Skip to main content

Group 1 jobs: గ్రూప్‌–1కు తొలిరోజు 3,895 దరఖాస్తులు

Applications on the first day for Group-1
Applications on the first day for Group-1

సాక్షి, హైదరాబాద్‌: గ్రూప్‌–1 దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. తొలిరోజు సోమవారం సాయంత్రానికి 3,895 దరఖాస్తులు వచ్చినట్లు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలిసారి గ్రూప్‌–1 నోటిఫికేషన్‌ జారీ చేయడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కమిషన్‌.. దరఖాస్తు ప్రక్రియను విశ్లేíÙంచుకునేందుకు అభ్యర్థుల నుంచి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకునే ప్రయత్నం మొదలుపెట్టింది. సమస్యలు గుర్తిస్తే వెంటనే పరిష్కరించేందుకు ఈ కార్యక్రమం చేపట్టింది. కమిషన్‌ యంత్రాంగం సోమవారం 10 మంది అభ్యర్థులతో మాట్లాడింది. ఇబ్బంది లేకుండా దరఖాస్తులు పూర్తి చేసినట్టు వాళ్లు చెప్పారని సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఒక్కో దరఖాస్తును పూరించేందుకు సగటున 5 నుంచి 8 నిమిషాల సమయం పడుతున్నట్టు కమిషన్‌ వివరించింది. ఈ నెల 31వ తేదీతో దరఖాస్తు ప్రక్రియ ముగుస్తుందని, అభ్యర్థులు గడువు తేదీ వరకు వేచి చూడకుండా వీలైనంత త్వరగా దరఖాస్తు చేయాలని సూచించింది.  

Published date : 03 May 2022 04:05PM

Photo Stories