Group I: ప్రిలిమ్స్ వాయిదా వేయండి.. కారణం ఇదే..
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం, తుర్కయంజాల్‌కు చెందిన గ్రూప్–1 అభ్యర్థి బి.వెంకటేశ్ సహా 38 మంది పిటిషన్ దాఖలు చేశారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శి, టీఎస్‌పీఎస్సీ చైర్మన్, కార్యదర్శి, పేపర్ లీకేజీపై విచారణ చేస్తున్న సిట్‌ను ప్రతివాదులుగా పేర్కొన్నారు. పేపర్ లీకేజీ కారణంగా అక్టోబర్‌లో నిర్వహించిన ప్రిలిమ్స్‌ను రద్దు చేసిన విషయం తెలిసిందే.
చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ
అయితే జూన్ 11న మళ్లీ ప్రిలిమ్స్‌ను నిర్వహించేందుకు టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రిలిమ్స్‌ను రెండు నెలలు వాయిదా వేయాలని విజ్ఞప్తి చేస్తూ అభ్యర్థులు హైకోర్టులో∙పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నో ఏళ్లుగా గ్రూప్–1, 2, 3, 4 పరీక్షల కోసం ఎదురుచూస్తున్నామని, ఈ పరీక్షలకు కొంత సమయం ఇవ్వాలని అధికారులను కోరామని, తమ విజ్ఞప్తిని వారు పరిగణనలోకి తీసుకోలేదని వెల్లడించారు.