అధిక కరెన్సీని జారీచేయడాన్ని ద్రవ్యోల్బణంగా వర్ణించినవారు?
1. అధిక కరెన్సీని జారీచేయడాన్ని ద్రవ్యోల్బణంగా వర్ణించినవారు?
1) శామ్యూల్సన్
2) హాట్రే
3) ఫిషర్
4) షుంపీటర్
- View Answer
- సమాధానం: 2
2. 2018-19 ఆర్థిక సంవత్సరంలో అధిక ద్రవ్యోల్బణం నమోదు కావడానికి కింది ఏ అంశాలను కారణాలుగా భావించవచ్చు?
ఎ) చలామణిలో ఉన్న ద్రవ్యం పెరుగుదల
బి) చమురు ధరల పెరుగుదల
సి) రూపాయి విలువ క్షీణత
డి) అధిక కనీస మద్దతు ధరలు
1) సి, డి మాత్రమే
2) ఎ, బి మాత్రమే
3) బి, సి మాత్రమే
4) ఎ, బి, సి, డి
- View Answer
- సమాధానం: 4
3. కింది వాటిలో సప్లయ్ వైపు ధరలను ప్రభావితం చేసే అంశాల్లో లేనిది ఏది?
1) వ్యవసాయ ధరల విధానం లోప భూయిష్టంగా ఉండటం
2) పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి తక్కువగా ఉండటం
3) లోటు ద్రవ్య విధానం
4) నిత్యావసరవస్తువుల నిల్వ
- View Answer
- సమాధానం: 3
4. కింది వాటిలో ఏ సంవత్సరంలో భారత్‌లో అధిక ద్రవ్యోల్బణం నమోదైంది?
1) 1984-85
2) 1991-92
3) 2016-17
4) 2017-18
- View Answer
- సమాధానం: 2
5. కింది వాటిలో కోర్ ఇన్ఫ్లేషన్లో భాగం కానిదేది?
1) ఆహారం, ఇంధనం
2) ప్రాథమిక ఉత్పత్తులు
3) తయారీ ఉత్పత్తులు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 1
6. కింది ఏ ప్రణాళికలో సాధారణ ధరల స్థాయి సగటు వృద్ధి తక్కువగా నమోదైంది?
1) మొదటి ప్రణాళిక
2) రెండో ప్రణాళిక
3) మూడు ప్రణాళిక
4) ఆరో ప్రణాళిక
- View Answer
- సమాధానం: 1
7. కింది వాటిలో ప్రభుత్వ వ్యయం పెరుగుదలకు కారణం కాని అంశం ఏది?
1) వడ్డీ చెల్లింపులు
2) రక్షణ వ్యయం
3) వ్యవసాయం, అనుబంధాలపై పెట్టుబడి
4) సబ్సిడీ వ్యయం
- View Answer
- సమాధానం: 3
8. ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం అధికంగా ఉన్నప్పుడు ద్రవ్యోల్బణం ద్రవ్య సప్లయ్‌ను ఏ విధంగా ప్రభావితం చేస్తుంది?
1) ద్రవ్య సప్లయ్ స్థిరం
2) ద్రవ్య సప్లయ్ పెరుగుదల
3) ద్రవ్య సప్లయ్ తగ్గుదల
4) ద్రవ్య డిమాండ్, ద్రవ్య సప్లయ్‌కు సమానంగా ఉంటుంది
- View Answer
- సమాధానం: 2
9. ద్రవ్యోల్బణం, తిరోగమనం రెండూ కలిసి సంభవించే పరిస్థితిని ఏ విధంగా వ్యవహరిస్తాం?
1) స్టాగ్ఫ్లేషన్
2) ప్రతి ద్రవ్యోల్బణం
3) ఆర్థిక మాంద్యం
4) ఆర్థిక పురోగతి
- View Answer
- సమాధానం: 1
10. టోకు ధరల సూచీ (WPI)ని కొలవడానికి కింది వాటిలో దేనిని ఆధార సంవత్సరంగా తీసుకుంటారు?
1) 2001-02
2) 2004-05
3) 2011-12
4) 2017-18
- View Answer
- సమాధానం: 3
11. కింది వాటిలో ద్రవ్యోల్బణానికి కారణం?
1) వ్యవసాయ ఉత్పత్తుల పెరుగుదల
2) ద్రవ్య సప్లయ్ పెరుగుదలతోపాటు ఉత్పత్తి అదే స్థాయిలో పెరగకపోవడం
3) ద్రవ్య సప్లయ్ తగ్గుదల
4) పెట్టుబడి రేటు తగ్గుదల
- View Answer
- సమాధానం: 2
12. కేంద్ర బ్యాంక్ రెపో రేటును పెంచడం వల్ల ఏర్పడే పరిణామం?
1) వాణిజ్య బ్యాంకుల రుణ మంజూరు తగ్గుతుంది
2) ద్రవ్య సప్లయ్ తగ్గుతుంది
3) ధరలు నియంత్రించబడతాయి
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
13. బహిరంగ మార్కెట్లో ప్రభుత్వ సెక్యూరిటీల అమ్మకం, కొనుగోలును నిర్వహించేది?
1) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
2) రిజర్వ బ్యాంక్ ఆఫ్ ఇండియా
3) కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 2
14. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి కేంద్ర బ్యాంక్ తన ద్రవ్య విధానంలో భాగంగా కింది వాటిలో ఏ విధానాన్ని అనుసరించదు?
1) రెపో రేటు పెంచుతుంది
2) నగదు నిల్వల నిష్పత్తి పెంపు
3) బ్యాంక్ రేటును తగ్గించడం
4) ప్రభుత్వ సెక్యూరిటీలను బహిరంగ మార్కెట్లో విక్రయించడం
- View Answer
- సమాధానం: 3
15. కింది వాటిలో పరిమాణాత్మక నియంత్రణ సాధనం కానిది ఏది?
1) బ్యాంక్ రేటు
2) రెపో రేటు
3) రివర్స రెపో రేటు
4) పరపతి రేషనింగ్
- View Answer
- సమాధానం: 4
16. ద్రవ్యోల్బణాన్ని నివారించడానికి ప్రభుత్వం అవలంబించే కోశ విధానంలో సరికాని అంశం ఏది?
1) ప్రత్యక్ష పన్నులను తగ్గించడం
2) ప్రభుత్వ వ్యయం తగ్గుదల
3) అంతర్గత ప్రభుత్వ రుణం పెరుగుదల
4) లోటు ద్రవ్య విధానాన్ని అనుసరించకపోవడం
- View Answer
- సమాధానం: 1
17. రివర్స రెపో రే టు సాధనాన్ని కేంద్ర బ్యాంక్ ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టింది?
1) 1994
2) 1995
3) 1996
4) 1998
- View Answer
- సమాధానం: 3
18. సంపూర్ణ ఉద్యోగిత తర్వాత ఏర్పడే ధరల పెరుగుదలను నిజ ద్రవ్యోల్బణంగా నిర్వచించినవారు?
1) ఫిషర్
2) కోల్బర్న్
3) జె.ఎం. కీన్స్
4) క్రౌధర్
- View Answer
- సమాధానం: 3
19. వస్తు సప్లయ్‌లో తగ్గుదలకు కింది వాటిలో కారణం కానిది ఏది?
1) ప్రకృతి వైపరీత్యాలు
2) ప్రభుత్వ వ్యయ పెరుగుదల
3) చీకటి బజార్లు
4) ఉత్పత్తి కారకాల సప్లయ్ తగ్గుదల
- View Answer
- సమాధానం: 2
20.కింది వాటిలో కీన్స్ ప్రచురించిన గ్రంథం ఏది?
1) ప్రిన్సిపుల్స్ ఆఫ్ ఎకానమి
2) హౌ టు పే ఫర్ ది వార్
3) ఎకనామిక్స్ ఆఫ్ ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్
4) పైవేవీకావు
- View Answer
- సమాధానం: 2
21. భారత్‌లో జీరో బేస్డ్ బడ్జెట్‌ను మొదట ప్రవేశపెట్టినప్పుడు ఆర్థిక మంత్రి ఎవరు?
1) వి.పి. సింగ్
2) ప్రణబ్ ముఖర్జీ
3) గులాం నబీ ఆజాద్
4) అరుణ్ జైట్లీ
- View Answer
- సమాధానం: 1
22.సాధారణ బడ్జెట్ నుంచి రైల్వే బడ్జెట్‌ను ఏ సంవత్సరంలో వేరుచేశారు?
1) 1914
2) 1922
3) 1924
4) 1950
- View Answer
- సమాధానం: 3
23. ద్రవ్యోల్బణ కాలంలో ధరల పెరుగుదలతోపాటు ఆస్తుల విలువ కూడా పెరుగుతుందని పేర్కొన్నవారు?
1) మార్షల్
2) ఆడమ్ స్మిత్
3) పిగూ
4) కార్‌లమార్‌క్స
- View Answer
- సమాధానం: 3
24. ఒక ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యవంతంగా ఉండాలంటే కింది ఏ ద్రవ్యోల్బణాన్ని నిర్వహించాలి?
1) నడుస్తున్న ద్రవ్యోల్బణం
2) పాకుతున్న ద్రవ్యోల్బణం
3) అతి ద్రవ్యోల్బణం
4) ప్రతి ద్రవ్యోల్బణం
- View Answer
- సమాధానం: 2
25. ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో కింది ఏ పరిణామం సంభవిస్తుంది?
1) ద్రవ్య విలువ పెరుగుతుంది
2) ధరల స్థాయి పెరుగుతుంది
3) అధిక పెట్టుబడుల స్థాయి
4) అధిక ఉద్యోగితా స్థాయి
- View Answer
- సమాధానం: 1
26. కొన్ని రంగాల్లో ధరల పెరుగుదల అధికంగా, మరికొన్ని రంగాల్లో తక్కువగా ఉండటాన్ని ఏ విధంగా వ్యవహరిస్తాం?
1) పిగూ ఫలితం
2) ద్రవ్య భ్రాంతి
3) రాచెట్ ద్రవ్యోల్బణం
4) పైవేవీకావు
- View Answer
- సమాధానం: 3
27. ఇటీవలి కాలంలో హైపర్ ఇన్ఫ్లేషన్ను ఎదుర్కొంటున్న దేశం?
1) పాకిస్తాన్
2) ఇటలీ
3) జర్మనీ
4) టర్కీ
- View Answer
- సమాధానం: 4
28. లాభాల కోసం ధరలను పెంచడాన్ని ఎలా వ్యవహరిస్తాం?
1) మద్దతు ధర
2) మార్కఅప్ ప్రైస్
3) పాలిత ధర
4) పెనెట్రేషన్ ప్రైస్
- View Answer
- సమాధానం: 2
29. ఆర్థిక వ్యవస్థలో నిర్మాణాత్మక లోపాల కారణంగా ధరలు పెరగడాన్ని ఏమంటారు?
1) వ్యవస్థాపూర్వక ద్రవ్యోల్బణం
2) మిశ్రమ ద్రవ్యోల్బణం
3) వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం
4) డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం
- View Answer
- సమాధానం: 1
30. ఫిలిప్స్ రేఖ కింది వాటిలో దేని మధ్య సంబంధాన్ని తె లుపుతుంది?
1) ద్రవ్యోల్బణం, పేదరికం
2) ద్రవ్యోల్బణం, ఆర్థిక వృద్ధి
3) ద్రవ్యోల్బణం, నిరుద్యోగం
4) ద్రవ్యోల్బణం, ప్రజల ఆదాయాలు
- View Answer
- సమాధానం: 3
31. అధిక ద్రవ్యోల్బణం కారణంగా సంభవించే పరిణామం?
ఎ) ఆర్థిక అసమానతల పెరుగుదల
బి) అభివృద్ధికి ఆటంకం
సి) సాపేక్ష ధరల్లో మార్పు లేకపోవడం
డి) చెల్లింపుల శేషంపై ప్రతికూల ప్రభావం
1) ఎ,సి
2) బి,సి
3) ఎ, బి, డి
4) ఎ, బి, సి, డి
- View Answer
- సమాధానం: 3
32. కింది ఏ కమిటీ సిఫార్సుపై ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని అదుపుచేయడానికి నగదు-నిల్వల నిష్పత్తి, ఎస్.ఎల్.ఆర్.పై ఆధారపడటం తగ్గించింది?
1) విజయ్ కేల్కర్ కమిటీ
2) నరసింహం కమిటీ
3) రాజా చెల్లయ్య కమిటీ
4) మల్హోత్రా కమిటీ
- View Answer
- సమాధానం: 2
33. కింది వారిలో ద్రవ్యోల్బణ కాలంలో లాభ పడని వర్గం ఏది?
1) వ్యాపారస్తులు
2) రుణ గ్రహీతలు
3) ఎగుమతి పరిశ్రమలు
4) రుణ దాతలు
- View Answer
- సమాధానం: 4
34. ధరల పెరుగుదల సంవత్సరానికి 100 శాతం కంటే ఎక్కువగా ఉన్న స్థితిని ఏ విధంగా భావిస్తాం?
1) అతి ద్రవ్యోల్బణం
2) పరిగెత్తే ద్రవ్యోల్బణం
3) పాకుతున్న ద్రవ్యోల్బణం
4) నడుస్తున్న ద్రవ్యోల్బణం
- View Answer
- సమాధానం: 1
35. ప్రభుత్వం ధరల పెరుగుదలను నియంత్రించడాన్ని ఏ విధంగా వ్యవహరిస్తాం?
1) బహిరంగ ద్రవ్యోల్బణం
2) ప్రతి ద్రవ్యోల్బణం
3) అణచివేయబడిన ద్రవ్యోల్బణం
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 3
36. ప్రతిద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి రిజర్వ బ్యాంక్ చేపట్టే చర్యల్లో సరికానిది ఏది?
1) నగదు నిల్వల నిష్పత్తి తగ్గిస్తుంది
2) రెపో రేటు పెంచుతుంది
3) ఎస్.ఎల్.ఆర్.ను తగ్గిస్తుంది
4) బ్యాంక్ రేటు తగ్గిస్తుంది
- View Answer
- సమాధానం: 2
37. ప్రతిద్రవ్యోల్బణ కాలంలో కింది ఏ వర్గం నష్టపోతుంది?
1) రుణ గ్రహీతలు
2) స్థిర ఆదాయ వర్గాలు
3) వినియోగదారులు
4) దిగుమతులపై ఆధారపడిన పరిశ్రమలు
- View Answer
- సమాధానం: 1
38. వేతన ప్రేరిత ద్రవ్యోల్బణం, నూతన ద్రవ్యోల్బణంగా కింది వాటిలో దేనిని భావిస్తాం?
1) డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం
2) వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం
3) వ్యవస్థాపూర్వక ద్రవ్యోల్బణం
4) లాభ ప్రేరిత ద్రవ్యోల్బణం
- View Answer
- సమాధానం: 2