Skip to main content

TS Police Events 2022 Instructions : ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఈవెంట్స్‌కు ఈ రూల్స్ త‌ప్ప‌నిస‌రిగా పాటించాల్సిందే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : పోలీస్‌ ఉద్యోగాల భర్తీలో భాగంగా నిర్వహించే శారీరక, సామర్థ్య పరీక్షల తేదీలను తెలంగాణ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ ప్రకటించించిన విష‌యం తెల్సిందే.
ts police jobs events
TS Police Events 2022 Instructions

ప్రిలిమ్స్ రాతపరీక్షలో అర్హులైన 2,37,862 మంది అభ్యర్థులకు డిసెంబరు 8 నుంచి జనవరి తొలి వారం వరకూ శారీరక సామర్థ్య పరీక్ష (ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌- పీఈటీ)లు, ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్‌ (పీఎంటీ)లు నిర్వహించనుంది. ఈ మొత్తం ప్రక్రియను 25 రోజులు పాటు జ‌ర‌గ‌నున్న‌ది.

తెలంగాణ పోలీసు ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

ఈవెంట్స్ అడ్మిట్‌ కార్డు డౌన్‌లోడ్ చివ‌రి తేదీ ఇదే..
ఈవెంట్స్‌ నిర్వహణకు గాను రిక్రూట్‌మెంట్‌ బోర్డు ప్ర‌త్యేక ఏర్పాట్ల‌ను చేసింది.  శారీరక సామర్ధ్య పరీక్షలకు సంబంధించి అడ్మిట్‌ కార్డులను అభ్యర్థులు నవంబర్ 29వ తేదీ ఉదయం 8 గంటల నుంచి డిసెంబర్‌ 3, అర్ధరాత్రి వరకు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అభ్యర్థులు వ్యక్తిగత యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను ఉప‌యోగించి www.tslprb.in వెబ్‌సైట్‌ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చును. ఈవెంట్స్ కోసం హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ, వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, నల్గొండ, సంగారెడ్డి, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, సిద్దిపేటలో కేంద్రాలను ఏర్పాటు చేసింది.

Competitive Exams: కోచింగ్‌ తీసుకోకుండా గ్రూప్స్, ఎస్‌ఐ తదితర పరీక్షల్లో విజయం సాధ్యమా..? కాదా..?

అభ్యర్థులు తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాల్సినవి ఇవే..

ts police events certificates

☛ అడ్మిట్‌కార్డును అభ్యర్థులు వెంట తెచ్చుకోవాలని నియామక మండలి సూచించింది. నియామక తుది ప్రక్రియ పూర్తయ్యేవరకు ఈ పత్రాన్ని భద్రపరచుకోవాలని స్పష్టం చేసింది.
☛ డిశ్ఛార్జి బుక్‌/ నిరభ్యంతరపత్రం/ పెన్షన్‌ పేమెంటల్‌ ఆర్డర్‌ కాపీ (మాజీ సైనికోద్యోగులు)
☛ ఏజెన్సీ ఏరియా సర్టిఫికెట్‌ (గిరిజన అభ్యర్థులకు)
☛ కమ్యూనిటీ సర్టిఫికెట్‌ 
☛ పార్ట్‌-2 దరఖాస్తు ప్రింటవుట్‌ కాపీని తీసుకురాల‌న్నారు.

Gandrathi Satish, SI: ఇంటర్, డిగ్రీలో ఫెయిల్..ఈ క‌సితోనే మూడు ప్ర‌భుత్వ ఉద్యోగాలు కొట్టానిలా..

ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రిగా పాటించాల్సిందే..

ts police events 2022

☛ అభ్యర్థులు అడ్మిట్‌కార్డులో పేర్కొన్న సమయానికి ముందే వేదిక వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది.
☛ గైర్హాజరైన వారి అభ్యర్థిత్వం రద్దవుతుందని మండలి స్పష్టం చేసింది. 
☛ మైదానాల్లో సామగ్రి భద్రపరచుకునే క్లాక్‌రూంలు అందుబాటులో ఉండవని, అభ్యర్థులు అనవసర లగేజీని వెంట తెచ్చుకోవద్దని సూచించింది. 
☛ మహిళా అభ్యర్థులు నగలు, హ్యాండ్‌బ్యాగ్‌లు తీసుకురావద్దని ప్రకటించింది. బయోమెట్రిక్‌ తీసుకోనుండటంతో చేతివేళ్లకు మెహిందీ, టాటూలను వేసుకురావద్దని సూచించింది.
☛ మైదానాల్లోకి సెల్‌ఫోన్లను ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించబోమని మండలి స్పష్టం చేసింది.
☛ పోటీల్లో పాల్గొనే అభ్యర్థులపై డిజిటల్‌ నిఘా ఉండనుంది. మైదానంలోకి అడుగుపెట్టిన వెంటనే అభ్యర్థి చేతికి డిజిటల్‌ ఆర్‌ఎఫ్‌ఐడీ పరిజ్ఞానంతో కూడిన రిస్ట్‌బ్యాండ్‌ను అటాచ్‌ చేస్తారు. మైదానం నుంచి బయటికి వెళ్లేవరకు దాన్ని అలాగే ఉంచుకోవాలి. దాన్ని చింపేయాలని చూసినా.. ట్యాంపర్‌ చేయాలని ప్రయత్నించినా డిస్‌క్వాలిఫై చేస్తారు.
☛ ఇందులో అర్హత సాధించినవారి ఎత్తు కొలుస్తారు. ఈ పరీక్షలో ఒక సెంటీమీటర్‌ లేదా అంతకంటే తక్కువ ఎత్తుతో అనర్హులైతే పునఃపరిశీలనకు దరఖాస్తు చేయొచ్చు. ఇందుకోసం చీఫ్‌ సూపరింటెండెంట్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. అలాంటివారికి అదేరోజు చీఫ్‌ సూపరింటెండెంట్‌ నేతృత్వంలోని కమిటీ ఆధ్వర్యంలో తిరిగి ఎత్తు కొలిచి నిర్ణయం ప్రకటిస్తారు.
☛ ఎత్తులో అర్హత సాధించిన వారినే లాంగ్‌జంప్‌, షాట్‌పుట్‌ పోటీల్లో పాల్గొనేందుకు అనుమతిస్తారు.

అభ్యర్థులు పై విష‌యాల్లో సమస్యలుంటే 93937 11110 లేదా 93910 05006 నంబరులో సంప్రదించవచ్చని మండలి స్పష్టం చేసింది. support@tslprb.in ఈ-మెయిల్‌కూ ఫిర్యాదులు పంపవచ్చు.

TS Police Events 2022 : ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఈవెంట్స్‌ తేదీలు ఇవే.. ఇవి పాటిస్తే విజ‌యం మీదే..

Published date : 30 Nov 2022 01:39PM

Photo Stories