TSBIE: ఇంగ్లిష్ ప్రాక్టికల్ పరీక్ష తేదీ ఇదే..
Sakshi Education
ఖమ్మం సహకారనగర్: ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఆయా కళాశాలల్లో ఫిబ్రవరి 16న ఇంగ్లిష్ ప్రాక్టికల్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కె.రవిబాబు తెలిపారు.
జనరల్ విభాగం విద్యార్థులకు 20మార్కులు, ఒకేషనల్ విభాగం విద్యార్థులకు పది మార్కులు కేటా యించారని పేర్కొన్నారు. ఇప్పటివరకు జరిగి న మూడు దశల్లో హాజరుకావాలని వారికి ఇదే చివరి అవకాశమని వెల్లడించారు. కాగా, జిల్లాలోని 131 కళాశాలల నుంచి జనరల్ విభాగంలో 16,006మంది, ఒకేషననల్ విభాగం నుంచి 2,462మంది పరీక్షకు హాజరుకానున్నారని తెలిపారు.
చదవండి: టిఎస్ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | టైం టేబుల్ 2024 | సిలబస్ | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | న్యూస్ | ఏపీ ఇంటర్
ఇక నైతికత, మానవ విలువల పరీక్ష గతంలో రాయని వారు 17న పరీక్ష రాయొచ్చని, 19న నిర్వహించే పర్యావరణ విద్య పరీక్ష ప్రథమ సంవత్సరం విద్యార్థులంతా రాయాల్సి ఉంటుందని డీఐఈఓ వెల్లడించారు.
Published date : 15 Feb 2024 01:27PM