Skip to main content

TS Inter Advanced Supplementary Exams: ఆగ‌స్టు 1 నుంచి ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు.. పూర్తి వివ‌రాలు ఇవే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్‌,సెకండియర్‌ ఫలితాలు విడుదల‌య్యాయి. ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జూన్ 28వ తేదీన (మంగళవారం) ఉదయం 11 గంటలకు విడుదల చేశారు.
 Sabitha Indra Reddy, Telangana Education Minister
Sabitha Indra Reddy, Telangana Education Minister

ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ ఏడాది ఇంట‌ర్ ఫలితాల్లో విద్యార్థులు ఫస్టియర్‌లో 63.32 శాతం, సెకండ్‌ ఇయర్‌లో 67.16 శాతం ఉత్తీర్ణత సాధించార‌న్నారు. అలాగే ఆగస్టు 1వ తేదీ నుంచి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను నిర‍్వహిస్తామ‌న్నారు. జూలై 30వ తేదీ నుంచి సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపునకు అవకాశం కల్పించారు. అలాగే ఆగస్టు చివరి నాటికి సప్లిమెంటరీ ఫలితాలు విడుదల చేయనున్నట్టు మంత్రి సబిత ఇంద్రారెడ్డి తెలిపారు.ఒకే ఒక‌ క్లిక్‌తో ఇంటర్‌ ఫస్టియర్‌, సెంకడ్‌ ఇయర్‌ ఫలితాల‌ను సాక్షిఎడ్యుకేష‌న్‌.కామ్‌ (www.sakshieducation.com)లో చూడొచ్చు. 

టీఎస్ ఇంట‌ర్ ఫస్టియర్ ఫ‌లితాల కోసం క్లిక్ చేయండి 

టీఎస్ ఇంట‌ర్ సెకండియర్‌ ఫ‌లితాల కోసం క్లిక్ చేయండి

 

Published date : 28 Jun 2022 12:57PM

Photo Stories