Students with SI Goals: వివిధ చదువులతో ఒకే లక్ష్యానికి చేరిన యువతీయువకులు
Sakshi Education
ఒక లక్ష్యాన్ని ఎంచుకున్న తరువాత కొందరు దారిలో దక్కి ఉద్యోగాలను పొంది ముందుకు సాగుతారు. లక్ష్య ప్రయాణాన్ని కొనసాగిస్తారు. మరి కొందరు అనుకున్న లక్ష్యానికి చేరే వరకు ఎటువంటి ఉద్యోగాలనైన వదులుకుంటారు. ఈ పట్లుదలతోనే కొందరు ఎస్ఐలుగా పరీల్లో విజయం పొంది ఎంపికయ్యారు.
SI Achievers from villages
తల్లాడ మండలం నుంచి ఇద్దరు ఎస్సై ఉద్యోగాలకు ఎంపికయ్యారు. మండలంలోని ముద్దునూరుకు చెందిన నిరుపేద వ్యవసాయ కుటుంబంలో జన్మించిన బడుగుల అంజమ్మ 225 మార్కులతో ఎస్సైగా ఎంపికైంది.
అలాగే, మిట్టపల్లిలో మధ్య తరగతి కుటుంబానికి పువ్వాళ్ల నరేష్ కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చినా వెళ్లకుండా పట్టుదలతో చదివి ఎస్సైగా ఎంపికయ్యారు.
బీటెక్ పూర్తిచేసిన ఆయన పోలీస్ శాఖకు ఎంపిక కావాలనే లక్ష్యంతో హైదరాబాద్‌లో శిక్షణ తీసుకుని తన కల సాకారం చేసుకున్నాడు. ఇక అంజమ్మ గతంలో రైల్వే రిక్రూట్‌మెంట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినా సాంకేతిక కారణాలతో వెళ్లలేదు. అయినా కుంగిపోకుండా క్రమశిక్షణగా చదివి ఎస్సై ఉద్యోగానికి ఎంపికై తల్లిదండ్రల కలను సాకారం చేసింది. ఈ సందర్భంగా నరేష్, అంజమ్మను మండల ప్రజలు, ప్రజాప్రతినిధులు అభినందించారు.