Skip to main content

Inter entrance exam 2024: రేపు ఇంటర్‌ ప్రవేశ పరీక్ష

రేపు ఇంటర్‌ ప్రవేశ పరీక్ష
Inter entrance exam 2024 - రేపు ఇంటర్‌ ప్రవేశ పరీక్ష
Inter entrance exam 2024 - రేపు ఇంటర్‌ ప్రవేశ పరీక్ష

షాద్‌నగర్‌రూరల్‌: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల ప్రతిభ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరంలో చేరేందుకు ఈ నెల 4న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు కమ్మదనం గురుకుల సీఓఈ కళాశాల ప్రిన్సిపాల్‌ విద్యుల్లత శుక్రవారం ఒకప్రకటనలో తెలిపారు. గురుకులాల సంస్థ కార్యదర్శి డాక్టర్‌ నవీన్‌నికోలస్‌ ఆదేశాల మేరకు సీఓఈ సెట్‌ 2024–25 విద్యా సంవత్సరానికి.. పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మండల పరిధి కమ్మదనం గురుకుల కళాశాలలో ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 1గంటల వరకు పరీక్ష ఉంటుందని వెల్లడించారు.

Also Read : Study Material

ఇందుకు పదో తరగతి చదివే విద్యార్థులు అర్హులని, దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరూ ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. ఉదయం 9గంటల వరకు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని తెలిపారు. విద్యార్థులు తప్పని సరిగా తమ వెంట ఆధార్‌ కార్డు, పాఠశాల సంబంధిత బోనఫైడ్‌, బ్లూ, బ్లాక్‌ పెన్ను, హాల్‌టికెట్‌, పరీక్ష ప్యాడ్‌ తెచ్చుకోవాలన్నారు. సెల్‌ఫోన్‌, ఎలక్ట్రిక్‌ పరికరాలు అనుమతించబడవని తెలిపారు.

Published date : 03 Feb 2024 04:43PM

Photo Stories