TGPSC ఆఫీస్ ముందు పోస్టర్ల కలకలం
Sakshi Education
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందు గ్రూప్-1 పోస్టర్లు కలకలం సృష్టించాయి. కమిషన్ కార్యాలయం గోడలకు, గేట్లకు కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడి ఫొటోలతో పోస్టర్లు వెలిశాయి. నాంపల్లిలోని టీజీపీఎస్సీ, హైదరగూడలోని తెలుగు అకాడమీ ముందు గుర్తు తెలియని అగంతకులు పోస్టర్లను అతికించారు.
ఆ పోస్టర్లలలో తెలుగు అకాడమి పుస్తకాలు పోటీ పరీక్షలకు ప్రామాణికం కాదని.. ప్రభుత్వం కోర్టుకు చెప్పిన నేపథ్యంలో వాటిని ఎవరు కొనవద్దని విజ్ఞప్తి చేశారు. అలాగే టీజీపీఎస్సీ ముందు నేను ఒక నియంతని.. తప్పు జరిగితే ఒప్పుకోను అని పోస్టర్లు కనిపించడం చర్చనీయాంశంగా మారింది.
చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ
అంతేకాదు గ్రూప్-1లో 150 ప్రశ్నలు తయారు చేయలేని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎందుకు అంటూ సిగ్గు..సిగ్గు, టీజీపీఎస్సీ తప్పులతో నిరుద్యోగులకు ఎన్ని తిప్పలో అంటూ పోస్టర్‌లు కనిపించాయి.
పోస్టర్లపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోస్టర్లను ఎవరు అంటించారోనని ఆరా తీస్తున్నారు.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
Published date : 04 Oct 2024 01:18PM
Tags
- Group 1 Posters
- TGPSC
- telangana public service commission
- telugu academy
- cm revanth reddy
- group 1
- Hyderabad
- TGPSC Group 1 Notification 2024
- Posters
- Telangana News
- congress
- Telugu Academy Books
- 150 Questions
- Group 1 Questions
- tspsc jobs notification 2024 news telugu
- tspsc upcoming notifications 2024
- TSPSC job notifications 2024
- Group1Posters
- HyderabadNews
- ProtestPosters