TS Constable: పరీక్షకు 91.34% హాజరు.. కొశ్చన్ పేపర్, ‘కీ’ కోసం క్లిక్ చేయండి
Sakshi Education
పోలీస్ శాఖలోని 15644 సివిల్ కానిస్టేబుల్, అబ్కారీ శాఖలోని 614 పోస్టులు, రవాణా శాఖలోని 63 పోస్టులకు Telangana Police Recruitment Board ఆగస్టు 28న నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్టు బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో వెల్లడించారు.
హైదరాబాద్‌తో పాటు 38 ప్రధాన పట్టణాల్లోని 1601 పరీక్ష కేంద్రాల్లో 6,03,955 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరైనట్టు ఆయన తెలిపారు. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న 6,6,1198 మంది అభ్యర్థుల్లో 91.34 శాతం మంది పరీక్ష రాసినట్టు శ్రీనివాసరావు తెలిపారు. అభ్యర్థుల హాజరును బయోమెట్రిక్ పద్ధతిలో వేలిముద్రలు సహా ఫొటోలు కూడా నమోదు చేసినట్టు వెల్లడించారు. ప్రశ్నపత్రం కీ పేపర్‌ను త్వరలోనే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని, ఆ తేదీని కొద్దిరోజుల్లో ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు. ఓఎంఆర్ షీట్‌పై అభ్యర్థులు ప్రశ్నపత్రం బుక్‌లెట్ కోడ్‌ను తప్పనిసరిగా సరైన విధానంలో వేయాలని, బుక్‌లెట్ కోడ్‌ను రాయకపోయినా, సరైన పద్ధతిలో నమోదు చేయకపోయినా మూల్యాంకనం చేయబోమని స్పష్టం చేశారు.
✔ టీఎస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష 2022 కొశ్చన్ పేపర్ & ‘కీ’ (Held on 28.08.2022)
చదవండి:
Published date : 29 Aug 2022 03:09PM