అండర్ టేకింగ్ ఇచ్చేందుకు తుది గడువు తేదీ ఇదే..
అయితే అలాంటి అభ్యర్థులు తుదిరాత పరీక్షలో అర్హత సాధిస్తే.. తుది రాత పరీక్ష ఫలితాలు వెల్లడైన నెల రోజుల్లోపు దేహదారుఢ్య పరీక్షలను పూర్తి చేస్తామని రాతపూర్వకంగా అండర్ టేకింగ్ ఇవ్వాల్సి ఉంటుందని శ్రీనివాసరావు వెల్లడించారు. అండర్ టేకింగ్ ఇచ్చేందుకు తుది గడువు జనవరి 31 వరకు ఉంటుందని జనవరి 20న ఒక ప్రకటనలో తెలిపారు. గర్భిణులు, ఇటీవలే డెలివరీ అయిన అభ్యర్థులకు ఒకసారి మినహాయింపుగా అవకాశం ఇవ్వాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ అవకాశం కల్పించినట్లు ఆయన స్పష్టంచేశారు.
చదవండి: TS పోలీస్ - గైడెన్స్ | స్టడీ మెటీరియల్ | సక్సెస్ స్టోరీస్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రివియస్ పేపర్స్ | మోడల్ పేపర్స్ | ఆన్ లైన్ టెస్ట్స్ | వీడియోస్
ఇప్పటికే ప్రాథమిక పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, పార్ట్–2 దరఖాస్తును పూర్తి చేసిన అభ్యర్థులకే ఈ మినహాయింపు వర్తిస్తుందని పేర్కొన్నారు. రాతపూర్వక అండర్ టేకింగ్‌ను టీఎస్‌ఎల్‌పీఆర్బీ వెబ్‌సైట్‌లో సూచించిన ఫార్మాట్‌లో పంపాలని, మెడికల్ సర్టిఫికెట్లను జత చేయాలని సూచించారు. వీటిని జనవరి 31లోపు లక్డీకాపూల్ లోని డీజీపీ కార్యాలయం ఇన్‌వార్డ్ సెక్షన్‌లో అందజేయాలని శ్రీనివాసరావు చెప్పారు. ఇప్పటికే వినతిపత్రాలు ఇచ్చిన అభ్యర్థులు కూడా మరోసారి అండర్‌టేకింగ్ ఇవ్వాలన్నారు. జనవరి 31లోపు రాతపూర్వకంగా అండర్‌టేకింగ్ ఇవ్వని అభ్యర్థులను తుది రాత పరీక్షకు అనుమతించబోరని స్పష్టంచేశారు.