Female Reservation in Government Jobs : మహిళా రిజర్వేషన్ల ఎఫెక్ట్.. 2,125 కానిస్టేబుల్స్, 153 మంది ఎస్ఐలకు..
తెలంగాణ స్టేట్ లెవెల్ రిక్రూట్‌మెంట్ బోరక్డు (టీఎస్ఎల్‌పీఆర్బీ) విడుదల చేసిన ఎస్ఐ తుది ఫలితాల్లో 153 మంది మహిళలు ఉద్యోగాలు సాధించారు. కొత్తగా విధుల్లోకి చేరబోతున్న వీరికి రాష్ట్ర పోలీస్ అకాడమీలో శిక్షణ ఇవ్వనున్నారు.
కానిస్టేబుల్ ఉద్యోగాల్లోనూ..
ఇక కానిస్టేబుల్ నోటిఫికేషన్‌లో కూడా మహిళలకు రిజర్వేషన్ అమలు చేస్తున్నారు. దీంతో 2,125 మంది మహిళా కానిస్టేబుల్స్ విధుల్లోకి చేరనున్నారు. కేవలం సివిల్ పోలీసులే కాకుండా ఏఆర్, తత్సమానమైన పోస్టుల్లో 10 శాతం రిజర్వేషన్ అమలు అవుతోంది. తెలంగాణ పోలీస్ శాఖలోకి కొత్తగా రాబోతున్న ఎస్ఐలకు రాజధాని హైదరాబాద్‌లోని అకాడమీలో శిక్షణ ఇవ్వనున్నారు.
కానిస్టేబుల్స్‌కు రాష్ట్రంలోని మూడు కేంద్రాల్లో శిక్షణ ఇస్తారు. వరంగల్‌లో 1000 మందికి, హైదరాబాద్ పోలీస్ అకాడమీలో 683 మందికి, మేడ్చల్‌లో 442 ఏఆర్ కానిస్టేబుల్స్‌కు శిక్షణ ఇవ్వనున్నట్లు పోలీస్ ట్రైనింగ్ విభాగం ఐజీ తరుణ్ జోషి తెలిపారు. మహిళా కానిస్టేబుల్స్‌కు సెప్టెంబర్ చివరి వారం లేదా అక్టోబర్ మొదటి వారం నుంచి శిక్షణ ప్రారంభం కానున్నది. మహిళల శిక్షణ సమయంలో సేఫ్టీ, సెక్యూరిటీ విషయంలో ఎలాంటి రాజీ పడబోమని ఐజీ తరుణ్ జోషి చెప్పారు. వారికి శిక్షణ ఇచ్చే మూడు కేంద్రాల్లో కూడా అన్ని రకాల వసతులు కల్పించారు. రాత్రి వేళల్లో భద్రత కోసం అదనంగా సిబ్బందిని నియమించనున్నారు. పురుషులకు ఇచ్చిన ఇండోర్, అవుడ్ డోర్ శిక్షణ.. మహిళలకు కూడా ఉంటుంది. ఆ తర్వాత వారికి ఆయా ప్రాంతాల్లో పోస్టింగ్స్ ఇస్తారు.
☛ TS SI Selected Candidates Stories : ఒక్కో దశ దాటుతూ.. ఎస్ఐ ఉద్యోగం సాధించామిలా.. నేడు..