ఉష్ణం
1. ఏ ఉష్ణోగ్రత వద్ద నీటికి గరిష్ట సాంద్రత ఉంటుంది?
ఎ) –4°C
బి) 4°C
సి) 60°C
డి) 100°C
- View Answer
- సమాధానం: బి
2. నీటి అసంగత వ్యాకోచ ధర్మాన్ని ఏ పదార్థ స్వభావంతో పోల్చవచ్చు?
ఎ) రబ్బర్
బి) ప్లాస్టిక్
సి) టైప్‌మెటల్
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
3. క్రిమి కీటకాల ఉష్ణోగ్రత కొలవడానికి ఉపయోగించే ఉష్ణోగ్రతా మాపకం?
ఎ) సిక్స్-గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతా మాపకం
బి) పైరోమీటర్
సి) సీబెక్ ఉష్ణవిద్యుత్ ఉష్ణోగ్రతా మాపకం
డి) అయస్కాంత ఉష్ణోగ్రతా మాపకం
- View Answer
- సమాధానం: సి
4. ఉష్ణశక్తి యాంత్రికశక్తిగా ఎందులో మారుతుంది?
ఎ) వాహనం
బి) ఫ్యాన్
సి) ఇస్త్రీపెట్టె
డి) విద్యుత్ హీటర్
- View Answer
- సమాధానం: ఎ
5. 80°C వద్ద ఉన్న వేడి టీ 70°Cకు చల్లారడానికి అయిదు నిమిషాల సమయం అవసరం. తిరిగి 70°C నుంచి 60°Cకు చల్లారడానికి కావాల్సిన సమయం?
ఎ) అయిదు నిమిషాలు
బి) అయిదు నిమిషాల కంటే ఎక్కువ
సి) అయిదు నిమిషాల కంటే తక్కువ
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: బి
6. ఒక ఇంధనం నుంచి వెలువడే ఉష్ణరాశిని దేనితో కొలుస్తారు?
ఎ) ఉష్ణోగ్రతా మాపకం
బి) సాధారణ కెలోరీమీటర్
సి) బోలోమీటర్
డి) బాంబు కెలోరీమీటర్
- View Answer
- సమాధానం: డి
7. రాగి పాత్రలో వేడి ద్రవాన్ని నింపి ఇనుపబల్లపై ఉంచితే అది ఏ పద్ధతి వల్ల చల్లారుతుంది?
ఎ) ఉష్ణవహనం
బి) ఉష్ణ సంవహనం
సి) ఉష్ణ వికిరణం
డి) ఎ, బి
- View Answer
- సమాధానం: డి
8. ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించేందుకు ఉపయోగించే థర్మోస్టాట్‌ను దేనితో తయారుచేస్తారు?
ఎ) ఇనుము, ఇత్తడి
బి) ఇనుము, రాగి
సి) రాగి, ఉక్కు
డి) ఇత్తడి, రాగి
- View Answer
- సమాధానం: ఎ
9. థర్మాస్ప్లాస్క్లోని వేడిద్రవం ఏ పద్ధతి వల్ల ఉష్ణాన్ని నష్టపోదు?
ఎ) ఉష్ణవహనం
బి) ఉష్ణ సంవహనం
సి) ఉష్ణ వికిరణం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: ఎ
10. ఉష్ణోగ్రత మాపకం కనిష్ట రీడింగ్ ఎల్లప్పుడూ దేనికి సమానం?
ఎ) మంచు ఉష్ణోగ్రత
బి) పాదరస ఉష్ణోగ్రత
సి) ఆల్కహాల్ ఉష్ణోగ్రత
డి) నీటి ఆవిరి ఉష్ణక్షగ్రత
- View Answer
- సమాధానం: ఎ
11. ఇనుప పాత్రలో అల్యూమినియం పాత్ర ఉంచారు. వీటిని వేరు చేయాలంటే?
ఎ) ఆ రెండు పాత్రలు వేడి చేయాలి
బి) ఆ రెండు పాత్రలూ చల్లని నీటిలో ముంచాలి
సి) ఆ రెండు పాత్రలను సుత్తితో కొట్టాలి
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: బి
12. నీటి అసంగత వ్యాకోచం తగ్గించేందుకు దానిలో ఏ ద్రవం కలపాలి?
ఎ) ఇథైల్ గ్లైకాల్
బి) బెంజీన్
సి) పెట్రోలు
డి) కిరోసిన్
- View Answer
- సమాధానం: ఎ
13. విద్యుత్ ఇస్త్రీపెట్టెను కనుగొన్నవారు?
ఎ) ప్రివోస్ట్
బి) కూలుంబ్
సి) హెన్రీషెలె
డి) విలియం గిల్బర్డ్
- View Answer
- సమాధానం: సి
14. పగటి సమయంలో చంద్రుడి సగటు ఉష్ణోగ్రత ఎంత?
ఎ) 25°C
బి) 50°C
సి) 75°C
డి) 100°C
- View Answer
- సమాధానం: డి