Skip to main content

Special Admission: ‘ఓపెన్‌’ ప్రవేశాల గడువు పొడిగింపు.. ఎప్ప‌టి వ‌ర‌కు అంటే..

ఓపెన్‌ స్కూల్‌లో స్పెషల్‌ అడ్మిషన్లకు డిసెంబ‌ర్ 11వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు డీఈ ఓ అబ్దుల్‌హై, ఉమ్మడి జిల్లా ఓపెన్‌ స్కూల్‌ కో–ఆర్డి నేటర్‌ మురాళ శంకర్‌రావు తెలిపారు.
Special Admission schedule for SSC and Intermediate TOSS is extended

ఉమ్మడి జిల్లాలో తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ విధానంలో ఈ విద్యా సంవత్సరం టెన్త్‌, ఇంటర్‌లో ప్రవేశాలకుగాను అపరాధ రుసుంతో ఈ నెల 11 వరకు గడువు పొడిగిస్తున్నట్లు వారు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తిగలవారు సమీపంలోని ఓపెన్‌ స్కూల్‌ అధ్యయన కేంద్రాలులైన ఉన్నత పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో హెచ్‌ఎంలు, ప్రిన్సిపాళ్లను సంప్రదించాలని తెలిపారు. మరిన్ని వివరాలకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.తెలంగాణఓపెన్‌స్కూల్‌.ఓఆర్‌జీ (www.telanganaopenschool.org) వెబ్‌సైట్‌ను సంప్ర‌దించండి.

Free Awareness Conference: పోటీ పరీక్షలపై ఉచిత అవగాహన సదస్సు.. ఎక్క‌డంటే..

Published date : 05 Dec 2023 11:11AM

Photo Stories