TSPSC Board: టీఎస్‌పీఎస్సీ బోర్డు రద్దు చేయాలని ధర్నా
గ్రూప్–1 పరీక్ష మళ్లీ రద్దు కావడంతో తమకు బోర్డుపైనే అనుమానం కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. యూపీఎస్‌సీ ద్వారా గ్రూప్–1 పరీక్ష నిర్వహించాలని కోరారు. గ్రూప్–4 పరీక్షలో 1,000 నుంచి 1,800 ర్యాంకు వరకు ఓఎంఆర్ ఆన్షర్‌షీట్లు ఎక్కువ ఎలా వస్తాయని వారు ప్రశ్నించారు. గ్రూప్–4 పరీక్షపై కూడా అనుమానం కలుగుతోందని, దీనిని కూడా రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని నినదించారు.
టీఎస్‌పీఎస్సీ బోర్డును ప్రక్షాళన చేయాలని, చైర్మన్ జనార్దన్‌రెడ్డిని తొలగించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల జేఏసీ నేత లక్ష్మణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళనలో అభ్యర్థులు సురేశ్, రవి, సలీం, మహేష్, సుమంత్, కిషన్, రామకృష్ణ, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రూప్–1 పరీక్షలో కూడా 258 ఓఎంఆర్ ఆన్సర్‌షీట్లు అదనంగా స్కాన్ అయ్యాయని ఆరోపించారు.
చదవండి: High Court: గ్రూప్–1 ప్రిలిమ్స్ రద్దు సబబే
నిరుద్యోగుల జీవితాలతో తెలంగాణ ప్రభుత్వం ఆటలాడుకుంటోందని ఆరోపించారు. ఈ సందర్భంగా పోటీ పరీక్షల అభ్యర్థులు, నిరుద్యోగులు లైబ్రరీ అవరణతోపాటు ఓపెన్ ఆడిటోరియం వద్ద నిరసన తెలిపి, ప్రధాన గేటు బయట మెయిన్‌రోడ్డుపైకి వచ్చి నినాదాలు చేశారు.