Success Story: టెట్ పరీక్ష రాసింది.. కాని..?
మండల కేంద్రానికి చెందిన హోంగార్డు మద్ది వివేకానంద రెడ్డి కుమార్తె సుజిత ఎస్సైగా ఎంపికయ్యారు. సుచిత తాడ్వాయి ఉన్నత పాఠశాలలో 10 తరగతి వరకు తెలుగు మీడియంలో చదివారు. అనంతరం కామారెడ్డిలోని శ్రీ ఆర్యభట్ట కళాశాలలో ఇంటర్ పూర్తి చేశారు. అనంతరం ఎస్‌జీటీ టెట్‌లో క్వాలిఫై అయిన తర్వాత టీచరు పరీక్ష రాసినా ఉద్యోగం రాలేదు.
➤ Dream Successful: చిన్నప్పటి కలను సాకారం చేసుకున్న యువకుడు
ఆ తర్వాత కామారెడ్డిలోని అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ కోర్సు పూర్తి చేశారు. సుజిత భర్త సుమన్‌తో కలిసి హైదరాబాద్‌లో ఉంటూ అక్కడే ఓ కోచింగ్ సెంటర్‌లో సంవత్సరం పాటు ఎస్సై కోచింగ్ తీసుకున్నారు. నాలుగేళ్ల కూతురు ఉన్న సుచిత కష్టపడి చదివి ఎస్సై పరీక్ష రాసి ఉద్యోగం సాధించింది.
➤ SI Success Story: ఉద్యోగం చేస్తూ ఎస్ఐగా కొలును సాధించాడు
ప్రస్తుతం సుచిత తండ్రి వివేకానందరెడ్డి కామారెడ్డి ఎస్పీ కార్యాలయంలో హోంగార్డుగా పనిచేస్తున్నారు. సుచిత ఎస్సైగా విజయం సాధించడంతో ఆమె తల్లిదండ్రులు శారద, వివేకానందరెడ్డి, భర్త సుమన్, సోదరుడు సంతోష్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.