రంజిత్ సింగ్ తన కోహినూరు వజ్రాన్ని ఆంగ్లేయులకు ఎప్పుడు ఇచ్చాడు?
1. రంజిత్ సింగ్ తన కోహినూరు వజ్రాన్ని ఆంగ్లేయులకు ఎప్పుడు ఇచ్చాడు?
1) 1806
2) 1807
3) 1808
4) 1809
- View Answer
- సమాధానం: 4
2.కింది వాటిలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ రాసిన గ్రంథమేది?
1) మైరెమినీ సెన్సెస్
2) ఇండియా విన్‌స ఫ్రీడం
3) సర్వోదయ
4) హిందూ వ్యూ ఆఫ్ లైఫ్
- View Answer
- సమాధానం: 4
3. ఆంగ్లేయులకు దత్త మండలాలను బహూకరించిన నిజాం ఎవరు?
1) నిజాం - ఉల్ - ముల్క్
2) ముజఫర్‌జంగ్
3) సలాబత్‌జంగ్
4) నిజాం అలీఖాన్
- View Answer
- సమాధానం: 4
4. వాస్కోడిగామా.. కాలికట్లో ఏ సంవత్సరంలో అడుగుపెట్టాడు?
1) 1498
2) 1497
3) 1496
4) 1495
- View Answer
- సమాధానం: 1
5. ‘విశ్వదాత’ అని గాంధీజీ ఎవరిని సంభోదించారు?
1) భోగరాజు పట్టాభిసీతారామయ్య
2) కాశీనాథుని నాగేశ్వరరావు
3) బులుసు సాంబమూర్తి
4) వావిలాల గోపాలకృష్ణయ్య
- View Answer
- సమాధానం: 2
6. ఆంగ్లేయులు మద్రాస్ ప్రాంతాన్ని ఎప్పుడు పొందారు?
1) 1636
2) 1637
3) 1638
4) 1639
- View Answer
- సమాధానం: 4
7. కింది వాటిలో సరైన జత ఏది?
1) గద్య తిక్కన - కందుకూరి వీరేశలింగం
2) బ్రహ్మర్షి- రఘుపతి వెంకటరత్నం నాయుడు
3) జోన్ ఆఫ్ ఆర్క ఆఫ్ ఇండియా - ఝాన్సీ లక్ష్మీబాయి
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
8. ‘గ్లోబ్ నౌక’లో మచిలీపట్నంలో అడుగుపెట్టిన విదేశీయులు ఎవరు?
1) డచ్‌వారు
2) బ్రిటిషర్లు
3) పోర్చుగీసువారు
4) ఫ్రెంచ్‌వారు
- View Answer
- సమాధానం: 2
9. ‘భారత జాతీయ కాంగ్రెస్ కురువృద్ధుడు’ అని ఎవరిని పిలిచేవారు?
1) దాదాభాయ్ నౌరోజీ
2) ఎ.ఒ. హ్యూమ్
3) డబ్ల్యూ.సి. బెనర్జీ
4) దిన్షావాచా
- View Answer
- సమాధానం: 4
10. కింది వాటిలో సరికాని జత ఏది?
1) చంపారాన్ సత్యాగ్రహం - గాంధీజీ
2) హోంరూల్ ఉద్యమం - నేతాజీ బోస్
3) బార్డోలి సత్యాగ్రహం - సర్దార్ వల్లభభాయ్ పటేల్
4) పల్నాడు అటవీ సత్యాగ్రహం - కన్నెగంటి హనుమంతరావు
- View Answer
- సమాధానం: 2
11.గణపతి ఉత్సవాలను బాలగంగాధర తిలక్ ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
1) 1893
2) 1896
3) 1898
4) 1899
- View Answer
- సమాధానం: 1
12. గాంధీజీ నడిపిన పత్రిక ఏది?
1) న్యూ ఇండియా
2) యంగ్ ఇండియా
3) దీనబంధు
4) నేషనల్ హెరాల్డ్
- View Answer
- సమాధానం: 2
13. కింది వాటిలో సహాయ నిరాకరణోద్యమ సమయంలో జరగని సంఘటన ఏది?
1) తిలక్ స్మారక నిధి ఏర్పాటు
2) గుజరాత్ విద్యాపీఠ్ స్థాపన
3) మోప్లా తిరుగుబాటు
4) కర్నూలు సర్క్యులర్ సంఘటన
- View Answer
- సమాధానం: 4
14. కింది వారిలో జలియన్ వాలాబాగ్ దురంతాలపై విచారణ జరిపిన వారెవరు?
1) రిచర్డ స్ట్రాచీ
2) థామస్ ర్యాలీ
3) మాక్డోనాల్డ్
4) హంటర్
- View Answer
- సమాధానం: 4
15. ‘ఉత్తర భారతదేశ, దక్షిణ భారతదేశ సంస్కృతులకు పుట్టిన బిడ్డ భారతీయ సంస్కృతి’ అని పేర్కొన్న వారెవరు?
1) రవీంద్రనాథ్ ఠాగూర్
2) మహమ్మద్ ఇక్బాల్
3) బంకించంద్ర చటర్జీ
4) మహాత్మాగాంధీ
- View Answer
- సమాధానం: 1
16. బార్డోలి సత్యాగ్రహం ఏ సంవత్సరంలో జరిగింది?
1) 1922
2) 1927
3) 1928
4) 1929
- View Answer
- సమాధానం: 3
17. 1907లో ఐఎన్‌సీ నాయకులు ‘అతివాదులు, మితవాదులు’గా ఎక్కడ విడిపోయారు?
1) జబల్పూర్
2) సూరత్
3) లక్నో
4) బెల్గాం
- View Answer
- సమాధానం: 2
18. ఫ్రెంచ్‌వారు భారత్‌లో అడుగు పెట్టినప్పుడు ఏ మొఘల్ చక్రవర్తి పరిపాలిస్తున్నాడు?
1) ఔరంగజేబు
2) రెండోఅక్బర్
3) ఫరుక్షియర్
4) రెండో బహదూర్ షా
- View Answer
- సమాధానం: 1
19. నాలుగో మైసూర్ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది?
1) 1799
2) 1801
3) 1803
4) 1809
- View Answer
- సమాధానం: 1
20. బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసిన వీరపాండ్య కట్టబొమ్మన్ ఏ ప్రాంతవాసి?
1) బొబ్బిలి
2) ట్రావెన్కోర్
3) కథియవాడ్
4) తమిళనాడు
- View Answer
- సమాధానం: 4
21. 2017లో వందేళ్లు పూర్తిచేసుకున్న ఉద్యమం ఏది?
1) ఖిలాఫత్ ఉద్యమం
2) సైమన్ కమిషన్ వ్యతిరేక ఉద్యమం
3) జలియన్ వాలాబాగ్ దురంతం
4) చంపారాన్ సత్యాగ్రహం
- View Answer
- సమాధానం: 4
22. హైదరాబాద్‌కు వచ్చిన రిప్పన్.. పాలనా అర్హుడిగా ఎవరిని ప్రకటించాడు?
1) సికిందర్జా
2) అప్జలుద్ధౌలా
3) మీర్ మహబూబ్ అలీఖాన్
4) మీర్ ఉస్మాన్ అలీఖాన్
- View Answer
- సమాధానం: 3
23. ఈస్టిండియా కంపెనీలో పని చేసిన చివరి ఆంగ్లేయ పాలనాధికారి ఎవరు?
1) మౌంట్‌బాటెన్
2) వెవేల్
3) వారన్ హేస్టింగ్స
4) కానింగ్
- View Answer
- సమాధానం: 4
24. ‘ఇండియా విన్‌స ఫ్రీడం’ గ్రంథకర్త?
1) లాలా లజపతిరాయ్
2) మౌలానా అబుల్ కలాం ఆజాద్
3) బిపిన్ చంద్రపాల్
4) జవహర్లాల్ నె్రహూ
- View Answer
- సమాధానం: 2
25. మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి ఉత్సవాన్ని ఏ పేరుతో నిర్వహిస్తారు?
1) జాతీయ సమైక్యతా దినోత్సవం
2) జాతీయ అక్షరాస్యతా దినోత్సవం
3) జాతీయ విద్యా దినోత్సవం
4) జాతీయ కిసాన్ దినోత్సవం
- View Answer
- సమాధానం: 3
26. కింది వాటిలో నెహ్రూ ఇచ్చిన నినాదం ఏది?
1) ఇంక్విలాబ్ జిందాబాద్
2) ప్రపంచ కార్మికులారా ఏకంకండి
3) హిందీ - చినీ భాయీభాయీ
4) జైకిసాన్ - జైజవాన్
- View Answer
- సమాధానం: 3
27.స్వతంత్ర భారత్‌లో ప్రధాని నె్రహూ తన మంత్రివర్గంలో ఎంత మంది ముస్లింలకు స్థానం కల్పించారు?
1) 1
2) 2
3) 3
4) 4
- View Answer
- సమాధానం: 2
28. శారదా యాక్ట్ ఎప్పుడు ప్రకటించారు?
1) 1929 సెప్టెంబర్ 28
2) 1929 మార్చి 19
3) 1929 అక్టోబర్ 2
4) 1930 జనవరి 12
- View Answer
- సమాధానం: 1
29. ‘తీన్ మూర్తి భవన్’ అనే నివాస భవనం ఎవరిది?
1) సురేంద్రనాథ్ బెనర్జీ
2) సర్దార్ వల్లభభాయ్ పటేల్
3) జవహర్లాల్ నె్రహూ
4) బాలగంగాధర తిలక్
- View Answer
- సమాధానం: 3
30. ‘భారతదేశ ప్లేటో’ అని మౌలానా ఆజాద్‌ను పేర్కొన్నది ఎవరు?
1) ఎం.కె. గాంధీ
2) ఖాన్ అబ్దుల్ గఫూర్ ఖాన్
3) నేతాజీ బోస్
4) డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్
- View Answer
- సమాధానం: 1
31.కింది వాటిలో తొలిసారి జరిగిన సంఘటన ఏది?
1) సైమన్ కమిషన్ వ్యతిరేక ఉద్యమం
2) చౌరీచౌరా సంఘటన
3) కాకినాడ ఐఎన్‌సీ సమావేశం
4) మాంటేగు-ఛేమ్స్ఫర్డ సంస్కరణలు
- View Answer
- సమాధానం: 4
32. భారతదేశ తొలి సాధారణ ఎన్నికల అనంతరం వ్యవసాయ, ఆహార శాఖా మంత్రిగా ఎవరు పనిచేశారు?
1) రఫీ అహ్మద్ కిద్వాయ్
2) డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్
3) మౌలానా అబుల్ కలాం ఆజాద్
4) రాజ్‌కుమారీ అమృత్ కౌర్
- View Answer
- సమాధానం: 1
33. స్వామి వివేకానంద ఎక్కడ మరణించారు?
1) శృంగేరి
2) బేలూరు
3) చికాగో
4) కన్యాకుమారి
- View Answer
- సమాధానం: 2
34. కింది వారిలో ‘కీర్తి కిసాన్ పార్టీ’తో సంబంధం ఉన్న వ్యక్తిని గుర్తించండి.
1) బి.జి.తిలక్
2) ఎం.కె. గాంధీ
3) భగత్‌సింగ్
4) సి.ఆర్.దాస్
- View Answer
- సమాధానం: 3
35.కింది వారిలో డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ చదువుకోవడానికి ఆర్థికసాయం చేసిన వారెవరు?
1) శాయాజీరావ్ గైక్వాడ్ (బరోడా)
2) హరిసింగ్ (కశ్మీర్)
3) స్వాతి తిరునాళ్ (ట్రావెన్కోర్)
4) నాయని వెంకటరంగారావు (మునగాల)
- View Answer
- సమాధానం: 1
36.ఫ్రెంచ్ సైన్యాధికారి బుస్సీకి పూసపాటి పెద విజయరామరాజు బహూకరించిన ప్రాంతం ఏది?
1) యానాం
2) కాకినాడ
3) పులికాట్
4) కొండపల్లి
- View Answer
- సమాధానం: 1
37. కింది వాటిలో చివరిగా జరిగిన సంఘటన ఏది?
1) రాయల్ ఇండియన్ నేవి తిరుగుబాటు
2) జైపూర్‌లో ఐఎన్‌సీ సమావేశం
3) అంబేడ్కర్ బౌద్ధమత దీక్ష స్వీకారం
4) క్రిప్స్ రాయబారం
- View Answer
- సమాధానం: 3
38. కింది వాటిలో సహాయ నిరాకరణోద్యమ కాలంలో స్థాపించిన విశ్వవిద్యాలయం ఏది?
1) మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (హైదరాబాద్)
2) బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం
3) శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం (తిరుపతి)
4) జామియా-మిలియా-ఇస్లామియా యూనివర్సిటీ (ఢిల్లీ)
- View Answer
- సమాధానం: 4
39. భారతదేశాన్ని వదిలివెళ్లిన చివరి ఐరోపా వర్తకులు ఎవరు?
1) డచ్చివారు
2) పోర్చుగీసువారు
3) ఫ్రెంచ్‌వారు
4) బ్రిటిషర్లు
- View Answer
- సమాధానం: 2
40. కింది వాటిలో 1938లో ఐఎన్సీలో తీసుకున్న నిర్ణయం ఏది?
1) భూదానోద్యమం చేయాలి
2) క్విట్ ఇండియా ఉద్యమం చేపట్టాలి
3) హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఏర్పాటు
4) వ్యక్తిగత సత్యాగ్రహం చేయాలి
- View Answer
- సమాధానం: 3
41.‘సెర్చలైట్’ అనే ఆంగ్ల పత్రికను స్థాపించిన వారెవరు?
1) డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్
2) డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్
3) డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్
4) ఎం.ఎన్. రాయ్
- View Answer
- సమాధానం: 1
42.‘తెలంగాణ గాంధీ’ అని ఎవరిని పిలిచేవారు?
1) భాగ్యరెడ్డి వర్మ
2) మందముల నరసింగరావు
3) కేశవరావు కోరాట్కర్
4) బోయినపల్లి వెంకటరామారావు
- View Answer
- సమాధానం: 4
43.‘భారతదేశానికి రాజ్యాంగం అవసరం’ అని 1914లో పేర్కొన్న వారెవరు?
1) బిపిన్ చంద్రపాల్
2) లాలా లజపతిరాయ్
3) గోపాలకృష్ణ గోఖలే
4) బాలగంగాధర తిలక్
- View Answer
- సమాధానం: 3
44.కింది వాటిలో సరైన జత ఏది?
1) లోహ్పురుష - సర్దార్ పటేల్
2) భారత కోకిల - సరోజినీనాయుడు
3) మహామాన్య - మదన్ మోహన్ మాలవ్య
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
45. సర్దార్ పటేల్ జయంతిని ఎప్పుడు నిర్వహిస్తారు?
1) ఆగస్టు 29
2) సెప్టెంబర్ 16
3) అక్టోబర్ 31
4) నవంబర్ 24
- View Answer
- సమాధానం: 3
46. ‘గాంధమ్మ సంబరం’ అనే పేరుతో గాంధీని స్మరిస్తూ పండుగ జరుపుకొనే ప్రాంతం ఏది?
1) చిట్యాల (నల్లగొండ)
2) సూరత్ (గుజరాత్)
3) కేదారిపురం (శ్రీకాకుళం)
4) చంపారాన్ (బిహార్)
- View Answer
- సమాధానం:3
47. ఆంగ్లేయులు మద్రాస్‌లో నిర్మించిన కోట ఏది?
1) సెయింట్ డేవిడ్ కోట
2) సెయింట్ జార్జి కోట
3) సెయింట్ విలియం కోట
4) సెయింట్ థామస్ కోట
- View Answer
- సమాధానం: 2
48.కింది వాటిలో డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ రాసిన గ్రంథం ఏది?
1) ఎట్ ది ఫీట్ ఆఫ్ ది మాస్టర్
2) ఎట్ ది ఫీట్ ఆఫ్ మహాత్మ
3) బాబూ బ్లెసెస్
4) హాఫ్ లయన్
- View Answer
- సమాధానం: 2
49. కింది వాటిలో సరైన జత ఏది?
1) ఆంధ్ర నేతాజీ - మద్దూరి అన్నపూర్ణయ్య
2) ఆంధ్రరత్న - దుగ్గిరాల గోపాల కృష్ణయ్య
3) దేశభక్త - కొండా వెంకటప్పయ్య
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
50. 1892 చట్టాన్ని మితవాదులు ఏమని అభివర్ణించారు?
1) బొమ్మను అడిగితే దాని ప్రతిమ ఇవ్వడం
2) నవ్వుతూ చేసిన మోసం
3) భోజనం వడ్డించని విస్తరి
4) ఇంజన్ లేని బ్రేకులున్న కారు
- View Answer
- సమాధానం: 2
51. ‘జాయిన్ ఇండియా’ ఉద్యమాన్ని హైదరాబాద్‌లో ఎప్పుడు నిర్వహించారు?
1) 1946 సెప్టెంబర్ 2
2) 1947 ఆగస్టు 15
3) 1947 ఆగస్టు 7
4) 1948 సెప్టెంబర్ 13
- View Answer
- సమాధానం: 3