Police Department: ఎస్సై, ఏఎస్సై అభ్యర్థులకు వైద్య పరీక్షలు
కరీంనగర్‌క్రైం: పోలీసుశాఖలోని వివిధ విభా గాల్లో (సివిల్, ఆర్మ్‌డ్ రిజర్వు, ఎస్పీఫ్, స్టేషన్ ఫైర్ ఆఫీసర్, డిప్యూటీ జైలర్) ఎస్సై / ఏఎస్‌ఐ(ఫింగర్ ప్రింట్ బ్యూరో, కమ్యూనికేషన్) నియామకాలకు అర్హత సాధించిన జోన్ అభ్యర్థులకు ఆగస్టు 26 నుంచి 28వరకు వైద్య ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని రాజన్న సిరిసిల్ల జోన్ డిప్యూటీ ఇన్స్‌పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఈఐఏ) కె.రమేశ్ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు.
చదవండి: Police Postings: నిబంధనలకు లోబడే పోలీస్ పోస్టింగ్‌లు
వరంగల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ వైద్య పరీక్షలు ఉంటాయని తెలిపారు. జోన్ నుంచి ఎంపికై న 45మంది అభ్యర్థులు వైద్యపరీక్షల నిమిత్తం ఆగస్టు 25న సాయంత్రం ఐదుగంటలకు కరీంనగర్ కమిషనరేట్ కేంద్రంలోని సీఏఆర్ ఏసీపీ/ఆర్‌ఐ అడ్మిన్ ఎదుట హాజరుకావాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
చదవండి: Constable to SI Success Story : కానిస్టేబుల్ టూ.. ఎస్ఐ..