పదవ తరగతి తర్వాత పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలిసెట్–2022) షెడ్యూల్‌ను తేలంగాణ రాష్ట్ర సాంకేతిక, శిక్షణ విద్యా మండలి మార్చి 24న విడుదల చేసింది.
పాలిసెట్ షెడ్యూల్ విడుదల
పాలిసెట్ పరీక్ష రాష్ట్రవ్యాప్తంగా జూన్ 30వ తేదీన నిర్వహిస్తున్నట్టు మం డలి కార్యదర్శి డాక్టర్ సి.శ్రీనాథ్ ప్రకటించారు. పరీక్ష జరిగిన 12 రోజుల్లో ఫలితాలు వెల్లడిస్తామని తెలిపారు. ఏప్రిల్ రెండో వారం నుంచి జూన్ 4వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్ లైన్ లో రిజిస్ట్రే్టషన్ చేసుకోవచ్చని, రూ.100 అపరాధ రుసుముతో ఆ తర్వాత రోజు కూడా అవ కాశం కలి్పంచామని చెప్పారు. పాలిసెట్ ర్యాంక్ ఆధారంగా ఇంజనీరింగ్, అగ్రికల్చర్, హారి్టకల్చర్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు.