TS SI Preliminary Exam Key : ఎస్సై ప్రిలిమినరీ పరీక్ష కొశ్చన్ పేపర్ & ‘కీ’ సాక్షి ఎడ్యుకేషన్.కామ్‌లో..
ఎస్సై ప్రిలిమినరీ పరీక్ష ముగిసిన తర్వాత.. ఈ పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రం, ‘కీ’ ని సాక్షి ఎడ్యుకేషన్.కామ్(www.sakshieducation.com) ఇవ్వనున్నది. ఈ ‘కీ’ ని ప్రముఖ సబ్జెక్ట్ నిపుణులతో ప్రిపేర్ చేయించనున్నది.
ఎస్సై ప్రిలిమినరీ పరీక్ష కొశ్చన్ పేపర్ & ‘కీ’ కోసం క్లిక్ చేయండి
TS SI Preliminary Exam Question Paper With Key (Click Here)
ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాల్సిందే..
☛ ఒక్క నిమిషం ఆలస్యమైన అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోనికి అనుమతించబడరు.
☛ ఉదయం 9 గంటల నుంచి అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. సరిగ్గా 10 గంటలకు గేట్లు మూసేస్తారు.
☛ అభ్యర్థులు తమ వెంట పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్‌ను తప్పనిసరిగా తీసుకురావాలి. డౌన్‌లోడ్ చేసుకున్న హాల్‌టికెట్‌ను ప్రింట్ తీసుకోవాలని ఫొటోతో పాటు సెంటర్ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలని పేర్కొన్నారు. ప్రింట్ తీసుకున్న హాల్‌టికెట్ మొదటి పేజీలో ఎడమ భాగంలో అభ్యర్థులు తమ పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోను అతికించాలని, అలా అతికించిన హాల్‌టికెట్‌తో వచ్చిన వారినే పరీక్ష కేంద్రానికి అనుమతిస్తామని స్పష్టంచేశారు.
☛ సెల్‌ఫోన్లు, బ్యాగులు, స్మార్ట్ వాచీలు, కాలిక్యులేటర్లు సహా ఎలాంటి ఎల్రక్టానిక్ పరికరాలను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. ప్రతి అభ్యర్థి కచ్చితంగా మాస్క్ ధరించాలి.
☛ అభ్యర్థుల హాజరు బయోమెట్రిక్ విధానంలో తీసుకుంటారు. ఈ నేపథ్యంలోనే పరీక్ష రాసేవాళ్లు మెహిందీ, టాటూలకు దూరంగా ఉండాలి.
☛ పరీక్ష 200 అబ్జెక్టివ్ ప్రశ్నలకు 200 మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానంకి 0.20 మార్క్ కట్ అవుతుంది. అంటే నెగిటివ్ మార్కులు ఉంటాయి.
☛ OMR Sheet లో whitener pen ను ఉపయోగించ రాదు.
☛ పరీక్ష ముగిసిన తర్వాత OMR Sheet తీసుకుని అందరిని ఒకేసారి బయటికి పంపిస్తారు.
☛ కోవిడ్ నిబంధనలు పాటించగలరు.
☛ పరీక్ష నిబంధనలు ఏమాత్రం ఉల్లంఘించినా అభ్యర్థి పరీక్ష చెల్లదని హెచ్చరించారు. పరీక్ష పత్రం ఇంగ్లిష్–తెలుగు, ఇంగ్లిష్–ఉర్దూ భాషల్లో అందుబాటులో ఉంటుంది.
TS Police Exams: రాతపరీక్షలో నెగిటివ్ మార్కులు ఉన్నాయ్.. జాగ్రత్తగా రాయండిలా..
TS Police Recruitment: ప్రిలిమ్స్ పరీక్ష విధానం.. విజయం సాధించడానికి మార్గాలు..