TS Intermediate Results: ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు విడుదల..ఫలితాల కోసం క్లిక్ చేయండి
ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో మొత్తం 4,59,242 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 2,24,012 మంది (49శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఇందులో బాలికలు 56 శాతం ఉండగా.. బాలురు 42 శాతం ఉత్తీర్ణత సాధించారు. కరోనా వైరస్ కారణంగా గత సంవత్సరం ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు రద్దు అయిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలను ఇటీవల నిర్వహించింది ఇంటర్ బోర్డు. ఈ పరీక్షా ఫలితాలను ఇంటర్ బోర్డు ఎట్టకేలకు విడుదల చేశారు.
ఇంటర్ ఫస్టియర్ ఫలితాలను..
ఈ విద్యా సంవత్సరం ఇంటర్ పరీక్షలను 2020 ఏప్రిల్ నెలలో నిర్వహించాలని అధికారులు భావించారు. షెడ్యూల్ ప్రకారం మార్చి 23 నుంచి పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే ఎట్టకేలకు అక్టోబర్ 25వ తేదీ నుంచి నవంబర్ 3వ తేదీ వరకు ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించారు.ఇంటర్ ఫస్టియర్ ఫలితాలను education.sakshi.comలో చూడొచ్చు.
పరీక్షలకు ఎక్కువ శాతం చాయిస్ ప్రశ్నలే..
కొద్దిపాటి శ్రద్ధ తీసుకునే విద్యార్థి కూడా గట్టెక్కే రీతిలో పరీక్షలు ఉండేలా ప్రశ్నపత్రాన్ని ఇచ్చారు. అన్ని సబ్జెక్టుల్లోనూ చాయిస్ ఎక్కువగా ఉండే విధంగా ఇచ్చారు. కరోనా కారణంగా ఫస్టియర్ పరీక్షలు లేకుండా విద్యార్థులను ద్వితీయ సంవత్సరానికి అనుమతించిన విషయం తెలిసిందే. మునుపటికన్నా భిన్నంగా, రాయాల్సిన వాటికన్నా ప్రశ్నలు ఎక్కువగా ఇచ్చారు. దీనివల్ల ఏదో ఒక ప్రశ్నకు విద్యార్థి సిద్ధమై ఉంటాడని, సులభంగా జవాబు రాసే వీలు ఉండే విధంగా ఇచ్చారు.
70 శాతం సిలబస్‌లోంచే..
ఈ సారి పరీక్షలకు 70 శాతం సిలబస్‌లోంచే ప్రశ్నాపత్రం రూపొందించారు. మునుపెన్నడూ లేని విధంగా 40 శాతం ఐచ్చిక ప్రశ్నలు ఇచ్చారు.ఈ పరీక్షలకు వ్యాక్సినేషన్ పూర్తయిన ఇన్విజిలేటర్లే పాల్గొన్నారు.