ్యర్థికి 15 నుంచి 20 నిమిషాల వ్యవధిలో ఇంటర్వ్యూ నిర్వహించారు.
రెండు బోర్డులు
మొత్తం 32 మంది అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఎంపిక చేసిన టీఎస్‌పీఎస్సీ.. ఇంటర్వ్యూల నిర్వహణకు బోర్డుకు అయిదుగురు సభ్యులు చొప్పున రెండు బోర్డులను ఏర్పాటు చేసింది. ఒక బోర్డ్‌కు టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, మరో బోర్డ్‌కు టీఎస్‌పీఎస్సీ సీనియర్ మెంబర్ విఠల్ చైర్మన్లుగా వ్యవహరించగా.. ప్రతి బోర్డ్‌లో మరో ఇద్దరు చొప్పున కమిషన్ సభ్యులు ఉన్నారు. వీరితోపాటు ప్రతి బోర్డ్‌లో ఒక సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ ఉన్నారు. ఇంటర్వ్యూల నిర్వహణ క్రమంలో టీఎస్‌పీఎస్సీ ప్రతి బోర్డ్‌లో ఒక సైకాలజిస్ట్‌ను మెంబర్‌గా తీసుకోవడం గమనించాల్సిన అంశం. అభ్యర్థుల బాడీ లాంగ్వేజ్, సమాధానాలిచ్చే శైలి ఆధారంగా సదరు అభ్యర్థి మనస్తత్వాన్ని అంచనా వేసేందుకు సైకాలజిస్ట్‌ను నియమించినట్లు తెలుస్తోంది.
నేపథ్యం ఆధారంగా ప్రశ్నలు
ఇంటర్వ్యూలో అభ్యర్థులను అడిగిన ప్రశ్నలు వారి నేపథ్యాలు (సామాజిక,కుటుంబ, విద్య) ఆధారంగా ఉన్నాయి. హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగి, విద్యాభ్యాసం అంతా హైదరాబాద్‌లోనే పూర్తిచేసిన అభ్యర్థిని.. ‘గ్రామీణ ప్రాంతంలో ఎలా పని చేయగలవు? మెట్రో కల్చర్‌కు అలవాటైన నేపథ్యంలో గ్రామీణ ప్రాంత ప్రజలతో ఎలా మమేకమవుతావు? అనే ప్రశ్న అడిగారు. అదే విధంగా మహిళా అభ్యర్థులకు అధిక శాతం ‘ఈ జాబ్ ప్రొఫైల్ పూర్తిగా క్షేత్ర స్థాయిలో ఉంటుంది. మీరు ఏ విధంగా సమర్థంగా నిర్వహంచగలరని భావిస్తున్నారు?’ అనే ప్రశ్నలు ఎదురయ్యాయి.
పథకాల ఉద్దేశాలు, సాధ్యాసాధ్యాలు
రాత పరీక్షలో ఆయా పథకాలు-లక్ష్యాలకు సంబంధించి ఫ్యాక్ట్ బేస్డ్ ప్రశ్నలతో అవగాహనను పరీక్షించిన టీఎస్‌పీఎస్సీ.. ఇంటర్వ్యూ సమయంలో ఆ పథకాల ఉద్దేశాలు, అమలు-సాధ్యాసాధ్యాలపై అభ్యర్థుల అభిప్రాయం/విశ్లేషణను ప్రశ్నించింది.
ప్రాబ్లమ్ సాల్వింగ్ కొశ్చన్స్
వ్యక్తిగత నేపథ్యం, విధి నిర్వహణ సామర్థ్యంపై ప్రశ్నలే కాకుండా.. అభ్యర్థులు భవిష్యత్తులో విధి నిర్వహణలో ఎదురయ్యే సమస్యల పరిష్కార నైపుణ్యాలను (ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్)పైనా ప్రశ్నలు అడిగారు.
ఆహ్లాదకర వాతావారణంలో
మొత్తం మీద టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన తొలి ఇంటర్వ్యూలు చాలా ఆహ్లాదకర వాతావరణంలో జరిగాయని అభ్యర్థులు ఆనందం వెలిబుచ్చారు. కమిషన్ సభ్యులు ఎంతో స్నేహపూర్వకంగా వ్యవహరించినట్లు చెప్పారు. 15 నుంచి 20 నిమిషాల ఇంటర్వ్యూ వ్యవధిలో తొలి అయిదు నిమిషాలు అభ్యర్థుల్లోని ఇంటర్వ్యూ టెన్షన్ తొలగిపోయే విధంగా రెండు బోర్డ్‌ల సభ్యులు వ్యవహరించినట్లు అభ్యర్థులు తెలిపారు.
వంటి సాధారణ ప్రశ్నలతో ఇంటర్వ్యూ ప్రారంభించి.. అభ్యర్థి సాధారణ పరిస్థితికి, ఇంటర్వ్యూ బోర్డ్‌రూం వాతావరణానికి కుదురుకున్నాక మెంబర్లు ఇతర ప్రశ్నలవైపు మళ్లినట్లు అభ్యర్థులు చెప్పారు. ఆ ప్రశ్నించే తీరు కూడా ప్రశ్న, సమాధానం తరహాలో కాకుండా డిస్కషన్ మాదిరిగా ఉండటంతో అభ్యర్థులు సబ్జెక్ట్, జాబ్ ప్రొఫైల్‌కు సంబంధించిన సమాధానాలు ఇచ్చే విషయంలో టెన్షన్ లేకుండా వ్యవహరించగలిగినట్లు తెలిపారు.
ఇలా వ్యవహరిస్తే మేలు
భవిష్యత్తులో ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన, సమాధానాలు సిద్ధం చేసుకోవాల్సిన అంశాలు..

- మిషన్ కాకతీయ లక్ష్యంపై మీ అభిప్రాయం? ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఈ లక్ష్యం ఎంత మేరకు నెరవేరుతుంది? లక్ష్యం అమలుకు మీ సూచనలు? వంటి ప్రశ్నలు ఎదురయ్యాయి
- నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ సమస్య పరిష్కారం దిశగా తలపెట్టిన వాటర్‌గ్రిడ్ ఉద్దేశం సాధ్యమేనా?..
- నీటి మళ్లింపు అంత త్వరగా వీలయ్యే అంశమేనా వంటి ప్రశ్నలు కూడా అడిగినట్లు అభ్యర్థులు తెలిపారు. ఇలా దాదాపు ప్రతి అభ్యర్థిలో ఆయా పథకాల ఉద్దేశాలు, లక్ష్యాలు, అమలుపై విశ్లేషణ నైపుణ్యాలు పరీక్షించే విధంగా ప్రశ్నలు అడిగారు.
ప్రాబ్లమ్ సాల్వింగ్ కొశ్చన్స్
వ్యక్తిగత నేపథ్యం, విధి నిర్వహణ సామర్థ్యంపై ప్రశ్నలే కాకుండా.. అభ్యర్థులు భవిష్యత్తులో విధి నిర్వహణలో ఎదురయ్యే సమస్యల పరిష్కార నైపుణ్యాలను (ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్)పైనా ప్రశ్నలు అడిగారు.
- ఒక ప్రదేశంలో ఎగువ ప్రాంతంలోని రైతు.. దిగువ ప్రాంతంలోని రైతుకు నీరందకుండా చేశాడు. ఆ ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. ఆ సమయంలో మీరెలా ఆ సమస్యను పరిష్కరిస్తారు? అనేది ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, సమయస్ఫూర్తిని పరీక్షించేందుకు అడిగిన ఒక ప్రశ్న. అదే విధంగా.. ఒక ప్రాంతంలో రైతులు అశాస్త్రీయ పద్ధతుల్లో బోర్లు వేస్తున్నారు. నీరు రాకపోయినా మరో ప్రయత్నం చేస్తున్నారు? ఈ సమయంలో మీరు ఎలాంటి శాస్త్రీయ పద్ధతులు అవలంబిస్తారు? ఆ రైతులు చేస్తున్న ప్రయత్నం సరికాదని వారిని ఎలా మెప్పిస్తారు? వంటి ప్రశ్నలు అడిగారు.
ఆహ్లాదకర వాతావారణంలో
మొత్తం మీద టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన తొలి ఇంటర్వ్యూలు చాలా ఆహ్లాదకర వాతావరణంలో జరిగాయని అభ్యర్థులు ఆనందం వెలిబుచ్చారు. కమిషన్ సభ్యులు ఎంతో స్నేహపూర్వకంగా వ్యవహరించినట్లు చెప్పారు. 15 నుంచి 20 నిమిషాల ఇంటర్వ్యూ వ్యవధిలో తొలి అయిదు నిమిషాలు అభ్యర్థుల్లోని ఇంటర్వ్యూ టెన్షన్ తొలగిపోయే విధంగా రెండు బోర్డ్‌ల సభ్యులు వ్యవహరించినట్లు అభ్యర్థులు తెలిపారు.
- కమిషన్ కార్యాలయానికి ఎలా చేరుకున్నారు?
- మోటార్ బైక్‌పై రావడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురు కాలేదా?
- వాటి కారణంగా విసుగనిపించలేదా?
- మెట్రోరైల్ వస్తే ట్రాఫిక్ సమస్య ఎంత మేరకు పరిష్కారం కావొచ్చు?
- బ్రేక్ ఫాస్ట్ చేశారా?
- ఇంటర్వ్యూ కోసం కొత్త డ్రెస్ కొనుక్కున్నారా?
వంటి సాధారణ ప్రశ్నలతో ఇంటర్వ్యూ ప్రారంభించి.. అభ్యర్థి సాధారణ పరిస్థితికి, ఇంటర్వ్యూ బోర్డ్‌రూం వాతావరణానికి కుదురుకున్నాక మెంబర్లు ఇతర ప్రశ్నలవైపు మళ్లినట్లు అభ్యర్థులు చెప్పారు. ఆ ప్రశ్నించే తీరు కూడా ప్రశ్న, సమాధానం తరహాలో కాకుండా డిస్కషన్ మాదిరిగా ఉండటంతో అభ్యర్థులు సబ్జెక్ట్, జాబ్ ప్రొఫైల్‌కు సంబంధించిన సమాధానాలు ఇచ్చే విషయంలో టెన్షన్ లేకుండా వ్యవహరించగలిగినట్లు తెలిపారు.
ఇలా వ్యవహరిస్తే మేలు
భవిష్యత్తులో ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన, సమాధానాలు సిద్ధం చేసుకోవాల్సిన అంశాలు..
- బయోడేటాలో పేర్కొన్న సమాచారంపై అడిగే ప్రశ్నలకు సంసిద్ధత పొందాలి. తాము హాజరుకానున్న ఇంటర్వ్యూకు సంబంధించిన ఉద్యోగం- విధుల పరంగా అవసరమైన నైపుణ్యాలు, వాటిలో తమ సన్నద్ధత/సామర్థ్యాలపై అవగాహన పెంచుకోవాలి.
- ముఖ్యంగా టెక్నికల్, ఇంజనీరింగ్ నేపథ్యమున్న ఉద్యోగాల అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో ప్రాక్టికల్ నైపుణ్యాలు సొంతం చేసుకోవాలి.
- విశ్లేషణ నైపుణ్యం, అభిప్రాయ వ్యక్తీకరణలో స్పష్టత ఉండేలా చూసుకోవాలి.
Published date : 08 Jan 2016 12:26PM