సిమెంట్/గాజు
1. ప్రాచీన కట్టడాలకు వినియోగించిన ‘డంగుసున్నం’ తయారీకి అవసరం లేని ముడిపదార్థం ఏది?
ఎ) సున్నం
బి) ఇసుక
సి) నీరు
డి) బొగ్గు
- View Answer
- సమాధానం: డి
2. సిమెంట్ అనేది వేటి మిశ్రమం?
ఎ) కాల్షియం సల్ఫేట్, కాల్షియం క్లోరైడ్
బి) కాల్షియం ఫాస్ఫేట్, కాల్షియం అల్యూమినేట్
సి) కాల్షియం సిలికేట్లు, కాల్షియం అల్యూమినేట్
డి) సోడియం క్లోరైడ్, కాల్షియం క్లోరైడ్
- View Answer
- సమాధానం: సి
3. సిమెంట్ తయారీలో వినియోగించే ఉష్ణోగ్రత?
ఎ) 100 - 200°C
బి) 1700 - 1900°C
సి) 2000 - 2500°C
డి) 170 - 190°C
- View Answer
- సమాధానం: బి
4. సిమెంట్ పరిశ్రమను ఎలాంటి ప్రాంతాల్లో నెలకొల్పుతారు?
ఎ) ఇసుక దొరికే ప్రాంతం
బి) సున్నపురాయి దొరికే ప్రాంతం
సి) నదీ తీర ప్రాంతం
డి) సముద్ర తీర ప్రాంతం
- View Answer
- సమాధానం: బి
5. సిమెంట్ తయారీకి కావలసిన ముడి పదార్థాలు?
ఎ) సున్నపురాయి
బి) బంకమన్ను
సి) బొగ్గు
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
6. బూడిద వర్ణం ఉన్న సిమెంట్ బంతులను ఏమంటారు?
ఎ) సిమెంట్ బాల్స్
బి) బక్కీ బాల్స్
సి) సిమెంట్ క్లింకర్స
డి) కల్లెట్స్
- View Answer
- సమాధానం: సి
7. సిమెంట్‌కు జిప్సం కలపడానికి కారణం?
ఎ) రంగు కోసం
బి) గట్టిదనం కోసం
సి) నునుపుదనం కోసం
డి) సెట్టింగ్ నెమ్మదిగా జరగడం కోసం
- View Answer
- సమాధానం: డి
8. కిందివాటిలో మోటారు వాహనాల నుంచి వెలువడని కాలుష్యకారిణి ఏది?
ఎ) కార్బన్ డై ఆక్సైడ్
బి) ఫ్లై యాష్
సి) నైట్రోజన్ ఆక్సైడ్లు
డి) నీటి ఆవిరి
- View Answer
- సమాధానం: బి
9. ఫ్లై యాష్‌ను ఎక్కువగా వేటికి ఉపయోగిస్తారు?
ఎ) ఇటుకల తయారీ
బి) సిమెంట్ తయారీ
సి) ఎ, బి
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: సి
10. ఫ్లై యాష్ గురించి సరికాని వాక్యం ఏది?
ఎ) థర్మల్ విద్యుత్ ప్లాంట్ల ఉప ఉత్పన్నం ఫ్లై యాష్
బి) ఫ్లై యాష్‌కు క్షార ధర్మం ఉంటుంది
సి) నీటిని పీల్చుకునే ధర్మం ఉంటుంది
డి) విషపూరిత మూలకాలు ఉండవు
- View Answer
- సమాధానం: డి
11. ఫ్లై యాష్‌లో ఉండే హానికారక లోహాలు ఏవి?
ఎ) ఆర్సెనిక్
బి) మెర్క్యూరీ
సి) లెడ్
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
12. ఫ్లై యాష్‌లో ప్రధానంగా ఉండేవి?
ఎ) సిలికాన్ డై ఆక్సైడ్
బి) అల్యూమినియం ఆక్సైడ్
సి) కాల్షియం ఆక్సైడ్
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
13. సిమెంట్‌లో సాధారణంగా కలిపే జిప్సం శాతం?
ఎ) 10-20 శాతం
బి) 5-10 శాతం
సి) 50 శాతం
డి) 2-3 శాతం
- View Answer
- సమాధానం: డి
14. గాజు అనేది ఒక..?
ఎ) స్ఫటిక ఘనపదార్థం
బి) అస్ఫటిక ఘన పదార్థం
సి) అతి శీతలీకరణం చెందిన ద్రవం
డి) జెల్లీ
- View Answer
- సమాధానం: సి
15. గాజు రసాయనికంగా వేటి మిశ్రమం?
1. సోడియం సిలికేట్
2. కాల్షియం సిలికేట్
3. సిలికా
ఎ) 1, 2 మాత్రమే
బి) 2, 3 మాత్రమే
సి) 1, 3 మాత్రమే
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
16. ప్రయోగశాలలోని గాజు పరికరాల తయారీకి వాడే గాజు?
ఎ) సోడా గాజు
బి) క్వార్ట్జ్ గాజు
సి) పెరైక్స్ గాజు
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: సి
17. విద్యుత్ బల్బులు, దృశ్య పరికరాల తయారీకి వాడే గాజు?
ఎ) సోడా గాజు
బి) క్వార్ట్జ్ గాజు
సి) ఫ్లింట్ గాజు
డి) బోరోసిలికేట్ గాజు
- View Answer
- సమాధానం: బి
18. గాజును కోయడానికి ఉపయోగించే పదార్థం?
ఎ) గాజు
బి) వజ్రం
సి) స్టీల్
డి) టంగ్స్టన్
- View Answer
- సమాధానం: బి
19. పోర్టలాండ్ సిమెంట్‌లోని ప్రధాన అనుఘటకాలు?
ఎ) సున్నం, సిలికా, ఐరన్ సల్ఫైడ్
బి) సున్నం, సిలికా, సోడా
సి) సున్నం, సిలికా, అల్యూమినా
డి) సిలికా, సున్నం, ఐరన్ ఆక్సైడ్
- View Answer
- సమాధానం: సి
20. గాజు అనేది ఒక..?
ఎ) విద్యుత్ వాహకం
బి) ఉష్ణ వాహకం
సి) ఉష్ణబంధకం (ఇన్సులేటర్)
డి) అర్ధ వాహకం
- View Answer
- సమాధానం: సి
21. బంకమట్టి నుంచి సిమెంట్లోకి ప్రధానంగా చేరేది?
ఎ) కాల్షియం సిలికేట్
బి) అల్యూమినియం సిలికేట్
సి) సోడియం సిలికేట్
డి) సోడియం కార్బొనేట్
- View Answer
- సమాధానం: బి
22. కిటికీ అద్దాలు, గాజుసీసాల తయారీకి ఉపయోగించే గాజు?
ఎ) ఫ్లింట్ గాజు
బి) సోడా గాజు (మెత్తని గాజు)
సి) గట్టిగాజు
డి) పెరైక్స్ గాజు
- View Answer
- సమాధానం: బి
23. గ్లాస్ బ్లోయింగ్ ప్రక్రియలో వాడే వాయువు?
ఎ) ఆక్సిజన్
బి) ఎసిటలీన్
సి) ఆక్సీ-ఎసిటలీన్
డి) హైడ్రోజన్
- View Answer
- సమాధానం: సి
ఎ) మాంగనీస్ డై ఆక్సైడ్ 1) ఊదా
బి) కోబాల్ట్ ఆక్సైడ్ 2) నీలం
సి) క్రోమియం ఆక్సైడ్ 3) ఆకుపచ్చ
డి) క్యూప్రస్ ఆక్సైడ్ 4) ఎరుపు
ఎ) ఎ-1 బి-2 సి-3 డి-4
బి) ఎ-4 బి-3 సి-2 డి-1
సి) ఎ-2 బి-4 సి-1 డి-3
డి) ఎ-3 బి-1 సి-4 డి-2
- View Answer
- సమాధానం: ఎ
25. గాజుపై గాట్లు పెడుతూ ఎచ్చింగ్ చేయడానికి వాడే ఆమ్లం ఏది?
ఎ) హైడ్రోక్లోరికామ్లం (HCl)
బి) హైడ్రోఫ్లోరికామ్లం (HF)
సి) నైట్రికామ్లం (HNO3)
డి) సల్ఫ్యూరికామ్లం (H2SO4)
- View Answer
- సమాధానం: బి
26. వాటర్ గ్లాస్ అని దేనికి పేరు? (Gr-II, 2012)
ఎ) సోడియం సిలికేట్
బి) అల్యూమినియం సిలికేట్
సి) జింక్ సిలికేట్
డి) కాల్షియం సిలికేట్
- View Answer
- సమాధానం: ఎ
27. అతినీలలోహిత కిరణాలకు పారదర్శకంగా పని చేసే గాజు?
ఎ) ఫ్లింట్ గాజు
బి) క్వార్ట్జ్ గాజు
సి) పెరైక్స్ గాజు
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: బి
28. బుల్లెట్ ఫ్రూఫ్ గ్లాస్‌ను దేనితో తయారు చేస్తారు?
ఎ) క్వార్ట్జ్ గాజు
బి) మెత్తని గాజు
సి) గట్టిగాజు పొరల మధ్య థర్మోప్లాస్టిక్ పాలీకార్బొనేట్ పొరలను బలంగా అతికిస్తారు
డి) బోరోసిలికేట్ గాజు
- View Answer
- సమాధానం: సి