6. ప్రత్యుత్పత్తి - పునరుత్పాదక వ్యవస్థ
పాఠ్య విశ్లేషణ:
- ఒక జీవి జాతి శాశ్వతంగా, నిరంతరంగా తన తరాలను కొనసాగించడాన్ని ప్రత్యుత్పత్తి అంటారు. ఇది 2 రకాలు
1) లైంగిక ప్రత్యుత్పత్తి
2) అలైంగిక ప్రత్యుత్పత్తి
- సృష్టిలో ఎక్కువ శాతం జీవులు లైంగిక ప్రత్యుత్పత్తిని జరుపుకుంటాయి. కొన్ని నిమ్నస్థాయి జీవులు, మొక్కలు అలైంగిక విధానాలకు అలవాటు పడతాయి.
- ఈ అలైంగిక విధానాలలో విచ్ఛిత్తి, కోరకీభవనం, ముక్కలుకావడం, సిద్ధబీజాల ఉత్పత్తి, పునరుత్పత్తి కనిపిస్తాయి.
- మొక్కలు శాఖీయ భాగాలైన కాండం, వేరు, ఆకులు మొదలైన భాగాల కొత్త మొక్కలను ఉత్పత్తి చేస్తాయి. దీనినే శాఖీయ ప్రత్యుత్పిత్తి అంటారు.
- మానవ పురుష ప్రత్యుత్పత్తి, వ్వవస్థలో ఒక జత ముష్కాలు, శుక్రవాహికలు అనుబంధ గ్రంధులు ఉంటాయి. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఒక జత బీజకోశాలు, పాలోఫియన్ నాళాలు కలిగి ప్రతి నెలకు ఒక అండాన్ని విడుదల చేస్తాయి.
- శుక్రకణాలు అతి సూక్ష్మమైనవి. ఇవి తల, మెడ, తోక భాగాలను కలిగి ఉంటాయి. అండాలు పరిమాణంలో పెద్దగా ఉంటాయి.
- స్త్రీ జీవిలో జరిగే ఫలధీకరణం రెండు రకాలుగా ఉంటుంది. బాహ్యఫలధీకరణం, అంతర ఫలధీరకణం. తల్లి గర్భాశయ కండర కణజాలం, భ్రూణం యొక్క కణ జాలాలు కలిసే చోట జరాయువు ఏర్పడుతుంది. ఇది పోషక పదార్థాల రవాణాకు తోడ్పతుంది.
- మానవులలో గర్భావధి కాలం సుమారు 9 నెలలు లేదా 280 రోజులు. సమవిభజన ఫలితంగా ఏర్పడిన పిల్లకణాలలోని క్రోమొజోముల సంఖ్య, జనకుల సంఖ్యకు సమానంగా ఉంటుంది. ఈ విభజనలో 4 దశలుంటాయి. ఇవి ప్రధమ, మధ్య, చలన, అంత్యదశలు.
- క్షయకరణ విభజనలో కణం 2 సార్లు విభజన చెంది 4 పిల్ల కణాలు ఏర్పడతాయి.
- HIV/AIDS వంటి లైంగిక వ్యాధులు వ్యాప్తి చెందే విధానాలు మరియు వాటి గురించిన యదార్థాలను తెలుసుకోవడం అవసరం.
- జనాభాను నియంత్రించేందుకు అనేక గర్భనిరోధక సాధనాలు- గురించి తెలుసుకొని అమలు చేయడం కూడా అవసరంగా భావించాలి.
- సమాజంలో నెలకొన్న సాంఘీక దురాచారాలను రూపుమాపడంలోను, ఆరోగ్యవంతమైన సమాజనిర్మాణం కోసం పాటుపడటం ప్రతి ఒక్కరి బాధ్యత.
- పురుష లైంగిక హార్మోన్ టెస్టోస్టిరాన్
- స్త్రీ లైంగిక హార్మోన్ ఈస్ట్రోజన్
- పగిలిన స్త్రీ బీజ కోశ పుటికను కార్పస్‌టాటియం అంటారు.
- అభివృద్ధి చెందిన పిండకోశంలో 7 కణాలుంటాయి.
- గర్భధారణ జరిగిన తర్వాత 3 నెల నుండి పిండాన్ని భ్రూణం అంటారు.
- కణ జాల వర్ధనాన్ని మొదట కనుగొన్నవారు జి.హేబర్ లాండ్
క్విక్ రివ్యూ
- శాఖీయోత్పత్తి: మొక్కలలో పువ్వులను లైంగిక ప్రత్యుత్పత్తి భాగాలు అంటారు. వీటిని మినహాయించి కాండం, పత్రం, వేర్లు వంటి భాగాలను శాఖీయభాగాలు అంటారు. ఈ శాఖీయ భాగాల ద్వారా జరిగే ప్రత్యుత్పతిని శాఖీయోత్పత్తి అంటారు. వీటిలో సహజమైన శాఖీయోత్పత్తి, కృత్రిమ శాఖీయోత్పత్తి రకాలున్నాయి.
- అంటుకట్టుట: రెండు మొక్కల కాండాలను కత్తిరించి, ఒకచోట అంటు కడతారు. దీనిలో నెలలో పెరిగే మొక్క భాగాన్ని ‘స్టాక్’ అని మొక్కపైన అతికించిన భాగాన్ని ‘సయాన్’ అని అంటారు. సయాన్‌లోని కొత్త లక్షణాలు స్టాక్ మొక్కలోకి చేరతాయి. అంటుకట్టుట అనేది కోరుకున్న లక్షణాలను పొందే ఉత్తమమైన పద్ధతి.
- కణజాల వర్థనం: కృత్రిమ యానకంలో ఒక మొక్క కణం నుండి పూర్తి మొక్కను పొందే విధానం. ఏ మొక్క కణం వర్ధనానికి తీసుకుంటామో, ఆ మొక్క కణాన్ని టోటిపొటెన్సీ అంటారు. ఈ కణజాల వర్ధనాన్ని మొదట జి. హేబర్ లాండ్ శాస్త్రవేత్త చేశారు.
- ఉమ్మినీరు: ఉల్బం లోపలి కుహరంలో ఉండే నీరు. ఇది పిండానికి తేమను అందిస్తుంది. అలాగే శిశువు కదలికలకు, కుదుపుల నుండి రక్షణనిస్తుంది.
- నాభి రజ్జువు: ఎల్లంటాయిస్ త్వచం పిండం యొక్క ఆహారనాళం నుండి ఉద్భవిస్తుంది. సొనసంచి ఉల్బపు ముడుతల అంచులు ఎల్లంటాయిస్ కాడ వద్ద కలిసి పిండాన్ని జరాయువుతో కలిసే నాళాన్ని ఏర్పరుస్తాయి. ఈ నాళాన్నే నాభి రజ్జువు అంటారు. దీని ద్వారా తల్లి నుండి బిడ్డకు పోషక పదార్థాలు అందజేయబడతాయి.
- కుటుంబ నియంత్రణ పద్ధతులు: ఇవి శాశ్వతమైన శస్త్ర చికిత్సా విధానాలు. మగవారిలో వేసెక్టమీ. దీనిలో శుక్రనాళాలను కత్తిరించి ముడి వేస్తారు. స్త్రీలలో ట్యూబెక్టమి. ఫాలోఫియన్ నాళాలను కత్తించి ముడి వేస్తారు.
4 మార్కుల ప్రశ్నజవాబులు
- కణచక్రంలోని దశలను వివరించండి (AS-1)
జ: సాధారణంగా కణవిభజన ప్రక్రియలను సమవిభజన అంటారు. ఈ విభజన 40-60 నిమిషాల్లో పూర్తవుతుంది. రెండు కణ విభజనలకు మధ్య నుండే సమయాన్ని అంతర్థశ (Interphase) అంటారు. ఈ దశలో కణవిభజనకు కావాల్సిన పదార్థాల ఉత్పత్తి, DNA జన్యు పదార్థం ప్రతికృతి జరిగి సమవిభజన ద్వారా పిల్ల కణాలకు సమానంగా పంచబడతాయి. ఈ దశను 3 ఉపదశలుగా వర్గీకరించారు.
G1 దశ: ఇది సమవిభజనకు మరియు DNA ప్రతికృతికి మధ్యగల సంధాన దశ ఈ దశలో కణపరిమాణం పెరుగుతుంది.
S దశ: ఇది DNA సంశ్లేషణ దశ. ఈ దశలో క్రోమోజోములు రెట్టింపు అవుతాయి.
G2 దశ: ఇది DNA ప్రతికృతి మరియు సమవిభజన ప్రారంభానికి మధ్య గల దశ కణాంగాలు విభజన చెందుతాయి.
M దశ: ఇది సమ విభజన జరిగే దశ.
- ఏదైనా ఒక ఆకర్షణీయమైన పుష్పం పటం గీచి, అందలి భాగాలను, వాటి విధులను వ్రాయండి. (AS-5)
జ:
పుష్పం యొక్క పుష్పాసనం పై పుష్పభాగాలు 4 వలయాలుగా అమరి ఉంటాయి. అవి
(1) రక్షకపత్రాలు
(2) ఆకర్షక పత్రాలు
(3) కేసరావళి
(4) అండకోశం.
- రక్షక పత్రాలు: ఇవి మొదటి వలయంలో ఆకు పచ్చని రంగులో ఉంటాయి. ఇవి మొగ్గ దశలో, పుష్పం లోపలి భాగాలను కప్పి ఉంచి రక్షణనిస్తాయి.
- ఆకర్షక పత్రాలు: ఇవి పుష్పం యొక్క రెండవ వలయంలో వివిధ రంగులను, సువాసనాలను కలిగి ఉంటాయి. ఇవి పరాగ సంపర్కం కోసం కీటకాలను ఆకర్షించడానికి సహాయపడతాయి.
- కేసరావళి: ఇవి పుష్పం మూడవ వలయంలో ఉంటాయి. కేసరావళి, కేసరదండము, పరాగకోశము అను భాగాలు ఉంటాయి. పరాగ కోశాలలో పరాగరేణువులు ఉంటాయి. ఇవి పురుషబీజ కణాలు.
- అండకోశము: ఇది పుష్పాసనం నాలుగవ వలయంలోని భాగము దీనిలో అండాశయం, కీలం, కీలాగ్రం అను భాగాలు ఉంటాయి. అండాశయంలో అండాలు ఉంటాయి. ఇవి స్త్రీ బీజ కణాలు.
- వివిధ అలైంగిక ప్రత్యుత్పత్తి విధానలను తగిన ఉదాహరణలతో వివరించండి (AS-1)
జ: అలైంగిక ప్రత్యుత్పత్తి విధానాలు:-
- విచ్ఛిత్తి: ఏకకణ జీవాలలో శరీరం రెండు లేదా ఎక్కువ ముక్కలుగా విభజన చెందుతుంది. దీనినే విచ్ఛిత్తి అంటారు. ఒక జీవి రెండుగా విడిపోతే ‘ద్విధా విచ్ఛిత్తి’ అని, అంతకంటే ఎక్కువ భాగాలుగా విడిపోతే బహుధావిచ్ఛిత్తి అని అంటారు. ఈ విచ్ఛిత్తిలో కేంద్రకం ప్రధానమైనది.
ఉదా: అమీబా, పేరమీషియం.... - కోరకీభవనం: జనక జీవి శరీరంలో ఒకచోట బుడిపెలాంటి నిర్మాణం ఏర్పరుస్తుంది. ఇది జనక జీవి నుండి వేరై స్వతంత్రంగా జీవిస్తుంది.
ఉదా: ఈస్టు, హైడ్రా.. - ముక్కలగుట: కొన్ని ఈ జీవులు జనక జీవి యొక్క శరీరంలోని ఖండిత భాగాల నుండి పెరుగ గలవు. శరీరంలో ఏ ఖండమైనా మొత్తం శరీరాన్ని ఏర్పరుస్తుంది.
ఉదా: వెకైన్లు, చదును పురుగులు...
- అనిషేక జననం: ఫలధీకరణం జరగకపోయినా అండం అభివృద్ధి చెంది పిల్లజీవులుగా ఏర్పడే ప్రక్రియ.
ఉదా: కందిరీగలు, తేనెటీగలు, చీమలు
- సిద్ధ బీజాల ద్వారా: శిలీంధ్రపు జాతులలో సూక్ష్మ సిద్ధ బీజాశయంలో సిద్దబీజాలు ఉంటాయి. ఇవి గాలి ద్వారా వ్యాపించి అనుకూల వాతావరణంలో మొలకెత్తుతాయి.
ఉదా: రైజోపస్.
- పునరుత్పత్తి: ఏదైనా కారణం చేత జీవి యొక్క శరీరభాగం తెగి పోవడం లేదా ముక్కలవడం జరిగితే, ఆ భాగంలోని ఖండాలలో జీవి పెరుగుతుంది.
ఉదా: ప్లనేరియా.
-
- జీవి అభివృద్ధిలో ముఖ్యమైన కణవిభజనను నీవు ఏవిధంగా అభినందిస్తావు? (AS-6)
జ:- జీవి అభివృద్ధి చెందడానికి, పరిమాణం పెరగడానికి కణవిభజన చాలా అవసరం.
- కణ విభజన వలన కణాల సంఖ్య పెరుగుతుంది. దాని వలన జీవి అభివృద్ధి చెంది జీవక్రియలను నిర్వహించగలుగుతుంది.
- ఏకకణ జీవులలో కణవిభజన అలైంగిక ప్రత్యుత్పత్తి విధానంగా పనిచేస్తుంది.
- గాయాలు మాన్పటంలోనూ, చనిపోయిన కణాలను భర్తీ చేయటంలోనూ కణవిభజన అత్యంత కీలకమైనది.
- ప్రత్యుత్పత్తి విధానంలో కణవిభజన వల్లనే జీవులు తమ జాతిని నిలుపు కొంటున్నాయి.
- భూమి మీద జీవం ఏర్పడటం ఒక అద్భుత విషయం అయితే, ఆ జీవనం కొనసాగటానికి తోడ్పడే కణవిభజన అత్యద్భుతం.
- అందువలన జీవుల మనుగడకు, వంశాభివృద్ధికి కణవిభజన కీలకమైన ప్రక్రియగా నేను భావిస్తాను.
- శాఖీయోత్పత్తి మానవుని నిత్య జీవితానికి ఎలా ఉపయోగపడుతుంది? (AS-6)
జ:- జనక మొక్కలోని స్థిరమైన, ప్రత్యేక లక్షణాలను సులభంగా తర్వాతి తరాలకు అందించవచ్చును.
- తక్కువ కాలంలో ఎక్కువ సంఖ్యలో మొక్కలను ఉత్పత్తి చేయవచ్చు.
- అలంకరణ మొక్కలలో కనిపించే ఆకర్షణీయమైన పువ్వులు, ఆకులు వంటి ఆసక్తికరమైన మార్పు తర్వాతి తరాలకు దీని ద్వారా అందించవచ్చు.
- వాంఛనీయమైన లక్షణాలు ఉండే కొత్తరకాలను తయారు చేసుకొనవచ్చు.
- వ్యాధులను తట్టుకోగల శక్తి ఉండే మొక్కలను పొందగలుగుతున్నాం.
- కోరకీభవనానికి, అంటుకట్టడానికి శాఖీయోత్పత్తి ఒక ఆధారపు మొక్క భాగంగా పనిచేస్తుంది.
- అరుదుగా పుష్పించే మొక్కల వ్యాప్తికి శాఖీయోత్పత్తి ఉపయోగపడుతుంది.
- సమవిభజన, క్షయకరణ విభజనల మధ్య తేడాలను పట్టికలో పొందుపర్చండి.
జ:
సమవిభజన క్షయకరణ విభజన 1. శాఖీయ కణాలలో జరుగుతుంది. 1. లైంగిక కణాలలో జరుగుతుంది. 2. కేంద్రకం ఒకసారి విభజన చెందుతుంది. 2. కేంద్రకం 2 సార్లు విభజన చెందుతుంది. 3. రెండు పిల్లకేంద్రాలు ఏర్పడతాయి. 3. నాలుగు పిల్లకేంద్రాలు ఏర్పడతాయి. 4. పిల్లకణాలు ద్వయస్థితిక స్థితిలో ఉంటాయి 4.పిల్లకణాలు ఏకస్థితిక దశలో ఉంటాయి. 5. సాధారణంగా జరుగుతుంది. 5. అరుదుగా జరుగుతుంది. 6. పిల్లకణాలు శాఖీయ భాగాలను ఏర్పరుస్తాయి. 6. పిల్ల కణాలు సంయోగ బీజాలను ఏర్పరుస్తాయి. 7. విభజనలో దశలన్నీ ఒక్కొక్కటిగా ఉంటాయి. 7. విభజనంలో రెండేసి దశలుండి (ప్రధమదశ-1లో ఉపదశలు ఉంటాయి.) 8. క్రోమోజోముల సంఖ్య పిల్లకణాల్లో మారదు. 8. పిల్లకమాల్లో క్రోమోజోముల సంఖ్య సగమవుతుంది. 9. విభజన ప్రారంభంలో క్రోమోజోముల సంఖ్య రెట్టింపవుతుంది. 9.రెండవ దశలో విభజన ప్రారంభంలో జరుగుతుంది. 10. వినిమయం జరుగదు. 10. వినిమయం జరుగుతుంది
- మానవులకు సంభవించే అవకాశమున్న చర్మవ్యాధులు మరియు లైంగిక సుఖవ్యాధుల గురించిన సమాచారం కొరకు మీ జీవశాస్త్ర ఉపాధ్యాయుడిని ఎలాంటి ప్రశ్నలు అడుగుతావు? (AS-2)
జ:- మానవులకు సంక్రమించే అవకాశం ఉన్న లైంగిక వ్యాధులు లేదా సుఖవ్యాధులు ఏవి?
- ఎయిడ్స్ వ్యాధి కారణమైన క్రిమి ఏది?
- ఎయిడ్స్ వ్యాధి జంతువులకు ఎందుకు రాదు?
- ఎయిడ్స్ వ్యాధి ఎవరికి (ఆడ,మగ వారిలో) వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది?
- ఎయిడ్స్ వ్యాధిని నిర్థారించే పరీక్షలు ఏవి?
- ఎయిడ్స్ లక్షణాలు కనిపించని దశను ఏమంటారు?
- ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులు ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
- ఎయిడ్స్‌కు సరైన మందు ఎందుకు కనుగొనబడలేదు?
- పుష్పంలో ఫలధీకరణం విధానం తెలిపే చక్కని పటం గీచి, అందలి భాగాలను గుర్తించుము.? (AS-5)
జ:
- మానవ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ పటం గీసి, భాగాలను గుర్తించుము. (AS-5)
జ:
- ‘బాల్య వివాహం ఒక సాంఘీక దురాచారం’ అని తెలపడానికి కొన్ని నినాదాలు వ్రాయండి. (AS-7)
జ:- బాల్య వివాహం కారాదు బాలికలకు శాపం.
- తల్లిదండ్రులారా బాలికల విద్యపై శ్రద్ధ చూపండి-బాల్య వివాహాలపై కాదు.
- తల్లిదండ్రులు మేల్కొనండి-బాలికల బంగారు భవితను కాపాడండి.
- వరకట్నాల పేరుతో చిన్న వయసులోనే బాలికల భవితకు సంకెళ్లు వేయకండి.
- పెళ్ళికెందుకు తొందర - చదువుకో ముందర
- ముందు చదువు - మధ్య కెరీర్ - తర్వాత పెళ్ళి
- ఆపదలో ఉన్న బాలికల్లారా 1098 (టోల్‌ఫ్రీ)కి కాల్ చేయండి. రక్షణ పొందండి.
- స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థపై ప్రభావం చూపే హార్మోనులు వాటి విధులు తెల్పండి. (AS-1)
జ: స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థపై ప్రభావం చూపే హార్మోనులు 3 రకాలు.- ఈస్ట్రోజన్: బాలికలు 12-13 సంవత్సరాల మధ్య మొదటి సారి లైంగిక పరిపక్వత పొందిన నుండి అండం విడుదలకు ఈస్ట్రోజన్ హార్మోన్ అవసరం.
- ప్రొజెస్టిరాన్: అండం ఫలధీకరణ చెందిన తర్వాత ఏర్పడిన సంయుక్తబీజం గర్భాశయ గోడలలో పిండ ప్రతిస్థాపన జరుగుటకు ప్రొజెస్టిరాన్ హార్మోన్ స్రావం అవసరం.
- ఆక్సీటోసిన్: గర్భం దాల్చిన స్త్రీ ప్రసవ సమయంలో పురిటినొప్పులు కలుగుటకు, క్షీరస్రావము(పాల ఉత్పత్తి)ను ప్రేరేపించుటకు ఆక్సీటోసిన్ అవసరం.
-ఇవన్నీ కూడా పీయూషగ్రంధి నుండి ఉత్పత్తి అయ్యే హార్మోనులు.
2 మార్కుల ప్రశ్న జవాబులు
- బాహ్యఫలధీకరణం(బహిర్గత)అంటే ఏమిటి? ఉదాహరణ ఇవ్వుము. (AS - 1)
జ:- పురుష, స్త్రీ సంయోగ బీజాల కలయిక జీవి శరీరం. దానిని బాహ్య లేదా బహిర్గత ఫలధీకరణం అంటారు.
- ఈ ప్రక్రియలో పురుషజీవి తన శుక్రకణాలను స్త్రీజీవి అండాల చుట్టు ఉన్న నీటి మాధ్యమంలోకి విడుదల చేస్తాయి.
- సాధారణంగా బాహ్యఫలధీకరణం అనేది జలచర జీవులైన చేపలు, కప్పల యందు జరుగును.
- లైంగిక ప్రత్యుత్పత్తి యొక్క లాభాలు ఏవి? (AS - 1)
జ:- లైంగిక ప్రత్యుత్పత్తి వలన కొత్తజీవులు ఉద్భవిస్తాయి.
- తల్లిదండ్రుల ఉమ్మడి లక్షణాలు తరువాత తరానికి వస్తాయి.
- లైంగిక విధానం కొత్త జాతుల ఆవిర్భావాన్ని ప్రోత్సహిస్తుంది.
- పరిసరాలలో సర్దుబాటు చేసుకునే సామర్థ్యం గల జీవులు ఏర్పడతాయి.
- ఇది ప్రకృతి వరణానికి, జీవ వైవిధ్యానికి సహకరిస్తుంది.
- గర్భాశయంలో ఉమ్మినీటి కోశం (amniotic sac) యొక్క విధి ఏమిటి? (AS - 1)
జ: పిండాన్ని చుట్టూరా బయటి వైపు పరాయువు, దాని క్రింద ఉల్బం పొర ఉంటుంది. ఉల్బం లోపలి కుహరంలో ఉల్బక ద్రవం ఉంటుంది. ఇది పిండాన్ని ఆవరించి ఉంటుంది. ఉల్బద్రవం పిండానికి తేమను అందిస్తూ, చిన్న చిన్న యాంత్రిక అఘాతాల నుండి రక్షణ కల్పిస్తుంది.
- ఫలధీకరణం అనగా నేమి? అందలి రకాలు తెలపండి. (AS - 1)
జ: స్త్రీ, పురుష సంయోగ బీజకణాల కలయికను ఫలధీకరణం అంటారు.
ఇది 2 రకాలు.
1. బాహ్యఫలధీకరణం: శుక్రకణాలు, అండాల కలయిక జీవి శరీరం జరిగితే దానిని ‘‘బాహ్యఫలధీకరణం’’ అంటారు. ఉదా’’ చేప, కప్ప
2. అంతర ఫలధీకరణం: శుక్రకణాలు, అండాల కలయిక జీవి శరీరం లోపల జరిగితే దానిని ‘‘ అంతర ఫలదీకరణం’’ అంటారు. ఉదా: పక్షులు, క్షీరదాలు.
- అనిషేక ఫలాలు/విత్తనరహిత ఫలాలు ఎలా ఏర్పడతాయి? (AS - 1)
జ: కొన్ని మొక్కలలో అండాలు ఫలధీకరణం చెందకుండా అండాశయం ఫలంగా మారుతుంది. ఇలాంటి ఫలాలలో విత్తనాలు ఉండవు. వీటిని అనిషేక ఫలాలు లేదా విత్తనరహిత ఫలాలు అంటారు. ఇటీవల మానవుడు కృత్రిమంగా జిబ్బరెలిన్ పైటోహార్మోన్‌లను చల్లి అనిషేక ఫలాలు పొందుతున్నాడు. ఉదా: అరటి, ద్రాక్ష, ఆపిల్....
- అలైంగిక ప్రత్యుత్పత్తి అనగా నేమి? ఒక్కో విధానానికి ఒక ఉదాహరణ సూచించండి. (AS - 1)
జ: సంయోగ బీజాలు కలయిక లేకుండా కేవలం ఒక జీవిలోనే జరిగే ప్రత్యుత్పత్తిని అలైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. కొన్ని నిమ్నస్థాయి జీవులలో అలైంగిక విధానాలుంటాయి.
అలైంగిక ప్రత్యుత్పత్తి
ఉదాహరణ
1. ద్విధా విచ్చిత్తి
2. కోరకీభవనం
3. ముక్కలవటం
4. పునరుత్పత్తి
5. అనిషేక జననం
6. శాఖీయ ప్రత్యుత్పత్తిఅమీబా, పారమీషియం, బ్యాక్టీరియా
ఈస్టు
స్పైరోగైరా
ప్లనేరియా
తేనెటీగలు, చీమలు
రణపాల, గులాబీ
- ఈ మధ్యకాలంలో డాక్టర్లు లింగనిర్ధారణ పరీక్షలు జరపడం లేదు. అందుకు కారణాలు ఏమిటో వ్రాయండి.(AS - 2)
జ:- అల్ట్రాసౌండ్ స్కానింగ్ అందుబాటులోకి రావడంతో దేశంలో భ్రూణహత్యలు పెరిగాయి.
- దీని ద్వారా చేసే లింగ నిర్దారణ ఆడ శిశువు అని తేలగానే అబార్షన్లు చేయడం జరుగుతుంది.
- దీని వల్ల స్త్రీ, పురుష నిష్పత్తిలో వ్యత్యాసాలు ఏర్పడుతాయి.
- అనేక సాంఘీక సమస్యలు తలెత్తే అవకాశం లేకపోలేదు.
- అందువలన లింగనిర్ధారణ పరీక్షలను నేరంగా భావించి ప్రభుత్వం నిషేదించింది.
- ఒక వేళ లింగ నిర్ధారణ పరీక్షలు జరిగినట్లు తేలితే, డాక్టర్లు, ఆసుపత్రులపై తగిన శిక్షలు విధిస్తున్నారు.
- భారత ప్రభుత్వం వివాహ వయస్సు మగపిల్లలకు 21 సంవత్సరాలు, ఆడపిల్లలకు 18 సంవత్సరాలుగా చట్టబద్ధం చేసింది. వయస్సుకు, వివాహానికి సంబంధం ఏమిటి? (AS - 2)
జ: సాధారణంగా బాలికలు 13-15 సంవత్సరాలలో రజస్వల అయినప్పటికీ గర్భం ధరించడానకి కావాల్సిన శారీరక ధృడత్వం, బీజకోశాల పరిమితి ఉండదు. అలాగే పుట్టబోయే పిల్లలను పెంచి పోషించే మానసిక సామర్థ్యం ఉండదు. అందువల్ల భారత ప్రభుత్వం వివాహానికి తగిన వయస్సు పురుషులకు 21, స్త్రీలకు 18 సంవత్సరాలు గా నిర్ణయించింది.
- HIV/AIDS ఏఏ మార్గాల ద్వారా వ్యాపిస్తుంది? (AS - 1)
జ: HIV సంక్రమణ 4 మార్గాల ద్వారా జరుగుతుంది. వీటిని సంక్షిప్తంగా 'SBIM' గా గుర్తించవచ్చు- అరక్షిత లైంగిక సంబంధాల ద్వారా
- పరీక్షించని రక్త మార్పిడి ద్వారా
- కలుషితమైన ఇంజక్షన్లు, సిరంజి, నీడిల్స్ ద్వారా.
- HIV సోకిన తల్లి నుండి శిశువుకు
- లైంగిక వ్యాధులు వ్యాపించకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటావో నీ అభిప్రాయం తెల్పుము. (AS - 6)
జ:- సామాజిక క్రమశిక్షణ, నైతిక విలువలు పాటించడం
- చర్మ వ్యాధులు, సుఖవ్యాధులు రాకుండా ఆరోగ్య సూత్రాలు పాటించడం
- జననాంగాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం
- అక్రమ లైంగిక సంబంధాల జోలికి పోకుండా ఉండటం.
- సురక్షితమైన శృంగారం భాగస్వామితో పాల్గొనటం.
- ప్రధమ స్తన్యం/ముర్రుపాలు అనగా నేమి? దాని ప్రాధాన్యత ఏమిటి? (AS - 1)
జ: గర్భావ ధి చివరి దశలో శోషరసం పోలిన ద్రవం స్తనగ్రంధులలో నిల్వ చేయబడుతుంది. దీనినే ముర్రుపాలు లేదా ప్రధమస్తన్యం అంటారు. శిశుజననం తర్వాత కొన్ని రోజుల వరకు స్తనగ్రంధుల నుండి ముర్రుపాలు వస్తాయి. నవజాత శిశువులలో వ్యాధినిరోధకత పెంచడానికి తప్పక త్రాగించాలి.
- సరితకు రెండో కాన్పులో కూడా ఆడపిల్లే పుట్టిందని అత్తింటివారు బాధపడ్డారు. ఆడపిల్ల పుట్టడానికి ఆమె కారణం కాదని నీవువారికి ఎలా చెప్పి ఒప్పిస్తావు? (AS-6)
జ: రెండో కాన్పులో ఆడపిల్ల పుట్టడం ఆమె (సరిత) కారణం ఎంత మాత్రం కాదు. ఎందుకంటే లైంగిక ప్రత్యుత్పత్తిలో సంయోగబీజాల కలయిక జరిగినపుడు ఫలధీకరణం చెంది సంయుక్త బీజం (Zygote) ఏర్పడుతుంది. ఫలధీకరణ సమయంలో క్రోమోజోముల కలయిక వేగంగా జరిగే ప్రక్రియ. పురుష లైంగిక క్రోమోజోమ్ (XY) లోని X క్రోమోజోమ్, స్త్రీ లైంగిక క్రోమోజోమ్ (XX) లోని ఒక X కోమోజోమ్‌తో జత కలుస్తుంది. ఫలితంగా పుట్టబోయే బిడ్డ XX క్రోమోజోమ్ జత కలిగి ఉండడం వలన ఆడపిల్ల పుట్టింది అని నిర్ధారిస్తాము. అందువల్ల రెండో కాన్పులోనూ సైతం ఆడపిల్ల పుట్టడం ఆమె కారణం కాదని జన్యుశాస్త్ర పరంగా వివరించగలను.
- శాఖీయోత్పత్తిలో సహజ విధానాలు తెల్పండి? (AS-2)
జ: సహజ శాఖీయోత్పత్తిలో రకాలు 4 రకాలుగా ఉన్నాయి.- పత్రాలు: రణపాల వంటి మొక్కలలో ఆకుల అంచుల వెంబడి చిన్న చిన్న కోరకాలు పెరుగుతాయి.
- కాండాలు: కొన్ని బలహీన వాయుగత కాండాలు నేలను తాకినట్లయితే అక్కడ పీచువేర్లు అభివద్ధి చెందుతాయి.ఉదా: స్టోలన్లు-వాలిస్‌నేరియా, లశునాలు-ఉల్లి, కొమ్ములు-పసుపు.
- కన్నుల ద్వారా: బంగాళదుంపలలో ఏర్పడే నొక్కులు. వీటి ద్వారా కొత్త మొక్కలు ఏర్పడాతాయి.
- డాలియా, ముల్లంగి, క్యారట్ మొదలైన వాటిపై పెరిగే చిన్న చిన్న మొగ్గలు, పత్రాలు కలిగిన కాండభాగాలుగా పెరుగుతాయి.
1 మార్కు ప్రశ్న జవాబులు
- ప్రత్యుత్పత్తి అనగా నేమి? అది ఎన్ని రకాలు?
జ: ఒక జీవి తన జీవిత కాలంలో తనను పోలిన జీవులను ఉత్పత్తి చేసే జీవక్రియను ప్రత్యుత్పత్తి అంటారు. జీవుల్లో ప్రత్యుత్పత్తి 2 రకాలుగా ఉంటుంది.
1. లైంగిక
2. అలైంగిక ప్రత్యుత్పత్తి
- పత్రకోరకాలు అనగా నేమి?
జ: మొక్కల ఆకులలోని అంచుభాగాల నుండి అభివృద్ధి చెందే కోరకములను ‘పత్ర కోరకములు’ అంటారు. ఇవి మొక్కలలో శాఖీయ వ్యాప్తికి ఉపయోగపడతాయి.
ఉదా: రణపాల (Bryophyllum)
- అంటుకట్టడంలో స్టాక్, సయాన్‌ల పాత్ర ఏమిటి?
జ: అంటుకట్టే విధానంలో నేలలో పెరుగుతున్న మొక్కను ‘స్టాక్’ అని, మరో మొక్క నుండి వేరు చేయబడిన వేర్లు లేని భాగాన్ని సయాన్ అని అంటారు. వాంఛిత లక్షణాలు సయాన్ నుండి స్టాక్‌లోకి బదిలి అవుతాయి.
- కణజాల వర్థనం అనగా నేమి? దాని ప్రయోజనం తెలపండి.
జ: పోషక పదార్థాలు కలిగిన కృత్రిమ యానకంలో మొక్క కణాలను వర్థనం చేసి కొత్త మొక్కలను ఉత్పత్తి చేసే విధానమును కణజాల వర్థనం అంటారు. తక్కువ స్థలంలో, తక్కువ సమయంలో వేల సంఖ్యలో మొక్కలను పెంచవచ్చును.
- టోటి పొటెన్సీ అనగా నేమి?
జ: వాంఛిత లక్షణము కలిగిన మొక్కలోని ఒక కణము పూర్తి మొక్కను ఇవ్వగల శక్తిని ‘టోటిపొటెన్సీ’ అంటారు.
- జరాయువు అంటే ఏమిటి? దీని ఉపయోగం తెలపండి.
జ: భ్రూణము, తల్లి కణజాలాలు కలిసి ఏర్పడిన వలయాకార నిర్మాణమే జరాయువు. ఇది గర్భధారణ తర్వాత 12వ వారంలో ఏర్పడుతుంది. జరాయువు ఎదుగుతున్న పిండానికి పోషక పదార్థాలను అందిస్తుంది.
- కొన్ని లైంగిక వ్యాధులు పేర్కొనండి (AS-1)
జ: గనేరియా, సిఫిలిస్, ఎయిడ్స్ మొదలైనవి లైంగిక వ్యాధులు.
- కొన్ని గర్భ నిరోధక పద్ధతులు తెల్పండి.
జ: భౌతిక నిరోధకాలు: కండోమ్‌లు, డయాఫ్రమ్‌లు, కాఫర్-టి, టాప్
రసాయనిక నిరోధకాలు: స్పెర్మిసైడ్స్, మాలా-డి, వెజైనల్ టాబ్లెట్స్.
శస్త్ర ఉపకరణాలు: వే సక్టమీ, ట్యూబెక్టమీ (శాశ్వత గర్భనిరోధ పద్ధతులు)
- AIDS ను విస్తరించుము.
జ: Acquired Immuno Defficiency Syndrome
- AIDS కారణమైన జీవి ఏది? అది ఎక్కడ జీవిస్తుంది?
జ: ఎయిడ్స్‌కు కారణమైన క్రిమి పేరు HIV. ఇది వైరస్. ఇది మానవుని రక్తంలో మాత్రమే ఉంటుంది.
- ‘అనిషేక జననం’ అనగా నేమి?
జ: ఫలధీకరణం జరగక పోయినా అండం అభివృద్ధి చెంది పిల్ల జీవులుగా ఏర్పడే ప్రక్రియను - అనిషేక జననం అంటారు.
ఉదా: తేనెటీగలు, చీమలు
- జన్యు పదార్థం DNA అనగా నేమి? దీని నిర్మాణం తెల్పండి.
జ: DNA అనగా డీ ఆక్సీరైబో న్యూక్లిక్ ఆసిడ్. ఇది క్రోమోజోములలో ఉండే జన్యు పదార్థం. DNA నిర్మాణం ద్వికుండలి నిర్మాణం
- పిండాన్ని ఆవరించి ఉండే పొరలు ఏవి?
జ: పిండాన్ని ఆవరిస్తూ పరాయువు, ఉల్బం, ఎల్లంటాయిస్ అనే పొరలు ఉంటాయి.
- తల్లి నుండి ఎదుగుతున్న పిండానికి మధ్య పదార్థాల రవాణా ఎలా జరుగుతుంది?
జ: తల్లి నుండి పిండానికి పోషక పదార్థాల రవాణా నాభిరజ్జువు (బొడ్డుతాడు) ద్వారా జరుగుతుంది.
- అంకురచ్చదం ఎలా ఏర్పడుతుంది?
జ: ఒక పురుషబీజం కణం పిండకోశం మధ్యలో ఉన్న ద్వితీయ కేంద్రకంతో కలిసి అంకురచ్చదాన్ని (Endosperm) ఏర్పరుస్తుంది. అంకురచ్చద విత్తనాలకు
ఉదా: వరి, మొక్కజొన్న, ఆముదం.
1/2 మార్కు ప్రశ్న జవాబులు
- మానవ జీవిత చక్రంలోని దశలను సూచించు సరియైన వరుసక్రమం ( )
ఎ. శిశుదశ- బాల్యదశ-కౌమారదశ - వయోదశ
బి. బాల్యదశ-శిశుదశ- కౌమారదశ - వయోదశ
సి. శిశుదశ- కౌమారదశ -బాల్యదశ- వయోదశ
డి. ఇవేవీకావు.
- శుక్రకణంలోని ఎక్రోసోమ్ ఉపయోగం ( )
ఎ. చలనం
బి. జీర్ణక్రియ
సి. ఫలధీకరణం
డి. విసర్జన
- క్షయకరణ విభనలో ఏర్పడే పిల్లకణాల సంఖ్య ( )
ఎ.2
బి.3
సి.4
డి.6
- క్రింది వానిలో గర్భస్థ శిశువు పెరుగుదలపై ప్రభావం చూపే కారకాలు ( )
ఎ. సిగరేట్ పొగలోని రసాయనాలు
బి. ఆల్కహాల్
సి. మందులు
డి.పైవన్నీ
- తల్లి యొక్క గర్భాశయ కుడ్యానికి, భ్రూణం ను కలిపే నిర్మాణం ( )
ఎ. జరాయువు
బి.నాభిరజ్జువు
సి.ఎపిడిడిమిస్.
డి. పాలోఫియన్‌నాళం
- ఫలధీకరణం తర్వాత కూడా ఉపయోగపడే పుష్పభాగాలు ( )
ఎ. అండం
బి.కేసరావళి
సి.కీలం, కీలాగ్రం
డి.రక్షక, ఆకర్షక పత్రావళి
- రెండు కణవిభజనల మధ్య ఉండే సమయాన్ని ఏమంటారు? ( )
ఎ. అంతరదశ
బి. మధ్యదశ
సి. ప్రధమ దశ
డి. విభజన దశ
- అంకురచ్చద కేంద్రకం యొక్క స్థితికత ( )
ఎ. n
బి. 2n
సి. 3n
డి. 4n
- ఈ క్రింది వానిలో అంకురచ్చద రహిత విత్తనము ( )
ఎ. వరి
బి. మొక్కజొన్న
సి. శనగ
డి. ఆముదం
- సంయుగ్మం ద్వారా ప్రత్యుత్పత్తిని జరుపు జీవి ( )
ఎ. అమీబా
బి.యూగ్లీనా
సి.బాక్టీరియా
డి.పార మీషియం
- స్త్రీలలో ప్రతినెలకు విడుదలయ్యే అండముల సంఖ్య ( )
ఎ. 1
బి. 2
సి. 4
డి. 3
- డాక్టర్ పోటు నరసింహారావు ప్రముఖ....శాస్త్రవేత్త ( )
ఎ. పర్యావరణ వేత్త
బి. కణశాస్త్రవేత్త
సి. రసాయన శాస్త్రవేత్త
డి. భౌతిక శాస్త్ర వేత్త
- మానవునిలోగల క్రోమొజోముల సంఖ్య.........
- అనువంశికతకు కారణమైన జన్యుపదార్థం........
- లింగ నిర్ధారణపై ప్రభావం చూపే క్రోమొజోమ్.....
- DNA నిర్మాణం (ద్వికుండలి) కనుగొన్న శాస్త్రవేత్త....
- నిషేధించబడని లింగనిర్ధారణ పరీక్ష పేరు...
- ఒక సమ విభజన పూర్తి కావడానికి పట్టే సమయం....
- కణసంలీన ప్రక్రియల ద్వారా కణ చక్రంలోని వివిధ దశలను కనుగొన్న వారు...
- సిద్ధ బీజాలను గూర్చి చదివే శాస్త్రం....
- అత్యధిక గర్భావధి కాలం గల జంతువు...
- అతి తక్కువ గర్భావధి కాలం గల జంతువు....
- STD సంక్షిప్తం ......
- వరల్డ్ ఎయిడ్స్ ను............ రోజున నిర్వహిస్తారు.
- HIV వైరస్.... కణాలను నశింపజేస్తుంది.
- ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులలో దేశంలోనే మొదటి రాష్ట్రం ....
- HIV నిర్ధారణ పరీక్ష పేరు...
- ASHA ను విస్తరించగా....
- DN వ్యాధి గ్రస్తుల చికిత్సా విభాగం...
- NACO సంక్షిప్త రూపం.....
గ్రూప్-ఎ |
| గ్రూప్-బి |
31. స్త్రీల కుటుంబ నియంత్రణ పద్ధతి | ( ) | ఎ. ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ |
32. బాల్య వివాహ అదుపు చట్టము | ( ) | బి. 1978 |
33. భ్రూణ హత్యలు | ( ) | సి. ట్యుబెక్టమీ |
34. నిషేధింపబడిన లింగనిర్ధారణపరీక్ష | ( ) | డి. సాంఘీక దురాచారం |
35. ఎయిడ్స్ నినాదం | ( ) | ఇ. 1964 |
| ఎఫ్. చికిత్స కంటే నివారణ మేలు |
గ్రూప్-ఎ | | గ్రూప్-బి |
36. కోరకీభవనం | ( ) | ఎ. యూగ్లీనా |
37. ముక్కలగుట | ( ) | బి. ఈస్టు |
38. పత్రకోరకాలు | ( ) | సి.చదును పురుగులు |
39. చేధనం | ( ) | డి. ప్లనేరియా |
40. పునరుత్పత్తి | ( ) | ఇ. రణపాల |
| ఎఫ్. గులాబి, గన్నేరు |
జవాబులు:1)ఎ; 2)సి; 3)సి ; 4)డి ; 5)బి ; 6)ఎ; 7)ఎ; 8)బి; 9)సి; 10)డి; 11)ఎ; 12)బి; 13)23 జతలు ; 14) DNA ; 15)Y ;16) వాట్సన్ అండ్ క్రిక్ ;17) అల్ట్రాసౌండ్ స్కానింగ్ ;18)40-60 నిముషాలు; 19) పోటు నరసింహారావు, జాన్సన్ ; 20) పేలినాలజీ ; 21)ఏనుగు ;22)ఎలుక ; 23)Sexually Transmitted Diseases; 24) డిసెంబర్ 1 ;25)లింఫోసైట్స్ ; 26) ఆంధ్రప్రదేశ్ ; 27)ELISA ; 28) Accredited Social Health Activist; 29) Anti ritroviral Therapy ; 30) National Aids Control Organisation ; 31)సి. ; 32)బి ; 33)డి ; 34)ఎ ; 35)ఎఫ్; 36)బి; 37)సి ; 38)ఇ; 39)ఎఫ్ ; 40)డి.