TSPSC: జూన్ నుంచి పేపర్ల కోసం ప్రయత్నాలు.. ఇంకా నమ్మలేని నిజాలు ఎన్నో..
దీంతో పలు కీలకాంశాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. టీఎస్‌పీఎస్సీ సిస్టమ్ అడ్మిన్‌గా ఉన్న రాజశేఖర్‌రెడ్డి అక్కడి ఉద్యోగులు, అధికారులకు యూజర్ ఐడీలు తయారు చేసి ఇచ్చాడు. ఎవరికి ఇబ్బంది వచ్చి నా ఇతడే వెళ్లి సరిచేసేవాడు. ఈ నేపథ్యంలోనే కస్టోడియన్ శంకరలక్ష్మి , మరికొందరి యూజర్ ఐడీలు, పాస్‌వర్డ్స్ ఇతడికి తెలిశాయి. గ్రూప్–1 కోసం దరఖాస్తు చేసుకున్న ప్రవీణ్ ఆ ప్రశ్న పత్రం ఇవ్వాలని గత జూన్ నుంచి రాజశేఖర్‌ను కోరుతున్నాడు. అతడి కోసమే శంకరలక్ష్మి సిస్టమ్‌ను ల్యాన్ ద్వారా యాక్సెస్ చేయడం మొదలెట్టాడు. ఆమె లేని సమయంలో కాని్ఫడెన్షియల్ సెక్షన్‌లోకి వెళ్లి రాజశేఖర్ కంప్యూటర్ ఆన్ చేసి వచ్చేవాడు.
చదవండి: KTR : ఈ టీఎస్‌పీఎస్సీ పరీక్షలకు.. మళ్లీ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు.. అలాగే అన్ని..
ప్రవీణ్ కంప్యూటర్ నుంచి ల్యాన్ ద్వారా ఆ కంప్యూటర్‌ను యాక్సెస్ చేసి ప్రశ్నపత్రాల కోసం వెతికేవాడు. ఈ క్రమంలోనే గత అక్టోబర్ మొదటివారంలో గ్రూప్–1 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రం, గత నెలలో మిగిలిన పరీక్షలకు ప్రవీణ్ చేతికి వచ్చాయి. దీంతో శంకరలక్ష్మి పుస్తకంలో యూజర్ ఐడీ, పాస్‌వర్డ్స్ తస్కరించామని అంతకుముందు ప్రవీణ్, రాజశేఖర్ చెప్పిన అంశం అవాస్తవమని అధికారులు నిర్ధా«రించారు. ఈ వ్యవహారంలో సాంకేతిక అంశాలకు సంబంధించి ఫోరెన్సిక్ నివేదికలు రాకపోవడంతో కీలకాంశాల్లో స్పష్టత రావట్లేదని అధికారులు చెప్తున్నారు. నివేదికల కోసం ఎదురుచూస్తున్నారు.