Skip to main content

అజీవికా గ్రామీణ్ ఎక్స్‌ప్రెస్ యోజన లక్ష్యం?

ప్రాంతీయ అసమానతలు-ప్రభుత్వ చర్యలు
సమ్మిళితవృద్ధి లక్ష్యసాధన, పేదరికం తగ్గింపునకు సంబంధించి భారత్‌లో ప్రాంతీయ అసమానతలు అవరోధంగా పరిణమించాయి. ఆర్థిక సంస్కరణలను వేగవంతంగా అమలు చేయలేకపోవడానికి ప్రాంతీయ అసమానతలను కారణంగా పేర్కొనవచ్చు. అనేక రాష్ట్రాల్లో సాంఘిక-ఆర్థికాభివృద్ధిలో ప్రాంతాల మధ్య అసమానతలు ఏర్పడ్డానికి ఆయా రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు వెనుకబడిన ప్రాంతాలను నిర్లక్ష్యం చేయడం ప్రధాన కారణమైంది. బ్రిటిషు ప్రభుత్వం అవలంబించిన విధానాలు, సహజ వనరుల లభ్యతలో ప్రాంతాల మధ్య అసమానతలు, సంతులిత లక్ష్యసాధనలో ప్రణాళికల వైఫల్యం, అవస్థాపన సౌకర్యాలు కొన్ని ప్రాంతాల్లోనే కేంద్రీకృతం కావడం, వ్యవసాయ, పారిశ్రామిక అభివృద్ధి కొన్ని ప్రాంతాలకు పరిమితం కావడం, వృద్ధికి యంత్రంగా ఉపకరించే చిన్న, మధ్య తరహా సంస్థలకు సరైన పరపతి లభ్యం కాకపోవడం లాంటి అంశాలు భారతదేశంలో రాష్ట్రాల మధ్య, రాష్ర్టంలోని ప్రాంతాల మధ్య సాంఘిక-ఆర్థికాభివృద్ధిలో వ్యత్యాసాల పెరుగుదలకు కారణాలుగా భావించవచ్చు. ఈ క్రమంలో ప్రాంతీయ సమతౌల్య అభివృద్ధి ప్రాధాన్యత సంతరించుకుంది. వెనుకబడిన ప్రాంతాల్లో గుడ్ గవర్నెన్‌‌సను పటిష్టపరచవలసిన ఆవశ్యకత ఉంది. భారత్‌లో ప్రాంతీయ అసమానతల తగ్గింపునకు వెనుకబడిన ప్రాంతాల్లో స్థానిక సంస్థలను పటిష్ట పరచాలి.

ప్రాంతీయ సమతౌల్య అభివృద్ధికి చర్యలు :
  • ప్రాంతీయ అసమానతల కారణంగా దేశంలోని వివిధ ప్రాంతాలు, రాష్ర్టంలోని ప్రాంతాల మధ్య agitations, వలసలు, సాంఘిక అశాంతి, కాలుష్యం, గృహ, నీటి కొరత, గ్రామీణ యువతలో నిరుద్యోగం, అవస్థాపనా సౌకర్యాల అభివృద్ధికి నోచుకోకపోవడం లాంటి పరిణామాలు సంభవిస్తాయి. ప్రాంతీయ సమతౌల్య అభివృద్ధికి కింది చర్యలు దోహదపడతాయి.
  • దేశంలోని వెనుకబడిన ప్రాంతాలను గుర్తించడం ద్వారా ఆయా ప్రాంతాలకు సంబంధించి ప్రత్యేక ప్రణాళికలు, అభివృద్ధి నమూనాలను ప్రభుత్వం రూపొందించి అమలు పరచాలి. నిధుల పంపిణీలో వెనుకబడిన ప్రాంత అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రాంతీయ సమతౌల్య అభివృద్ధిలో భాగంగా పెట్టుబడి ప్రధానమైంది. ఈశాన్య ప్రాంత అభివృద్ధికి అవసరమైన ప్రత్యేక విధానాలు, కార్యక్రమాలను రూపొందించాలి.
  • వెనుకబడిన ప్రాంతాల్లో పారిశ్రామికీకరణ పెంపొందించడానికి ప్రభుత్వం నూతన ఆర్థిక సంస్థలను ఏర్పాటు చేయడం.
  • భారత రాజ్యాంగం ఆర్టికల్ 321(D) ప్రకారం ప్రాంతీయ బోర్డులను ఏర్పాటు చేయడం ద్వారా తగిన నిధులు, legal powers ను ఆయా బొర్డులకు ఇవ్వడం.
  • ఉత్పాదకతతో కూడిన వ్యవసాయ భూములను వ్యవసాయేతర అవసరాలకు వినియోగించకుండా తగిన చర్యలు తీసుకోవడం.
  • గిరిజన ప్రాంతాల్లో లభ్యమయ్యే సహజ వనరుల వినియోగం ద్వారా లభించే ఆదాయంలో తగిన వాటాను ఆయా ప్రాంతాల అభివృద్ధిపై వెచ్చించడం.
  • మండలం/బ్లాక్ స్థాయిలో వెనుకబడిన ప్రాంతాలకు నిధుల కేటాయింపునకు సంబంధించి కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు తగిన ఫార్ములాను రూపొందించుకొని అమలుపరచడం.
ప్రభుత్వం తీసుకున్న చర్యలు :
  • వెనుకబడిన ప్రాంతాల గ్రాంట్ నిధి పథకాన్ని 2006-07లో ప్రభుత్వం ప్రారంభించింది. ప్రస్తుతం ఈ పథకం అమలు బాధ్యతను రాష్ర్ట ప్రభుత్వాలకు ఇచ్చారు. ఇకపై ఈ పథకానికి కేంద్ర మద్దతు ఉండదు. దేశంలోని 272 వెనుకబడిన జిల్లాల్లో అవస్థాపనా ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడం ద్వారా ప్రాంతీయ అసమానతల నిర్మూలన ఈ పథకం లక్ష్యం. స్థానిక సంస్థలకు సంబంధించి ప్రణాళిక రూపకల్పన, అమలు, monitoring విషయంలో వృత్తిపరమైన మద్దతు నందించడం ఈ పథకం లక్ష్యం.
  • ఇటీవల నీతి ఆయోగ్ 2017-18 నుంచి 2019-20 కాలానికి సంబంధించి మూడు సంవత్సరాల action agenda ను ప్రకటించింది. ప్రాంతీయ అభివృద్ధి అంతరాన్ని కీలక అభివృద్ధి అంశంగా నీతి ఆయోగ్ తన డాక్యుమెంట్‌లో పేర్కొంది. తలసరి ఆదాయం, పేదరికరేఖ దిగువన ఉన్న జనాభా, పట్టణ జనాభా, పారిశ్రామిక రంగంతో పోల్చినప్పుడు వ్యవసాయ రంగంపై ఆధారపడిన జనాభా, వివిధ రాష్ట్రాల్లో అవస్థాపనా రంగ అభివృద్ధి ఆధారంగా ప్రాంతీయ అభివృద్ధి అంతరాన్ని అంచనా వేయవచ్చు. అస్సాం, మేఘాలయ, మణిపూర్, త్రిపురలాంటి రాష్ట్రాలకు one time ప్రత్యేక గ్రాంటును నీతి ఆయోగ్ సిఫార్సు చేసింది.
  • ప్రణాళిక సంఘం 2014వ సంవత్సరం ముందు కాలంలో ప్రణాళిక బదిలీల రూపంలో, ఆర్థిక సంఘం ప్రణాళికేతర బదిలీల రూపంలో వెనుకబడిన రాష్ట్రాలకు ఆర్థిక సహాయాన్ని అందించాయి. 1969 తర్వాత కాలంలో ‘ప్రత్యేక కేటగిరీ హోదా’ కింద కేంద్రం నుంచి ఆయా రాష్ట్రాలకు అధిక మొత్తంలో గ్రాంట్లు లభించాయి. 14వ ఆర్థిక సంఘం కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా నిర్ణయించడానికి అవలంభించే ప్రక్రియలో భాగంగా income distance కు అధిక వెయిటేజీ ఇచ్చింది.
  • వ్యవసాయ రంగం అభివృద్ధి నేపథ్యంలో ప్రవేశపెట్టిన కార్యక్రమాలు, సామాజిక అభివృద్ధి కార్యక్రమం, వెనుకబడిన ప్రాంతాల్లో మౌలిక సౌకర్యాల కల్పనలో భాగంగా నీటిపారుదల, విద్యుత్, రవాణా, సమాచారం, సాంఘిక సేవల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చింది. ప్రాంతీయ సమతౌల్య అభివృద్ధి సాధనలో భాగంగా ప్రభుత్వం కింది వ్యూహాలను అవలంబించింది.
    ఎ. వనరుల బదిలీ, వెనుకబాటుతనం
    బి. ప్రత్యేక ప్రాంత అభివృద్ధి కార్యక్రమాలు
    సి. వెనుకబడిన ప్రాంతాల్లో పెట్టుబడులను ప్రోత్సహించడానికి తగిన ప్రోత్సాహకాలు
  • బుందేల్‌ఖండ్ ప్రాంతానికి సంబంధించి ken -betwa inter river link project తో ఇతర ప్రాంతాలతో పాటు అనేక బహుళార్థ సాధక రివర్ వ్యాలీ ప్రాజెక్టులను ప్రభుత్వం చేపట్టింది.
  • ఈశాన్య ప్రాంతాల అభివృద్ధికి East West కారిడార్ ప్రాజెక్టు, కనెక్టివిటీ పెంపునకు ట్రాన్‌‌స అరుణాచల్ హైవేను ప్రభుత్వం చేపట్టింది. ఈ ప్రాంతంలో 25 రైల్వే ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. వెనుకబడిన ప్రాంతాల్లో పారిశ్రామికీకరణ ప్రోత్సహించడానికి సబ్సీడీలు, మినహాయింపులు, పన్ను రాయితీలను ప్రభుత్వం ప్రకటించింది. ఈశాన్య ప్రాంతానికి సంబంధించి 2007లో పారిశ్రామిక, పెట్టుబడి ప్రోత్సాహక విధానం; హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ, కశ్మీర్‌కు సంబంధించి ప్రత్యేక ప్యాకేజి పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది. మైనింగ్ వల్ల affect అయిన గిరిజనులు, గిరిజన ప్రాంతాల సంక్షేమం కోసం 2015 సెప్టెంబర్‌లో ‘ప్రధాన మంత్రి ఖనిజ్ క్షేత్ర కల్యాణ్ యోజన’ను ప్రభుత్వం ప్రారంభించింది.
మాదిరి ప్రశ్నలు:
Published date : 14 Oct 2019 04:29PM

Photo Stories