TSLPRB: ఎస్సై పోస్టుల్లో కేటగిరీల వారీగా క్వాలిఫై అయిన అభ్యర్థులు ఇలా..
సివిల్ ఎస్సై ప్రిలిమినరీ పరీక్షలో 46.80 శాతం, సివిల్ కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్షలో 31.40 శాతం, రవాణా కానిస్టేబుల్ పరీక్షలో 44.84 శాతం, ఎక్సైజ్ కానిస్టేబుల్ పరీక్షలో 43.65 శాతం మంది ఉత్తీర్ణులైనట్లు తెలిపింది. పోలీస్ సివిల్ విభాగంలో 15,644, ఆబ్కారీశాఖలో 614, రవాణా శాఖలో 63 కానిస్టేబుల్ పోస్టుల కోసం ఆగస్టు 28న ప్రాథమిక పరీక్షను టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ నిర్వహించింది. 554 ఎస్సై పోస్టులకుగాను 2,25,668 మంది రాత పరీక్ష రాయగా, 1,05,603 (46.80 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. ఇక 15,644 సివిల్ కానిస్టేబుల్ పోస్టులకు 5,88,891 మంది రాత పరీక్ష రాయగా 1,84,861 (31.39 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. ట్రాన్స్‌పోర్టు కానిస్టేబుల్ 63 పోస్టులకు 41,835 మంది రాత పరీక్ష రాయగా, 18,758(44.84 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖలోని 614 పోస్టులకుగాను 2,50,890 మంది రాత పరీక్ష రాయగా, 1,09,518 (43.65 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (పీఎంటీ), ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్ (పీఈటీ)లలో 5,07,840 మంది అర్హత సాధించారు.
తగ్గిన కటాఫ్ మార్కులతో..:
పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నిర్వహించిన ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల రాతపరీక్షల కటాఫ్ మార్కులను ప్రభుత్వం సవరించింది. 200 మార్కులకుగాను 60 మార్కులు ఓసీలకు, 50 బీసీలకు, ఎస్సీ, ఎస్టీలకు 40 మార్కులు ఉంటాయని పేర్కొంది. గతంలో ఓసీలకు 80, బీసీలకు 70, ఎస్సీ, ఎస్టీలకు 60 మార్కులు ఉండగా దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పలువురు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సి.వి.భాస్కర్‌రెడ్డిల ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషన్ విచారణలో ఉండగానే ప్రభుత్వం కటాఫ్‌ను సవరించడంతో ధర్మాసనం పిటిషన్‌పై విచారణను ముగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
చదవండి: EWS: విద్యార్థులకూ కటాఫ్ తగ్గించాలి
కానిస్టేబుల్ అభ్యర్థులు కేటగిరీలవారీగా..
కానిస్టేబుల్ పరీక్షకు 6,03,851 మంది హాజరవగా అర్హత సాధించిన వారు 1,90,589 మంది. అంటే 31.56% మంది కానిస్టేబుల్ పరీక్షల్లో క్వాలిఫై అయ్యారు. వారిలో పురుషులు 4,61,045 మంది పరీక్షరాయగా, 1,50,099 మంది, మహిళలు 1,42, 806 మంది పరీక్ష రాస్తే 40,490 మంది (32.56%) అర్హత సాధించారు. అర్హత సాధించిన వారిలో కేటగిరీలవారీగా చూస్తే బీసీలు 86,708 మంది, ఎస్సీలు 51,912, ఎస్టీలు 40,873, ఓపెన్ కేటగిరిలో 10,777 మంది ఎక్స్ సరీ్వస్‌మెన్ విభాగంలో 319 మంది ఉన్నారు. కాగా, పీఎంటీ, పీఈటీలలో అర్హత సాధించిన వారు పార్ట్–2 దరఖాస్తులను, డాక్యు మెంట్లను అక్టోబర్ 27 నుంచి నవంబర్ 10లోగా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందని టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ చైర్మన్ శ్రీనివాసరావు పేర్కొన్నారు.
చదవండి: TS Police Jobs: ఇవి పాటిస్తూ.. చదివితే కచ్చితంగా పోలీసు ఉద్యోగం మీదే..
ఎస్సై పోస్టుల్లో కేటగిరీలవారీగా క్వాలిఫై అయిన అభ్యర్థులు...
కేటగిరీ |
హాజరైన అభ్యర్థులు |
అర్హత సాధించింది |
శాతం |
బీసీ |
1,18,453 |
49,825 |
46.80 |
ఎస్సీ |
48,055 |
26,168 |
42.06 |
ఎస్టీ |
38,180 |
22,571 |
54.45 |
ఓపెన్ కేటగిరీ |
20,528 |
6,817 |
33.21 |
ఎక్స్ సరీ్వస్‌మెన్ |
452 |
222 |
49.12 |
మహిళలు |
52.975 |
19,609 |
37.02 |
పురుషులు |
1.72,693 |
85,994 |
49.80 |