Skip to main content

Intermediate: ఇంటర్‌ హల్‌టికెట్‌ ఆన్‌లైన్‌లో... 28 నుంచి పరీక్షలు

ఆసిఫాబాద్‌ రూరల్‌: విద్యార్థి భవిష్యత్‌ మలుపు తిప్పే ఇంటర్మీడియట్‌ పరీక్షలు ఫిబ్ర‌వ‌రి 28 నుంచి ప్రారంభం కానున్నాయి.
Students Preparing for Intermediate Exams   Asifabad Rural Education: Intermediate Exams  Inter Hall Tickets    Asifabad Rural Intermediate Examinations   10,423 Students Ready for Intermediate Exams in Asifabad District

ఈ పరీక్షలకు జిల్లాలో 19పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 48 కళాశాలల్లో 10,423 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్ష కేంద్రాల్లో ఇబ్బందులు లేకుండా మంచి నీరు, ప్యా న్లు, మూత్రశాలలు, బెంచీలు వంటి సౌకర్యాలు కల్పించాలని ఇప్పటికే కలెక్టర్‌ సంబంధిత అధికారులకు సూచించారు. జిల్లాలో ఫిబ్రవరి 1 నుంచి ప్రాక్టికల్‌ పరీక్షలు ప్రారంభం కాగా ఈ నెల 28 నుంచి వార్షిక పరీక్షలు జరుగనున్నాయి.

జిల్లాలో 19 పరీక్ష కేంద్రాలు...

ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షల కోసం జిల్లాలో 19 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో ఆసిఫాబాద్‌లో 5, ప్రభుత్వ కళాశాల, మోడల్‌ స్కూల్‌, గిరిజన బాలుర, బాలికల కళాశాల, సాంఘిక సంక్షే మ గురుకులం కాగజ్‌నగర్‌లో 3, ప్రభుత్వ కళాశా ల, వివేకనంద, మహత్మాగాంధీ జ్యోతిబాపూలే బా లికల కళాశాలతో పాటు జైనూర్‌, సిర్పూర్‌, కౌటా ల, బెజ్జూర్‌, తిర్యాణి, దహేగాం, కెరమెరి, రెబ్బెనలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఒక్కొక్కటి ప రీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.

చదవండి: టిఎస్ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | టైం టేబుల్ 2024 | సిలబస్ | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | న్యూస్ | ఏపీ ఇంటర్

జిల్లాలో మొత్తం 48 కళాశాలకు ప్రభుత్వ కళాశాలు 11, ప్రైవేట్‌ కళాశాలలు 5, 32 గురుకుల, మైనార్టీ కేజీబీవీ, మోడల్‌ స్కూల్స్‌ ఉన్నాయి. మొత్తం 10,423 మంది చదువుకుంటున్నారు. ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో జనరల్‌ 4,567 మంది ఒకేషనల్‌ 852 మంది, సెకండియర్‌లో జనరల్‌ 4,310 మంది, ఒకేషనల్‌లో 694 మంది విద్యార్థులు ఉన్నారు.

హల్‌టికెట్‌ ఆన్‌లైన్‌లో..

పరీక్ష రాసే విద్యార్థులు తమ హల్‌టెకెట్‌ను ఆన్‌లైన్‌ ద్వారానే తీసుకోవచ్చు. హల్‌ టికెట్‌తో నేరుగా పరీక్ష సెంటర్‌ రావచ్చు. పరీక్ష ఉదయం 9 నుంచి 12గంటల వరకు నిర్వహించే ఇంటర్మీడిట్‌ పరీక్షలకు విద్యార్థులు తమ హల్‌ టికెట్‌, పెన్నులు, ప్యాడ్‌ మినహించి ఎలాంటి ఎలక్ట్రానిక్‌ వస్తువులు, సెల్‌ ఫోన్‌ అనుమతి లేదు. అరగంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. పరీక్ష ప్రశ్న పత్రాలను సీసీ కెమోరా నిఘాలో ఓపెన్‌ చేయాల్సి ఉంటుంది. మాస్‌ కాపింగ్‌కు పాల్పడకుండా ప్లెయింగ్‌ స్కాడ్‌ బృందం, డీటీ, ఏఎస్సై, అధ్యాపకులు, రెండు సిట్టింగ్‌ స్కాడ్‌ బృందాలు 3, సీఎస్‌, డీవోలు, ఇన్విజిలేటర్లు అదనపు కలెక్టర్‌, కలెక్టర్‌ పర్యవేక్షించనున్నారు.


ఏర్పాట్లు పూర్తి చేస్తాం...

జిల్లా వ్యాప్తంగా 19 పరీక్ష కేంద్రాల్లో 10423 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఈసారి కూడా మంచి ఫలితాలు సాధించే విధంగా విద్యార్థులను సన్నద్ధం చేశాం.
– శంకర్‌, డీఐఈవో

ఆరేళ్లుగా రాష్ట్రంలో టాప్‌ 5లో జిల్లా...

ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో ఆరేళ్లుగా జిల్లా విద్యార్థులు సత్తా చాటుతున్నారు. సమష్టి కృషితో ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు ప్రైవేట్‌ కళాశాలలకు ధీటుగా ఫలితాలు సాధిస్తున్నారు. గత సంవత్సరం జిల్లా సెకండ్‌ స్థానంలో నిలిచింది. ఈసారి కూడా మంచి ఫలితాలు సాధిస్తామని డీఐఈవో శంకర్‌ తెలిపారు. 2019లో 80శాతంతో రాష్ట్రంలో 1, 2020లో 75 శాతంతో 2వ స్థానం, 2022లో 80శాతంతో 2వ స్థానం, 2023లో 81శాతంతో రాష్ట్రంలో రెండవ స్థానంలో కుమురంభీం నిలిచింది.

Published date : 26 Feb 2024 03:09PM

Photo Stories