అయస్కాంతత్వం - 2
1. భూ అయస్కాంత క్షేత్రంలో అత్యధిక ఒడుదొడుకులను ఏ నెలలో పరిశీలించవచ్చు?
ఎ) జూన్
బి) జూలై
సి) ఆగస్టు
డి) సెప్టెంబర్
- View Answer
- సమాధానం: ఎ
2. కింది వాటిలో భూ అయస్కాంతత్వానికి సంబంధించి సరికాని వ్యాఖ్య?
ఎ) అయస్కాంత ఉత్తర ధ్రువం భౌగోళిక దక్షిణాన్ని సూచిస్తుంది
బి) దక్షిణ ధ్రువం కంటే ఉత్తర ధ్రువం బలమైంది
సి) అయస్కాంత ధ్రువాలు స్థిరంగా తమ స్థానాలను మార్చుకుంటాయి
డి) పైవేవీ కాదు
- View Answer
- సమాధానం: సి
3. ఒక అనయస్కాంతాన్ని అయస్కాంత పదార్థంగా మార్చడానికి తోడ్పడే అయస్కాంతీకరణ పద్ధతి?
1. ఏకస్పర్శా పద్ధతి
2. ద్విస్పర్శా పద్ధతి
3. అయస్కాంత ప్రేరణ
4. విద్యుదీకరణ పద్ధతి
ఎ) 1, 2
బి) 1, 4
సి) 1, 2, 4
డి) 1, 2, 3, 4
- View Answer
- సమాధానం: డి
4. పరమశూన్య ఉష్ణోగ్రత (–273°C) లేదా కెల్విన్‌ను కొలవడానికి ఉపయోగించే అయస్కాంత ఉష్ణోగ్రతా మాపకంలో దేన్ని వాడతారు?
ఎ) జడవాయువైన నియాన్
బి) ద్రవస్థితిలో ఉన్న హీలియం
సి) పాదరసం
డి) ఆల్కహాల్
- View Answer
- సమాధానం: బి
5. కింది వాటిలో సరికాని వ్యాఖ్య.
1. భూ అయస్కాంత క్షేత్ర తీవ్రత ధ్రువాల వద్ద చాలా ఎక్కువగా, భూమధ్యరేఖ వద్ద తక్కువగా ఉంటుంది.
2. జియో మాగ్నెటిక్ ఈక్వేటర్ భారత ఉత్తరాగ్రం దగ్గర నుంచి వెళుతోంది.
3. అయస్కాంత క్షేత్ర తీవ్రతను కలిపే రేఖా చిత్రం - ఐసోడైనమిక్ చార్ట్
4. తక్కువ అయస్కాంత క్షేత్ర తీవ్రత ఉన్న ఖండం - దక్షిణ అమెరికా
ఎ) 1 మాత్రమే
బి) 2 మాత్రమే
సి) 2, 3
డి) 1, 3
- View Answer
- సమాధానం: బి
6. కింది వాటిలో అయస్కాంత ఆవరణం (మాగ్నెట్ స్పియర్) ఉన్న గ్రహాలు ఏవి?
1. భూమి
2. బుధుడు
3. బృహస్పతి
4. శని
ఎ) 1 మాత్రమే
బి) 1, 3
సి) 1, 4
డి) 1, 2, 3, 4
- View Answer
- సమాధానం: డి
7. భూ అయస్కాంత క్షేత్రం వల్ల వికర్షితమై ఆవేశపూరిత కణాలతో భూమి చుట్టూ వృత్తాకార మార్గంలో ఏర్పడిన రెండు వలయాలు ఏవి?
ఎ) చాప్మన్ - ఫెరారో వలయాలు
బి) వాన్-డీ గ్రాఫ్ వలయాలు
సి) వాన్ హాలెన్ వలయాలు
డి) గిల్బర్ట వలయాలు
- View Answer
- సమాధానం: సి
8. ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియోమాగ్నెటిజం’ సంస్థ ఎక్కడ ఉంది?
ఎ) చెన్నై
బి) బెంగళూరు
సి) ముంబయి
డి) ఢిల్లీ
- View Answer
- సమాధానం: సి
9. జతపరచండి.
గ్రూప్ - I గ్రూప్ - II 1. ఫెర్రో అయస్కాంత పదార్థాలు i. నికెల్, కోబాల్ట్ 2. డయా అయస్కాంత పదార్థాలు ii. పాదరసం, నీరు 3. పారా అయస్కాంత పదార్థాలు iii. అల్యూమినియం, ఆక్సిజన్
ఎ)1-ii, | 2-i, | 3-iii |
బి) 1-iii, | 2-ii, | 3-i |
సి) 1-i, | 2-iii, | 3-ii |
డి) 1-i, | 2-ii, | 3-iii |
- View Answer
- సమాధానం: సి
10. కింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది?
1. విద్యుదయస్కాంతాలను మృదువైన ఇనుముతో రూపొందిస్తారు
2. విద్యుదయస్కాంతాలను ఎలక్ట్రిక్ సర్క్యూట్స్, మోటార్స్, జనరేటర్స్ లో ఉపయోగిస్తారు
3. శాశ్వత అయస్కాంతాన్ని గట్టి అయస్కాంత పదార్థాలైన ఉక్కు, ఆల్నికో, టింకోనల్లతో తయారు చేస్తారు
4. శాశ్వత అయస్కాంతాన్ని గాల్వనోమీటర్, మైక్రోఫోన్, లౌడ్ స్పీకర్, కంపాస్లలో వాడతారు
ఎ) 1, 2
బి) 2, 4
సి) 1, 2, 3
డి) 1, 2, 3, 4
- View Answer
- సమాధానం: డి
11. ఫెర్రైట్స్ అనేవి ......
ఎ) పారా అయస్కాంత పదార్థాలు
బి) ఫెర్రో అయస్కాంత పదార్థాలు
సి) డయా అయస్కాంత పదార్థాలు
డి) ఎ, సి
- View Answer
- సమాధానం: డి
12. అయస్కాంతత్వానికి సరైన పరీక్ష ఏది?
ఎ) ఆకర్షణ
బి) వికర్షణ
సి) పై రెండూ
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: బి
13. కింది వాటిలో సరైంది.
1. అయస్కాంత ఉత్తర ధ్రువాన్ని జాన్రాస్ అనే శాస్త్రవేత్త ‘బూతియా ఫెలిక్స్’ ప్రదేశంలో కనుగొన్నాడు
2. అయస్కాంత దక్షిణ ధ్రువాన్ని శెకల్టన్ అనే శాస్త్రవేత్త సౌత్ విక్టోరియా ప్రదేశంలో కనుగొన్నాడు
ఎ) 1 సరైంది, 2 తప్పు
బి) 1 తప్పు, 2 సరైంది
సి) రెండూ సరైనవే
డి) రెండూ తప్పు
- View Answer
- సమాధానం: సి
14. భౌమ్య అయస్కాంత తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రదేశాలు ఏవి?
1. ఉత్తర కెనడా
2. సైబీరియా
3. దక్షిణ ఆస్ట్రేలియా
4. అంటార్కిటికా తీరం
ఎ) 1 మాత్రమే
బి) 3 మాత్రమే
సి) 1, 3
డి) 1, 2, 3, 4
- View Answer
- సమాధానం: డి
15. పాదరసం, నీరు ఏ రకమైన అయస్కాంత పదార్థాలు?
1) డయా
2) ఫెర్రో
3) పారా
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: ఎ
16. అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రతను కొలవడానికి ఉపయోగించే ప్రమాణం ఏది?
ఎ) టెస్లా
బి) ఆయర్స్టెడ్
సి) గౌస్
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
17. అల్యూమినియం ఏ రకమైన అయస్కాంత పదార్థం?
ఎ) పారా
బి) ఫెర్రో
సి) డయా
డి) యాంటీ-ఫెర్రో
- View Answer
- సమాధానం: ఎ
18. ఏ రకమైన అయస్కాంత పదార్థాలు ఘన స్థితిలో లభిస్తాయి?
ఎ) పారా
బి) ఫెర్రో
సి) డయా
డి) యాంటీ-ఫెర్రో
- View Answer
- సమాధానం: బి
19. మీటరు పొడవున్న దండయస్కాంత మధ్య బిందువు వద్ద ఉండే అయస్కాంత ధ్రువాల సంఖ్య?
1) 0
2) 1
3) 2
4) 4
- View Answer
- సమాధానం: ఎ
-
20. ప్రపంచంలో అత్యధిక పరిమాణంలో అయస్కాంత నిల్వలున్న ప్రదేశం ఏది?
1) ఆస్ట్రేలియా
2) టర్కీ
3) ఉత్తర స్వీడన్
4) చైనా
- View Answer
- సమాధానం: 3
21. కింది వాటిలో అయస్కాంత పదార్థాలను కలిగి ఉండని పరికరం ఏది?
1) సైకిల్ డైనమో
2) ట్రాన్స్ ఫార్మర్
3) రేడియో
4) ట్యూబ్‌లైట్
- View Answer
- సమాధానం: 4
22. అయస్కాంత పదార్థాలను ఉపయోగించి చికిత్స చేయడాన్ని ఏమంటారు?
1) డయో థెరపీ
2) రేడియో థెరపీ
3) మాగ్నటో థెరపీ
4) ఫిజియో థెరపీ
- View Answer
- సమాధానం: 3
23.అయస్కాంత ఉష్ణోగ్రత మాపకాన్ని ఉపయోగించి ఎంత కనిష్ట ఉష్ణోగ్రతను కొలవవచ్చు?
1) –273 K
2) – 273° C
3) –273 F
4) 0° C
- View Answer
- సమాధానం: 2
24. స్టీలు, ఆల్నికో అనేవి ఏ రకమైన అయస్కాంత పదార్థాలు?
1) పారా అయస్కాంతాలు
2) ఫెర్రో అయస్కాంతాలు
3) డయా అయస్కాంతాలు
4) అనయస్కాంతాలు
- View Answer
- సమాధానం: 2
25. గుర్రపునాడ అయస్కాంతాన్ని ఏ పరికరంలో వాడతారు?
1) రేడియో
2) టెలివిజన్
3) విద్యుత్ గంట
4) టెలిగ్రామ్
- View Answer
- సమాధానం: 4
26. భౌమ్య అయస్కాంత బలరేఖ మన దేశంలోని ఏ ప్రాంతాన్ని తాకుతూ వెళుతోంది?
1) శ్రీహరికోట
2) తుంబా
3) చెన్నై
4) అలహాబాద్
- View Answer
- సమాధానం: 2
27. భౌమ్య అయస్కాంత క్షేత్రం వల్ల అర్ధరాత్రి సమయంలో భూమి ఉత్తర ధ్రువం వద్ద కనిపించే వెలుగును ఏమంటారు?
1) అరోరా బొరియాలిస్
2) అరోరా ఆస్ట్రలిస్
3) అరోరా లైట్
4) పోలార్ లైట్
- View Answer
- సమాధానం: 1
28. టేప్ రికార్డర్లోని ప్లాస్టిక్ టేప్‌పై ఏ అయస్కాంత పదార్థంతో పూత పూస్తారు?
1) డయా మాగ్నట్
2) ఫెర్రిక్ ఆక్సైడ్
3) క్యూప్రిక్ క్లోరైడ్
4) ఆల్నికో
- View Answer
- సమాధానం: 2
29. సూర్యుడి ఉపరితలంపై అయస్కాంత క్షేత్రం వల్ల ఏర్పడే మచ్చలను ఏమంటారు?
1) సన్ మార్క్
2) సన్ డార్క్
3) సన్ స్పాట్స్
4) సన్ స్పియర్
- View Answer
- సమాధానం: 3
30. విశ్వాంతరాళంలో భౌమ్య అయస్కాంత క్షేత్రం వల్ల భూమి చుట్టూ ఏర్పడిన వలయాన్ని ఏమంటారు?
1) న్యూటన్
2) అలెన్ వ్యాన్
3) క్యూరి
4) ఫారడే
- View Answer
- సమాధానం:2
31. బలమైన అయస్కాంత పదార్థాలున్నట్లుగా భావిస్తున్న ‘బెర్ముడా ట్రయాంగిల్’ ఎక్కడ ఉంది?
1) హిందూ మహాసముద్రం
2) అరేబియా సముద్రం
3) భూమి దక్షిణ ధ్రువం
4) దక్షిణ అట్లాంటిక్ సముద్రం
- View Answer
- సమాధానం: 4
32.కింది వాటిలో అయస్కాంతీకరణ పద్ధతి కానిది ఏది?
1) ఏకస్పర్శా పద్ధతి
2) ద్విస్పర్శా పద్ధతి
3) విద్యుదీకరణ
4) విభజన
- View Answer
- సమాధానం: 4
33. ఇనుపకడ్డీని అయస్కాంతీకరించడానికి ఏ రకమైన విద్యుత్ ఉపయోగిస్తారు?
1) ఏకాంతర విద్యుత్
2) ఏకముఖ విద్యుత్
3) 1, 2
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 2
34. కింది వాటిలో అయస్కాంత కవచంగా ఉపయోగించే పదార్థం ఏది?
1) ఆల్నికో
2) ఉక్కు
3) నికెల్
4) మృదు ఇనుము
- View Answer
- సమాధానం: 4