Skip to main content

TS Police Exams 2023 : ఎస్సై, కానిస్టేబుల్ ఫైన‌ల్‌ రాత పరీక్షల కొత్త‌ తేదీలు ఇవే.. ఈ మార్పులు ఎందుకంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ‌లో ఎస్సై, కానిస్టేబుళ్ల స్థాయి తుది రాత పరీక్షల తేదీల్లో మార్పులు చేశారు. ఈ మేర‌కు తెలంగాణలో రాష్ట్రస్థాయి పోలీస్‌ నియామక మండలి జ‌న‌వ‌రి 13వ తేదీన (శుక్ర‌వారం) ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.
TS Police Mains Exams
TS SI and Constable Main Exams New Dates 2023

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌కు సంబంధించిన ప‌రీక్ష‌లు ఉన్న నేప‌థ్యంలో.. టీఎస్‌పీఎస్సీ చేసిన‌ విజ్ఞప్తి మేరకు ఈ తేదీల్లో మార్పులు చేశారు. ఏప్రిల్ 23వ తేదీన జరగాల్సిన కానిస్టేబుల్ రాత పరీక్షను 30వ తేదీకి మార్చారు. అలాగే కానిస్టేబుల్ (ఐటీ విభాగం) పరీక్ష ఏప్రిల్ 23వ తేదీ నుంచి 30వ తేదీకి, ఎస్సై(ఐటీ) పరీక్ష మార్చి 12వ తేదీ నుంచి 11వ తేదీకి, ఏఎస్సై( ఫింగర్ ప్రింట్స్) పరీక్ష మార్చి 12వ తేదీ నుంచి 11వ తేదీకి మార్పు చేశారు.

☛ Gandrathi Satish, SI: ఇంటర్, డిగ్రీలో ఫెయిల్..ఈ క‌సితోనే మూడు ప్ర‌భుత్వ ఉద్యోగాలు కొట్టానిలా..

పోలీస్‌ ఉద్యోగాల భర్తీలో భాగంగా నిర్వహించే శారీరక, సామర్థ్య పరీక్షలు కూడా ఇటీవ‌లే పూరైన విష‌యం తెల్సిందే. ఈవెంట్స్‌ నిర్వహణకు గాను మొత్తంగా 11 కేంద్రాల్లో 25 రోజులు పాటు నిర్వ‌హించారు.

☛ తెలంగాణ పోలీసు ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

టీఎస్ ఎస్సై, కానిస్టేబుల్ ఫైన‌ల్‌ రాత పరీక్షల తేదీల్లో మార్పులు ఇవే..

Published date : 13 Jan 2023 04:02PM
PDF

Photo Stories