Police Constable Aspirants: జీఓ నెం.46ను రద్దు చేయాలని డిమాండ్.. జీఓ 46 ఏమిటి?
ఈ సందర్భంగా వారు పోలీసు స్టేషన్ ఆవరణలోనే ఆందోళన చేపట్టారు. అనంతరం కానిస్టేబుల్ అభ్యర్థులు విలేకరులతో మాట్లాడుతూ..జీఓ నెం.46ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. సాయంత్రం సొంత పూచీకత్తుపై కానిస్టేబుల్ అభ్యర్థులను పోలీసులు విడుదల చేశారు.
చదవండి: High Court: డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే ఫలితాలు వెల్లడించండి
రాష్ట్రస్థాయిలో నియమించే తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల్లో జీఓ నం.46 ప్రకారం ఉమ్మడి హైదరాబాద్ జిల్లాకు 53% రిజర్వేషన్లు కల్పించి మిగతా జిల్లాలకు 47% కేటాయిస్తున్నారన్నారు. దీని వల్ల జిల్లాల్లోని అభ్యర్థులకు 130 మార్కులు వచ్చినా ఉద్యోగం రాని పరిస్థితి ఉందని, హైదరాబాద్ జిల్లాలో 80 మార్కులకే జాబ్ వచ్చే అవకాశం ఉందన్నారు. నోటిఫికేషన్ లో ఎక్కడా జిల్లాల ప్రస్తావన లేదని, సెలక్షన్ సమయంలో ఈ జీవోను తెరపైకి తెచ్చారన్నారు.