Inter: ఇంటర్ పరీక్షలు ప్రశాంతం
Sakshi Education
ఇంటర్మీడియట్ ఫస్టియర్ పబ్లిక్ పరీక్షలు తొలిరోజు ప్రశాంతంగా జరిగాయి.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 4,59,240 మంది విద్యార్థులు ఫస్టియర్ పరీక్షలు రాయాల్సి ఉండగా.. అక్టోబర్ 25న జరిగిన ద్వితీయ భాష పేపర్–1 పరీక్షకు 4,29,177 మంది విద్యార్థులు హాజరయ్యారు. 30,063 మంది గైర్హాజరయ్యారు. మొత్తం విద్యార్థుల్లో 6.5 శాతం గైర్హాజరయ్యారని, ఎలాంటి మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని ఇంటరీ్మడియట్ బోర్డు కార్యదర్శి అక్టోబర్ 25న ఒక ప్రకటనలో తెలిపారు.
చదవండి:
Published date : 26 Oct 2021 04:45PM