TSLPRB: పోలీస్ తుది ఫలితాల విడుదల
అన్ని పోస్టులకు కలిపి తుది రాత పరీక్షకు హాజరైన వారిలో 84.06 శాతం మంది అర్హత సాధించారు. అభ్యర్థులు తమ ఓఎంఆర్ షీట్లను మే 30 నుంచి వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. ఈ మేరకు బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు మే 30న ఓ ప్రకటన విడుదల చేశారు. అభ్యర్థులు ఠీఠీఠీ.్టట pటb.జీn వెబ్‌సైట్‌లో లాగిన్ ఐడీ ద్వారా తమ ఓఎంఆర్ షీట్లతోపాటు ఫైనల్ కీలు సైతం చూసుకోవచ్చని ఆయన తెలిపారు. ఏవైనా ఇబ్బందులుంటే 9393711110, 9391005006 నంబర్లలో లేదా www.tslprb.in ఈ మెయిల్ ఐడీలో సంప్రదించాలని సూచించారు.
☛ TS Constable Final Written Exam Results 2023
3 వరకు రీవెరిఫికేషన్ గడువు
తుది ఓఎంఆర్ షీట్లలో ఏవైనా అనుమానాలున్నా, మార్కుల లెక్కింపులో అనుమానాలున్నా అభ్యర్థులు రీకౌంటింగ్, లేదా రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకునేందుకు జూన్ 1 నుంచి 3వ తేదీ రాత్రి 8 గంటల వరకు అవకాశం ఉంటుంది.
ఎడిటింగ్‌కు అవకాశం
తుది రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల్లో ఎవరైన వివరాల నమోదులో పొరపాట్లు చేసి ఉంటే, వారికి ఎడిట్ ఆప్షన్ ఇవ్వనున్నట్టు శ్రీనివాసరావు చెప్పారు. ఇప్పటికే బోర్డును అభ్యర్థించిన వారికి కులం, వయసు, లోకల్ క్యాండిడేచర్, ఎక్స్–సర్వీస్‌మెన్ స్టేటస్, అకడమిక్ విద్యార్హతల్లో తప్పులను సరిచేసుకునేందుకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో అవకాశం కల్పిస్తామన్నారు.
వివిధ విభాగాల్లో పోస్టుల వారీగా తుది రాత పరీక్ష ఫలితాలు
పోస్టు |
హాజరైనవారు |
అర్హులు |
అర్హుల శాతం |
సివిల్ పీసీ, ట్రాన్స్‌పోర్ట్, ఎక్సైజ్ కానిస్టేబుల్ |
1,08,055 |
98,218 |
90.90 |
సివిల్ ఎస్సై |
57,848 |
43,708 |
75.56 |
కమ్యూనికేషన్ కానిస్టేబుల్ |
6,098 |
4,564 |
74.84 |
కమ్యూనికేషన్ ఎస్సై |
3,115 |
729 |
23.40 |
పీసీ డ్రైవర్ |
1,987 |
1,779 |
89.53 |
ఫింగర్ ఫ్రింట్ బ్యూరో ఏఎస్సై |
1,487 |
1,153 |
77.54 |
పీటీఓ ఎస్సై |
579 |
463 |
79.97 |
పీసీ మెకానిక్ |
290 |
238 |
82.07 |
మొత్తం |
1,79,459 |
1,50,852 |
84.06 |