వరంగల్ క్రైం: కేంద్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు లోబడే వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో పోస్టింగ్‌లు జరిగాయని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు.
నిబంధనలకు లోబడే పోలీస్ పోస్టింగ్‌లు
ఈ మేరకు ఆగస్టు 15న ఒక ప్రకటన విడుదల చేశారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లోని 21 మంది పోలీస్ అధికారులకు నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు జరిగాయని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు అందినట్లు ప్రచారం జరుగుతుందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్నికల కమిషన్ జూన్ 2 నాటికి అధికారుల బదిలీలకు గడువు ఇచ్చిందని, దానికి కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగానే బదిలీలు జరిగాయని వివరించారు. ఫిర్యాదులు వచ్చిన 21 మంది అధికారుల పోస్టింగ్‌లు సైతం నిబంధనలకు లోబడే చేసినట్లు తెలిపారు.