Skip to main content

సర్కారు ఉద్యోగులమా? కాదా?.. ఉద్యోగులకు సరికొత్త సమస్య..

ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు సరికొత్త సమస్య వచ్చిపడింది.
newest problem for governor of telangana contract employees
సర్కారు ఉద్యోగులమా? కాదా?.. ఉద్యోగులకు సరికొత్త సమస్య..

గ్రూప్‌–1 దరఖాస్తు ప్రక్రియలో వారి ఉద్యోగ కేటగిరీని ఏ విధంగా నమోదు చేయాలో అంతుచిక్కడం లేదు. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తుండటంతో వారి ఉద్యోగ అర్హత ప్రభుత్వ ఉద్యోగ కేటగిరీలోకి వస్తుందా? లేక ప్రైవేటు ఉద్యోగి కేటగిరీని ఎంపిక చేయాలా అనే అంశంపై వారు తర్జనభర్జన పడుతున్నారు. గ్రూప్‌–1 ఆన్ లైన్ దరఖాస్తులో ఉద్యోగ కేటగిరీ విషయంలో రెండు ఆప్షన్లు మాత్రమే ఉండటంతో ఈ పరిస్థితి నెలకొంది.

చదవండి: 

TSPSC గ్రూప్‌–1 నోటిఫికేషన్‌.. శాఖలవారీగా పోస్టులు.. వయోపరిమితి సడలింపు!

​​​​​​​టీఎస్‌పీఎస్సీ ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

సరైన వివరాలివ్వకుంటే అనర్హత...

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సరీ్వస్‌ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) విడుదల చేసిన గ్రూప్‌–1 నోటిఫికేషన్ లో నిబంధనలను స్పష్టంగా వెల్లడించింది. దరఖాస్తులో ఎలాంటి పొరపాట్లు చేసినా వాటికి దరఖాస్తుదారు బాధ్యత వహించాల్సి ఉంటుందని, కమిషన్ ను తప్పుదోవ పట్టించినందుకు సదరు దరఖాస్తుదారును అనర్హుడిగా ప్రకటించే అధికారం కమిషన్ కు ఉంటుందని చెప్పింది. ఈక్రమంలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగి ఏ కేటగిరీని ఎంపిక చేసుకోవాలో అర్థం కావడం లేదు. వివిధ ప్రభుత్వ శాఖల్లో 30వేలకుపైగా కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తుండగా, వీరిలో అత్యధికంగా జూనియర్‌ పంచాయతీ సెక్రెటరీ (జేపీఎస్‌)లు 9వేల వరకు ఉన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ముందు 13 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నట్లు అంచనా. వీరు గ్రూప్‌–1 దరఖాస్తు చేసుకునేందుకు వెబ్‌సైట్‌ తెరిచి వివరాలు సమరి్పంచే సమయంలో ఉద్యోగ కేటగిరీ వద్దే ఆగిపోవాల్సి వస్తోంది.

Sakshi Education Mobile App

ఔను.. కాదు...

గ్రూప్‌–1 దరఖాస్తులో సమస్యల పరిష్కారానికి టీఎస్‌పీఎస్సీ హెల్ప్‌ డెస్‌్కను ఏర్పాటు చేసింది. కొందరు కాంట్రాక్టు ఉద్యోగులు హెల్ప్‌డెస్క్ను సంప్రదించి విషయం తెలియజేసే ప్రయత్నం చేశారు. వారి ఉద్యోగ కేటగిరీని ప్రైవేటు కింద పరిగణిస్తారని బదులివ్వగా, కమిషన్ మెయిల్‌ ఐడీకి సమాచారం పంపితే ప్రభుత్వ ఉద్యోగ కేటగిరీలోకి వస్తారంటూ భిన్న సమాధానాలు వచ్చాయి. దీంతో వారి కేటగిరీపై సందిగ్ధత నెలకొంది. 

Published date : 07 May 2022 03:26PM

Photo Stories