మూల్యాంకనంపై అనుమానాలున్నాయి
అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న గ్లోబరీనా సంస్థ మారుపేర్లతో కాంట్రా క్టు దక్కించుకునే ప్రయత్నం చేస్తోందని ఆయన అన్నారు. తన సంఘం కార్యాలయంలో ఫిబ్రవరి 7న జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఫిబ్రవరి 1న జరిగిన ప్రీ బిడ్ మీటింగ్‌లో పాల్గొన్న 9 కంపెనీల్లో ఒక కంపెనీ సీఈవో, ఎండీ.. గ్లోబరీనా కంపెనీకి చెందినవారు ఒకరే కావడం అనుమానాలకు తావిస్తోందన్నారు.
చదవండి: టిఎస్ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | TIME TABLE 2023 | టైం టేబుల్ 2023 | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | న్యూస్ | ఏపీ ఇంటర్
అన్నీ తప్పుడు ఆరోపణలు: నవీన్ మిత్తల్
అవినీతి, ఇతర కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న మధుసూదన్ రెడ్డి ఇంటర్ బోర్డ్ ప్రతిష్టను దిగజార్చేలా నిరాధార ఆరోపణలు చేస్తున్నారని తెలంగాణ ఇంటర్ బోర్డ్ కార్యదర్శి నవీన్ మిత్తల్ స్పష్టం చేశారు. బోర్డ్‌లో అక్రమ చొరబాటుకు ప్రయత్నించిన నేరంపై చార్జిషిటు దాఖలవ్వడంతో తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఇదిలా ఉండగా, తమ సంస్థపై ఆసత్య ఆరోపణలు చేయడాన్ని తప్పుబడుతూ గ్లోబరీనా సంస్థ మధుసూదన్ రెడ్డికి లీగల్ నోటీసు ఇచ్చింది.