Competitive exams: రాత పరీక్షలో రాణించేలా ఇలా ప్రిపరేషన్ సాగించాలి
Sakshi Education
- ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అభ్యర్థులు.. ఎలక్ట్రికల్ మెటీరియల్స్, బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ బ్యాటరీస్, ఎలక్ట్రికల్ సర్క్యూట్స్,డీసీ మెషీన్స్, మెజరింగ్ ఇన్‌స్ట్రుమెంట్స్, ఏసీ మెషిన్స్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, పవర్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ ఇన్‌స్టాలేషన్ అండ్ ఎస్టిమేషన్, యుటిలైజేషన్ అండ్ ట్రాక్షన్, పవర్ ఎలక్ట్రానిక్స్‌కు, అనలాగ్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్, సిగ్నల్ ప్రాసెసింగ్, కంట్రోల్ సిస్టమ్, ఎలక్ట్రికల్ మెషీన్స్, పవర్ సిస్టమ్స్, పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్, పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ డ్రైవ్స్, థర్మోడైనమిక్స్, హీట్ ట్రాన్స్‌ఫర్‌కు సంబంధించిన అన్ని అంశాలపై పరిపూర్ణ అవగాహన పొందాలి.
- మెకానికల్ బ్రాంచ్ అభ్యర్థులు.. ఇంజనీరింగ్ మెకానిక్స్, మెకానిక్స్ ఆఫ్ మెటీరియల్స్, థియరీ ఆఫ్ మెషీన్స్, వైబ్రేషన్స్, థర్మోడైనమిక్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్, హీట్ ట్రాన్స్‌ఫర్, ఇంజనీరింగ్ మెటీరియల్స్, క్యాస్టింగ్, ఫార్మింగ్, జాయింగ్ ప్రక్రియలపై అవగాహన ఏర్పరచుకోవాలి. అదే విధంగా.. కంప్యూటర్ ఇంటిగ్రేటెడ్ మాన్యుఫ్యాక్చరింగ్, ప్రొడక్షన్ అండ్ ప్లానింగ్ కంట్రోల్, ఇన్వెంటరీ కంట్రోల్, ఆపరేషన్స్ రీసెర్చ్ ఐసీ ఇంజన్స్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండీషన్, పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్ తదితర అంశాలపై దృష్టి పెట్టాలి.
- సివిల్ ఇంజనీరింగ్ అభ్యర్థులు.. ఇంజనీరింగ్ మెకానిక్స్, సాలిడ్ మెకానిక్స్, స్ట్రక్చరల్ అనాలిసిస్, బిల్డింగ్ మెటీరియల్ అండ్ కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్, ఫ్లూయిడ్ మెకానిక్స్, ఓపెన్ ఛానెల్ ఫ్లో, పైప్ ఫ్లో, హైడ్రాలజీ అండ్ వాటర్ రిసోర్సెస్ ఇంజనీరింగ్, వాటర్ సప్లై ఇంజనీరింగ్, వేస్ట్ వాటర్ మేనేజ్‌మెంట్, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్, జియో టెక్నికల్ ఇంజనీరింగ్, ఎయిర్ పొల్యూషన్, సర్వేయింగ్, ట్రాన్స్‌పోర్టేషన్ ఇంజనీరింగ్, పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్ విభాగాల్లోని అంశాల్లో దృష్టి పెట్టాలి.
- ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ అభ్యర్థులు.. నెట్‌వర్క్స్, సిగ్నల్స్, సిస్టమ్స్, ఎలక్ట్రానిక్ డివైసెస్, అనలాగ్ సర్క్యూట్స్, డిజిటల్ సర్క్యూట్స్, కంట్రోల్ సిస్టమ్స్, కమ్యూనికేషన్స్, ఎలక్ట్రో మ్యాగ్నటిక్స్, బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెటీరియల్స్ సైన్స్, పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ మెజర్‌మెంట్స్‌కు సంబంధించిన అంశాలపై దృష్టి పెట్టాలి.
- జనరల్ అవేర్‌నెస్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ కోసం ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యం ఉన్న కరెంట్ అఫైర్స్‌పై పట్టు సాధించాలి. తెలంగాణకు సంబంధించి ఆర్థిక, సామాజిక అభివృద్ధిపై దృష్టి సారించాలి. తాజాగా అమలవుతున్న అభివృద్ధి పథకాలను తెలుసుకోవాలి. తెలంగాణ ప్రాంత భౌగోళిక స్వరూపం, విశిష్టతలు తెలుసుకోవాలి. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన చరిత్రపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. తెలంగాణ తొలి ఉద్యమ దశ నుంచి తెలంగాణ ఆవిర్భావం వరకు పలు ముఖ్యమైన అంశాలను ఔపోసన పట్టాలి.వీటితోపాటు తెలంగాణ సంస్కృతి, సామాజిక పరిస్థితులు, కళలు, సాహిత్యం వంటి అంశాలను కూడా చదవాలి.
ఇటీవల కాలంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలపై అవగాహన ఏర్పరచుకోవాలి. అనలిటికల్ ఎబిలిటీ విషయంలో గ్రాఫ్స్, డేటా అనాలిసిస్ అంశాలను ప్రాక్టీస్ చేయాలి. పదో తరగతి స్థాయిలో ఇంగ్లిష్ గ్రామర్‌ను అభ్యసనం చేయాలి.
చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ
అన్వయ దృక్పథం
ప్రిపరేషన్ సమయంలో అభ్యర్థులు అప్లికేషన్ ఓరియెంటేషన్‌తో ముందుకు సాగాలి. ముఖ్యంగా సబ్జెక్ట్ విభాగానికి సంబంధించి బీటెక్ స్థాయిలోని అకడమిక్ పుస్తకాలను ఆలంబనగా చేసుకుని ప్రిపరేషన్ సాగించాలి. మోడల్ పేపర్లు, మాక్ టెస్ట్‌లు రాయడం కూడా పరీక్షలో మెరుగైన ప్రతిభ చూపేందుకు దోహదం చేస్తుంది.
Published date : 12 Dec 2023 11:43AM