Department of Education: ఇంటర్ బోర్డ్ బాధ్యతల్లో మిత్తల్ కొనసాగింపు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ బోర్డ్ కార్యదర్శిగా నవీన్ మిత్తల్‌ను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి మీడియాకు తెలిపారు.
మిత్తల్‌ను ఇటీవల రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీగా ప్రభుత్వం బదిలీ చేసింది. అయితే ఇంటర్ బోర్డ్, సాంకేతిక విద్యకు కార్యదర్శిని ఇంకా నియమించలేదు. కొత్తవారిని నియమించేవరకు ఆయననే కొనసాగించాలని ఆదేశించినట్టు తెలిసింది.
చదవండి: టిఎస్ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | TIME TABLE 2023 | టైం టేబుల్ 2023 | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | న్యూస్ | ఏపీ ఇంటర్
మిత్తల్ ఆన్‌లైన్ మూల్యాంకన ద్వారా ఇంటర్ పరీక్ష విధానంలో మార్పు నకు శ్రీకారం చుట్టారు. మూల్యాంకనలో ప్రైవేట్‌వారికి సహక రిస్తున్న వ్యక్తులపై నిఘాపెట్టి నియంత్రించారు. ఈ దశలో మిత్తల్‌ను బోర్డ్ నుంచి తప్పిస్తే సమస్యలు వస్తాయనే ఆలోచన తోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
Published date : 10 Feb 2023 03:05PM