AP High Court : ఏపీ పోలీస్ కానిస్టేబుల్ రాత పరీక్షలో ఆ 8 ప్రశ్నల పూర్తి వివరాలను..
ఈ వ్యవహారంలో పూర్తి వివరాలను తమ ముందుంచాలని పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్, హోంశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 7వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
అంతకుముందు పిటిషనర్ల తరఫు న్యాయవాది పీవీజీ ఉమేష్ చంద్ర వాదనలు వినిపిస్తూ... ప్రిలిమ్స్‌లో 8 ప్రశ్నలకు సరైన జవాబులను ఇవ్వనందున దీనిని నిపుణుల కమిటీకి పంపాల్సిన అవసరం ఉందన్నారు.
మార్చి 13వ తేదీ నుంచి దేహదారుఢ్య పరీక్షలు జరగనున్నాయని, వాటికి పిటిషనర్లను అనుమతించేలా అధికారులను ఆదేశించాలని అభ్యర్థించారు. వాదనలు విన్న న్యాయమూర్తి పూర్తి వివరాలను తమ ముందుంచాలని రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్, హోంశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశిస్తూ విచారణను మార్చి 7వ తేదీకి వాయిదా వేశారు.
☛ AP Constable Events 2023 : ఈ టిప్స్ పాటిస్తే.. కానిస్టేబుల్ ఈవెంట్స్ కొట్టడం ఈజీనే..
☛ Inspiring Story: నేను ఎస్‌ఐ అయ్యానిలా.. అమ్మ కూలి పనులు చేస్తూ..
☛ Gandrathi Satish, SI: ఇంటర్, డిగ్రీలో ఫెయిల్..ఈ కసితోనే మూడు ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టానిలా..