TS SI Preliminary Exam Instructions : ఎస్సై ప్రిలిమినరీ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఈ నిబంధనలు పాటించాల్సిందే..
ఇప్పటికే ఈ పరీక్షకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. సంబంధించిన హాల్‌టికెట్లులను అభ్యర్థులు జూలై 30వ తేదీ (శనివారం) నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటించిన విషయం తెల్సిందే. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని 35 పట్టణ ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 554 సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు 2,47,630 దరఖాస్తులు వచ్చాయి.
ప్రతి పరీక్ష కేంద్రం వద్ద అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలకు పంపడం, నిర్దేశిత ప్రాంతాల నుంచి పరీక్ష పత్రాలకు పరీక్ష కేంద్రాలకు చేర్చడం, పూర్తయిన తర్వాత జవాబుపత్రాలను జేఎన్‌టీయూ స్ట్రాంగ్ రూమ్ సిబ్బందికి అప్పగించడం.. వంటి ప్రతి అంశానికీ ప్రాధాన్యం ఇస్తూ బందోబస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై సంయుక్త కమిషనర్ ఎం.రమేష్ శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నగర కొత్వాల్ సీవీ ఆనంద్ చేస్తున్న కీలక సూచనలివి..
ఎస్సై ప్రిలిమినరీ రాతపరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాల్సిందే..
☛ ఒక్క నిమిషం ఆలస్యమైన అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోనికి అనుమతించబడరు.
☛ ఉదయం 9 గంటల నుంచి అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. సరిగ్గా 10 గంటలకు గేట్లు మూసేస్తారు.
☛ అభ్యర్థులు తమ వెంట పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్‌ను తప్పనిసరిగా తీసుకురావాలి. డౌన్‌లోడ్ చేసుకున్న హాల్‌టికెట్‌ను ప్రింట్ తీసుకోవాలని ఫొటోతో పాటు సెంటర్ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలని పేర్కొన్నారు. ప్రింట్ తీసుకున్న హాల్‌టికెట్ మొదటి పేజీలో ఎడమ భాగంలో అభ్యర్థులు తమ పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోను అతికించాలని, అలా అతికించిన హాల్‌టికెట్‌తో వచ్చిన వారినే పరీక్ష కేంద్రానికి అనుమతిస్తామని స్పష్టంచేశారు.
☛ సెల్‌ఫోన్లు, బ్యాగులు, స్మార్ట్ వాచీలు, కాలిక్యులేటర్లు సహా ఎలాంటి ఎల్రక్టానిక్ పరికరాలను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. ప్రతి అభ్యర్థి కచ్చితంగా మాస్క్ ధరించాలి.
☛ అభ్యర్థుల హాజరు బయోమెట్రిక్ విధానంలో తీసుకుంటారు. ఈ నేపథ్యంలోనే పరీక్ష రాసేవాళ్లు మెహిందీ, టాటూలకు దూరంగా ఉండాలి.
☛ పరీక్ష 200 అబ్జెక్టివ్ ప్రశ్నలకు 200 మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానంకి 0.20 మార్క్ కట్ అవుతుంది. అంటే నెగిటివ్ మార్కులు ఉంటాయి.
☛ OMR Sheet లో whitener pen ను ఉపయోగించ రాదు.
☛ పరీక్ష ముగిసిన తర్వాత OMR Sheet తీసుకుని అందరిని ఒకేసారి బయటికి పంపిస్తారు.
☛ కోవిడ్ నిబంధనలు పాటించగలరు.
☛ పరీక్ష నిబంధనలు ఏమాత్రం ఉల్లంఘించినా అభ్యర్థి పరీక్ష చెల్లదని హెచ్చరించారు. పరీక్ష పత్రం ఇంగ్లిష్–తెలుగు, ఇంగ్లిష్–ఉర్దూ భాషల్లో అందుబాటులో ఉంటుంది.
చదవండి: TS Police Recruitment: ప్రిలిమ్స్ పరీక్ష విధానం.. విజయం సాధించడానికి మార్గాలు..
TS Police Exams: రాతపరీక్షలో నెగిటివ్ మార్కులు ఉన్నాయ్.. జాగ్రత్తగా రాయండిలా..
ఎస్‌ఐ ప్రిలిమినరీ రాత పరీక్ష విధానం :
- సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్ట్‌లకు నిర్వహించే ప్రిలిమినరీ రాత పరీక్షను రెండు విభాగాల్లో 200 మార్కులకు నిర్వహిస్తారు.
- అర్థమెటిక్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్/మెంటల్ ఎబిలిటీ అంశాల నుంచి 100ప్రశ్నలు అడుగుతారు.
- జనరల్ స్టడీస్ నుంచి మరో 100 ప్రశ్నలు అడుగుతారు.
- మొత్తం మూడు గంటల వ్యవధిలో పెన్–పేపర్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు.
- రెండు పోస్ట్‌లకు సంబంధించి కనీసం 30 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. అదే విధంగా 20 శాతం నెగెటివ్ మార్కుల నిబంధన విధించారు.
- ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు పొందిన మార్కులు,దరఖాస్తుల సంఖ్య ఆధారంగా తదుపరి దశ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్‌కు ఎంపిక చేస్తారు.
- ఇంటర్మీడియెట్ అర్హతగా నిర్వహించే కానిస్టేబుల్ ప్రిలిమ్స్, అదే విధంగా బ్యాచిలర్ డిగ్రీ అర్హతగా జరిపే సబ్ ఇన్‌స్పెక్టర్ ప్రిలిమ్స్ పరీక్షల్లో ప్రశ్నల క్లిష్టత ఆయా పోస్ట్‌ల స్థాయికి అనుగుణంగా ఉంటుంది.
- నెగెటివ్ మార్కింగ్ విధానంలో ప్రతి అయిదు తప్పు సమాధానాలకు ఒక మార్కు కోత విధిస్తారు.
TS Police Jobs: పోలీసు రాత పరీక్షలో.. ఏవైనా కష్టమైన ప్రశ్నలు వస్తే..