Skip to main content

AP SI Final Exams Dates and Timings 2023 : ఏపీ ఎస్సై ఫైన‌ల్ రాత పరీక్ష తేదీలు ఇవే.. ఈ పరీక్ష కేంద్రాలలోనే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎస్‌ఐ ఉద్యోగాల‌ ఫైనల్‌ రాత పరీక్షల తేదీల‌ను పోలీస్ నియామక మండలి ఖరారు చేసింది. ఈ మేరకు ప‌రీక్ష‌ల షెడ్యూల్‌ను ఆగ‌స్టు 30వ తేదీన (బుధ‌వారం) విడుదల చేశారు.
AP Police Final Exam Dates 2023 Details in Telugu
AP Police Final Exam Dates and Timings 2023

ఈ ప‌రీక్ష‌లు అక్టోబర్ 14, 15 తేదీల్లో ఈ ఎస్సై తుది రాత పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక ఈ పరీక్షల కోసం రాష్ట్రంలోని విశాఖ, ఏలూరు, గుంటూరు, కర్నూల్‌లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. పీఎంటీ, పీఈటీ ఫలితాలు ప్రకటన అనంతరం తుది రాత పరీక్ష హాల్‌ టికెట్లు అందుబాటులో ఉంచుతామని తెలిపారు.

చదవండి:  ఈ టిప్స్ పాటిస్తే..ఈవెంట్స్ కొట్ట‌డం ఈజీనే..

రాష్ట్రంలో మొత్తం 411 పోస్టుల భర్తీకి ఈ ఏడాది ఫిబ్రవరి 19న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 1,51,288 మంది అభ్యర్థులు హాజరవ్వగా, 57,923 మంది అర్హత సాధించారు. ఈ పరీక్షలో 57,923 మంది అర్హత సాధించారు. వీరిలో 56,130 మంది అభ్యర్థులు స్టేజ్‌-2 ఆన్‌లైన్‌ అప్లికేషన్లు సమర్పించడంతో వారికి విశాఖ, ఏలూరు, గుంటూరు, కర్నూలు కేంద్రాల్లో ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహించ‌నున్నారు.

మొత్తం నాలుగు పేపర్లు.. ప‌రీక్ష‌ల సమ‌యం ఇలా..

ap police jobs

ఎస్సై ఉద్యోగాల తుది రాత పరీక్షలో మొత్తం నాలుగు పేపర్లు ఉంటాయి. రెండు పేపర్లను డిస్క్రిప్టివ్‌ విధానంలో, మరో రెండు పేపర్లను ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహిస్తారు. అక్టోబర్‌ 14వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పేపర్‌ 1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్‌-2 పరీక్ష నిర్వహించనున్నారు.

Inspiring Story: నేను ఎస్‌ఐ అయ్యానిలా.. అమ్మ కూలి పనులు చేస్తూ..

ఈ రెండు పేపర్లు డిస్క్రిప్టివ్‌ విధానంలో నిర్వహిస్తారు. అక్టోబర్‌ 15వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పేపర్‌-3, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్‌-4 పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పేపర్లు ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటాయి.

గత ఏడాది నవంబర్ 28వ తేదీన విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం డిసెంబర్ 14వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఫిబ్రవరి 19న ప్రాథమిక పరీక్ష నిర్వహించారు. ఎస్సై పోస్టులు మహిళలు, పురుషులకు(సివిల్) 315 ఉద్యోగాలు ఉండగా.. రిజర్వ్ సబ్ ఇన్సెపెక్టర్ ఆఫ్ పోలీస్ పురుషులకు (APSP) 96 పోస్టులు ఉన్నాయి.

➤☛ ఆంధ్ర‌ప్ర‌దేశ్ 'ఎస్ఐ' ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

ఎస్‌ఐ ఉద్యోగాలకు సంబంధించి 'స్టేజ్-2' ఆన్‌లైన్‌ అప్లికేషన్ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తును డౌన్‌లోడ్‌ చేసుకుని ఫిట్‌నెస్‌ పరీక్షలకు హాజరైన సమయంలో అధికారులకు సమర్పించాలి. పదోతరగతి సర్టిఫికెట్‌, విద్యార్హత, కమ్యూనిటీ, స్థానికత, ఇతర అర్హత ధృవీకరణ పత్రాలు తప్పనిసరి. తాజాగా ఎస్సై ఫైనల్ రాత పరీక్షలు తేదీలు ప్రకటించారు అధికారులు.

Gandrathi Satish, SI: ఇంటర్, డిగ్రీలో ఫెయిల్..ఈ క‌సితోనే మూడు ప్ర‌భుత్వ ఉద్యోగాలు కొట్టానిలా..

Published date : 30 Aug 2023 08:07PM

Photo Stories