Skip to main content

TSPSC: ఈ కొలువుల భర్తీపై టీఎస్‌పీఎస్సీ కసరత్తు

వివిధ ప్రభుత్వ శాఖల్లో 663 Group–2, 1,373 Group–3 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతులు జారీ చేయడంతో వాటిని భర్తీ చేసేందుకు Telangana State Public Service Commission (TSPSC) చర్యలు వేగవంతం చేసింది.
TSPSC
ఈ కొలువుల భర్తీపై టీఎస్‌పీఎస్సీ కసరత్తు

ఇందులో భాగంగా సెప్టెంబర్‌ 2న గ్రూప్‌–2 ఖాళీలున్న ప్రభుత్వ శాఖల అధికారులతో TSPSC కార్యాలయంలో సమావేశం నిర్వహించింది. TSPSC చైర్‌పర్సన్‌ బి.జనార్దన్‌రెడ్డి, కార్యదర్శి అనితారామచంద్రన్‌ తదితరులు సంబంధిత శాఖల అధికారుల పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రతిపాదనల రూపకల్పనపై సూచనలు చేశారు. సర్వీసు నిబంధనలు, సవరణలు, వివరణలు, రోస్టర్‌ విధానం, క్యారీఫార్వర్డ్‌ పోస్టులు తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ప్రతిపాదనలు రూపకల్పన చేపట్టే అంశాలపై అవగాహన కల్పించారు. సంబంధిత శాఖలన్నీ నిర్ణీత పద్ధతిలో ఇండెంట్లు సమర్పించిన వెంటనే పరిశీలన చేపట్టి నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు TSPSC వెల్లడించింది.

చదవండి: 

Published date : 03 Sep 2022 01:38PM

Photo Stories