Skip to main content

TS Constable Exam Final Results 2023 Date : టీఎస్ కానిస్టేబుల్ ఉద్యోగ తుది ప‌రీక్ష‌ ఫలితాలు అప్పుడే..! అలాగే శిక్షణ కూడా..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న తెలంగాణ కానిస్టేబుల్ తుది ప‌రీక్ష ప‌లితాల విడుద‌ల‌కు దాదాపు లైన్ క్లియ‌ర్ అయింది. తెలంగాణ‌లో భారీ ఎత్తున పోలీసు ఉద్యోగాల నియామ‌క ప్ర‌క్రియ కొన‌సాగుతున్న విష‌యం తెల్సిందే.
Telangana Constable Exam Final Results 2023 News Telugu, TS constable results
Telangana Constable Exam Final Results 2023 News

ఈ ఉద్యోగాల‌ నియామ‌క ప్ర‌క్రియ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. సెప్టెంబర్‌లో కానిస్టేబుల్‌ అభ్యర్థుల తుది ఫలితాలు వెల్లడించే అవకాశం ఉన్నట్టు తెలిసింది.

☛ Constables Success Stories : ఈ ఆరుగురు కానిస్టేబుల్స్‌.. ఎస్‌ఐ ఉద్యోగాలు కొట్టారిలా..

మొత్తం 16,969 కానిస్టేబుల్ పోస్టుల కోసం తుది పరీక్షకు 1,75,657 మంది అర్హత సాధించారు. 16,929 కానిస్టేబుల్‌ అభ్యర్థుల తుది జాబితాను సెప్టెంబర్‌ నాటికి సిద్ధమైతే.. అదే నెల చివరిలో లేదా అక్టోబర్‌ మొదటివారంలో శిక్షణ కార్యక్రమాలు ఉంటాయని తెలిసింది. కొత్తగా నియామకమయ్యే పోలీసు అభ్యర్థులకు రాష్ట్రంలోని 28 శిక్షణా కేంద్రాలు సిద్ధమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కానిస్టేబుళ్ల శిక్షణ రెండు విడతల్లో చేపట్టేందుకు పోలీస్ అధికారులు ఏర్పాట్లు చేశారు.

☛ TS SI Jobs Selected Candidates Success Stories : నిరుపేద కుటుంబం నుంచి వ‌చ్చారు.. ఇలా చ‌దివారు.. అలా ఎస్‌ఐ ఉద్యోగాలు కొట్టారిలా..

కటాఫ్‌ మార్కులు..
ప్రస్తుతం ప్రొవిజనల్‌ ఎంపికకు సంబంధించిన ధ్రువీకరణ పత్రం ప్రక్రియ కూడా వేగవంతం చేయనున్నట్టు తెలిసింది. ఆ వెంటనే క్యారెక్టర్‌ అండ్‌ యాంటిస్పెంట్‌ వెరిఫికేషన్‌(ఎస్బీ), మెడికల్‌ ఫిట్‌నెస్‌ కూడా రెండు మూడు వారాల వ్యవధిలోనే ప్రారంభం కానున్నట్టు తెలుస్తున్నది. ఇవి పూర్తయిన వెంటనే కటాఫ్‌ మార్కులు ప్రకటించి, అర్హులైన అభ్యర్థుల తుది జాబితాను వెల్లడించనున్నట్టు తెలిసింది.

☛ TS SI Jobs Selected Candidates Success Stories : నిరుపేద కుటుంబం నుంచి వ‌చ్చారు.. ఇలా చ‌దివారు.. అలా ఎస్‌ఐ ఉద్యోగాలు కొట్టారిలా..

మొత్తం 28 శిక్షణ కేంద్రాల్లో 14,881 మందికి..

ts police training news 2023

ఇప్పటికే కొందరు అభ్యర్థులు EWS రిజర్వేషన్ పై హైకోర్టుకు వెళ్లారు. అన్నీ సకాలంలో జరిగితే సెప్టెంబర్ మొదటి, లేదా రెండోవారంలో తుది ఫలితాలను విడుదల చేయనున్నట్టు తెలిసింది. ఫలితాలు వెల్లడి కాగానే కానిస్టేబుళ్ల శిక్షణ ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. తొలిదశలో సివిల్, ఏఆర్, డ్రైవర్, టెక్నికల్ తత్సమాన పోస్టుల్లో ఎంపికయ్యే 9,871 మందికి, మలిదశలో 5,010 మంది బెటాలియన్స్ సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు. మొత్తం 28 శిక్షణ కేంద్రాల్లో 14,881 మందికి ట్రైనింగ్ ఇస్తారు.

☛ SI Success Story : ఓ రైతుబిడ్డ.. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో చ‌దివి.. ఎస్‌ఐ ఉద్యోగం కొట్టాడిలా.. కానీ..

ఈసారి ఎంపికైన వారికి శిక్షణ ఇస్తూనే.. మరోవైపు క్యారెక్టర్ అండ్ యాంటిసిడెంట్ గురించి ఎస్బీ వెరిఫికేషన్ చేస్తారని తెలిసింది. శిక్షణకు పిలిచిన తర్వాతనే ఎస్బీ వెరిఫికేషన్ కూడా మొదలుపెట్టే అవ‌కాశం ఉంది.

Published date : 14 Aug 2023 03:33PM

Photo Stories